రాజేంద్రప్రసాద్‌తో వైవీయస్ చౌదరి, శ్యామ్, శ్యామల్‌రావు, నరేశ్, రసూల్, శ్రీను
‘తెలుగు సినీ స్టిల్ ఫొటోగ్రాఫర్స్’ అసోసియేషన్ ఆధ్వర్యంలో 181వ ‘వరల్డ్ ఫొటోగ్రఫీ డే’ ఉత్సవాలు సోమవారం హైదరాబాద్‌లో జరిగాయి. తెలుగు సినిమా స్టిల్ ఫొటోగ్రాఫర్ల అధ్యక్షుడు కఠారి శ్రీను, జనరల్ సెక్రటరీ జి. శ్రీను, వైస్ ప్రెసిడెంట్ సుబ్బారావు .యస్, ట్రెజరర్ వీరభద్రమ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన నటుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ– ‘‘మూడు తరాల స్టిల్ ఫొటోగ్రాఫర్లతో నాకు అనుబంధం ఉంది. వారు నాకు కుటుంబం లాంటివాళ్లు. ఒకప్పుడు ఫొటోలతోనే నా పబ్లిసిటీ నడిచింది.
బి.ఎన్. రెడ్డిగారు, ఎన్టీఆర్‌గారు... ఇలా ఎంతో మంది లెజెండ్స్‌తో నాకు పరిచయం ఉంది. వారందరితో ఉన్న ఫొటోలు చూసుకుని ఆనాటి విషయాలను గుర్తు చేసుకుని ఆనందిస్తుంటాను’’ అన్నారు. సీనియర్ ఫొటోగ్రాఫర్లు శ్యామల్ రావు, శ్యామ్‌లను ఈ వేదికపై సత్కరించారు. హీరో ‘అల్లరి’ నరేష్, దర్శకుడు వీవీ వినాయక్, దర్శక–నిర్మాత వైవీయస్ చౌదరి, కెమెరామేన్, డైరెక్టర్ రసూల్ ఎల్లోర్, పలువురు సినీ స్టిల్ ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment