కృష్ణ, మధు, లవ్లీసింగ్, రాజేంద్రప్రసాద్, శ్రీవిష్ణు, సత్య
‘‘నా కెరీర్‌లో చేసిన సరికొత్త ప్రయత్నం ‘గాలి సంపత్’. ‘అన్నయ్యా.. ఈ చిత్రంలో ఆస్కార్ అంత పర్‌ఫార్మెన్స్ చేశావు’ అనే అభినందనలను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను.. నా గుండెల్లో ఉంచుకుంటాను’’ అని నటుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. శ్రీవిష్ణు, లవ్లీ సింగ్ జంటగా అనీష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గాలి సంపత్’. డైరెక్టర్ అనిల్ రావిపూడి సమర్పణలో షైన్ స్క్రీన్స్‌తో కలిసి ఎస్.కృష్ణ నిర్మించిన ఈ సినిమా గురువారం విడుదలైంది.
హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ఫిలిం స్కూల్‌లో ఉన్నప్పుడు నాకు మైమ్ పర్‌ఫార్మెన్స్‌లోనే గోల్డ్ మెడల్ వచ్చింది. ఇన్ని సంవత్సరాలకు ఆ డ్రెస్ వేసుకుని స్టేజ్ మీదకు రావడానికి మా మైమ్ మధునే కారణం’’ అన్నారు.
‘‘మా సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారని గ్యారెంటీగా చెప్పగలను’’ అన్నారు ఎస్.కృష్ణ. ‘‘మీ పిల్లలు, కుటుంబంతో సినిమా చూస్తే మరింత ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు శ్రీవిష్ణు. ‘‘మైమ్ ముఖ అభినయాన్ని సినిమాలో పెట్టాలంటే దమ్ముండాలి. ఎస్.కృష్ణగారి ఆలోచనకి హ్యాట్సాఫ్’’ అన్నారు మైమ్ మధు. ఈ కార్యక్రమంలో కమెడియన్ సత్య, హీరోయిన్ లవ్లీ సింగ్ మాట్లాడారు.
చదవండి:
పొలిటికల్ ఎంట్రీపై స్పందించిన ఎన్టీఆర్
కన్నీళ్లు పెట్టుకున్న జాతిరత్నం నవీన్ పొలిశెట్టి
Comments
Please login to add a commentAdd a comment