‘క్లైమాక్స్’ లో నా నటనను చూసిన షాక్ అవుతారు’ | Rajendra Prasad Climax Movie Trailer Out | Sakshi
Sakshi News home page

‘క్లైమాక్స్’ లో నా నటనను చూసిన షాక్ అవుతారు’

Published Sat, Feb 13 2021 3:02 PM | Last Updated on Sat, Feb 13 2021 4:05 PM

Rajendra Prasad Climax Movie Trailer Out - Sakshi

నటకిరీటి రాజేంద్రప్రసాద్‌తో ఇంతవరకు ఎవ్వరు తీయని కొత్త కథతో, ఎప్పుడు చూడని ఎలిమెంట్స్ తో, రాజేంద్రప్రసాద్ ఇటువంటి అద్భుతమైన పాత్రలు చేస్తాడా అనే విధంగా డఫరెంట్‌ కాన్సెప్ట్ తో ‘క్లైమాక్స్’ సినిమా ద్వారా మీ ముందుకు వస్తున్నాం’అని అంటున్నారు చిత్ర దర్శకుడు భవాని శంకర్.

కైపాస్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై నటకిరీటి రాజేంద్రప్రసాద్, సాషా  సింగ్,శ్రీ రెడ్డి,పృద్వి,శివ శంకర మాస్టర్,రమేష్ నటీనటులుగా భవాని శంకర్. కె.  దర్శకత్వంలో కరుణాకర్ రెడ్డి ,రాజేశ్వర్ రెడ్డి లు నిర్మించిన చిత్రం ‘క్లైమాక్స్’. ఈ చిత్ర ట్రైలర్ ను హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ తో పాటు యఫ్.డి.సి.చైర్మన్ రామ్మోహన్ రావు , ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రెటరీ ప్రసన్న కుమార్ లు ముఖ్య అతిథిలుగా పాల్గొని "క్లైమాక్స్" చిత్రం ట్రైలర్ ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా నటకిరీటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ‘భవాని శంకర్ ఒక డిఫరెంట్‌,టఫ్ సబ్జెక్ట్ తో నా ముందుకు వచ్చాడు. ఇందులో నా క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పటి వరకు నేను ఎప్పుడు చేయనటువంటి పాత్రలో నటించాను. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కచ్చితంగా షాక్ కు గురవుతారు. మనం సినిమాను ఎన్ని థియేటర్లలో విడుదల చేశాము అనే దానికంటే మన కంటెంట్ ఎంత మందికి రీచ్ అయింది అనేది ఇంపార్టెంట్. అందరి సపోర్ట్ తో ఈ మూవీ ప్రేక్షకులందరికీ రీచ్ అవ్వాలి అప్పుడే ఇలాంటి క్రియేటివిటీ ఉన్న డైరెక్టర్లు వెలుగులోకి వస్తారు. తను తీసిన డ్రీమ్ సినిమా కమర్షియల్ గా ఎంతో హిట్టయింది.

ఆ సినిమాకు తను ఎన్నో అవార్డ్స్ తీసుకున్నాడు. ఇప్పుడు మళ్లీ "క్లైమాక్స్" చిత్రం ద్వారా డిఫరెంట్‌ కాన్సెప్ట్ తో మన ముందుకు వస్తున్నాడు. ఇలాంటి మంచి మూవీలో అద్భుతమైన పాత్ర ఇచ్చిన భవానీశంకర్ నా కృతజ్ఞతలు.ఇందులో ఎంటర్టైన్మెంట్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. నేను చేసిన గెటప్స్, క్యారెక్టరైజేషన్ ఇవన్నీ కూడా నేను ఎంతో ఇష్టపడి, ముచ్చటపడి నటించడం జరిగింది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సినిమా చాలా బాగుందనిఅభినందించడమే  కాక మీరే 100 మందికి చూడమని చెప్పేలా ఉంటుంది’అని రాజేంద్రప్రసాద్‌ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement