
చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ ఛాయాగ్రాహకులు, దర్శక - నిర్మాత రాజేంద్ర ప్రసాద్ ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు(ఆగస్ట్ 19) తుదిశ్వాస విడిచారు. 'ఆ నలుగురు' చిత్ర దర్శకుడు చంద్ర సిద్ధార్థ్‌కు ఈయన సోదరుడు. తెలుగులో 'నిరంతరం(1995)’ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు పాటు నిర్మాతగాను వ్యవహరించాడు. ఈ చిత్రం పలువురి ప్రశంసలు అందుకోవడమే కాకుండా మలేషియాలోని కైరో చలన చిత్రోత్సవాలకు ఎంపిక అయ్యింది.
రాజేంద్ర ప్రసాద్ పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. ఆయన ప్రాధమిక విద్యాభాసం అంతా ఇక్కడే జరిగింది. పుణెలోలో ఓ ప్రముఖ ఫిల్మ్ స్కూల్‌లో సినిమాగ్రఫీని నేర్చుకున్నాడు. పలు ఇంగ్లీష్, పెర్షియన్ సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించాడు. హాలీవుడ్‌లో 'మన్ విమన్ అండ్ ది మౌస్', 'రెస్డ్యూ - వేర్ ది ట్రూత్ లైస్' 'ఆల్ లైట్స్, నో స్టార్స్' చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు అన్నిటికీ ఆయనే సినిమాటోగ్రఫీ, రైటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.