‘వికటకవి’కోసం ‘మాభూమి’ సినిమా చూశాను: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి | Costume Designer Josyula Gayathri Devi Talks About Vikatakavi Web Series | Sakshi
Sakshi News home page

‘వికటకవి’కోసం ‘మాభూమి’ సినిమా చూశాను: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

Published Fri, Nov 29 2024 3:21 PM | Last Updated on Fri, Nov 29 2024 3:29 PM

Costume Designer Josyula Gayathri Devi Talks About Vikatakavi Web Series

విక‌ట‌క‌వి సిరీస్ తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో తెర‌కెక్కింది. అది కూడా పీరియాడిక్ క‌థాంశం కావ‌టంతో, చాలా రీసెర్చ్ చేశాను. 1940 స‌మ‌యంలో హైద‌రాబాద్ ఎలా ఉండిందో ముందు నేను తెలుసుకోవాల‌నుకుంటున్న స‌మ‌యంలో మా అసోసియేట్స్ ఏం చెప్పారంటే ‘మాభూమి’ అనే తెలంగాణ మూవీని చూడ‌మ‌న్నారు. ఆ సినిమా ద్వారా నాటి హైద‌రాబాద్ ఎలా ఉండింది.. అప్ప‌టి ప్ర‌జ‌ల వేష‌ధార‌ణ‌, సంస్కృతి, సాంప్ర‌దాయాల గురించి తెలిసింది. దానికి త‌గ్గ‌ట్టు టీమ్‌ను ప్రిపేర్ చేశాను. క‌థ‌కు త‌గ్గ‌ట్లు ప్యాంట్, షర్ట్ ఎలా ఉండాల‌నే దానిపై వీడియోల‌ను డౌన్ లోడ్ చేశాను. లుక్ టెస్టుల‌ను చేశాం. టెక్నీషియ‌న్స్‌గా ఇదొక డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్‌నిచ్చింది’ అన్నారు కాస్ట్యూమ్ డిజైన‌ర్ జోశ్యుల‌ గాయ‌త్రి దేవి. 

 నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో  తెరకెక్కిన వెబ్‌ సిరీస్‌ ‘వికటకవి’. నవంబర్‌ 28 నుంచి ఈ వెబ్‌ సిరీస్‌ ప్రముఖ ఓటీటీ జీ5లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా  జోశ్యుల గాయ‌త్రి దేవి మీడియాతో ముచ్చటిస్తూ..  ఈ పీరియాడిక్ డిటెక్టివ్ వెబ్ సిరీస్‌ అనుభవాలను పంచుకున్నారు. 

రెగ్యుల‌ర్‌గా ఇత‌ర డిజైన‌ర్స్ వ‌చ్చి నా ద‌గ్గ‌ర స్టిచింగ్ చేసుకుని వెళుతుండేవారు. అలా మొద‌లైన ఈ ప్ర‌యాణంతో నేను కూడా మెల్ల‌గా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టాను. ప‌లాస మూవీకి నేను డిజైనింగ్ మాత్ర‌మే చేసిచ్చాను... షూట్‌కి వెళ్ల‌లేదు. అయితే ఆహా వాళ్లు చేసిన కుడిఎడ‌మైతే వెబ్ సిరీస్ ద్వారా కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా నా కెరీర్ ఇక్క‌డ స్టార్ట్ అయ్యింది. త‌ర్వాత పారాహుషార్ అనే మ‌రో సినిమాకు వ‌ర్క్ చేశాను. అయితే కొన్ని కార‌ణాల‌తో ఆ సినిమా విడుద‌ల కాలేదు. త‌ర్వాత క‌రుణ‌కుమార్‌గారు రూపొందించిన క‌ళాపురం సినిమాకు వ‌ర్క్‌చేశాను. త‌ర్వాత ప్ర‌దీప్ మ‌ద్దాలిగారు డైరెక్ట్ చేసిన స‌ర్వం శ‌క్తిమ‌యం సిరీస్‌కు కాస్ట్యూమ్ డిజైనింగ్ వ‌ర్క్‌చేశాను. ఈ వెబ్ సిరీస్ నాకు చాలా ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చింది. ఎందుకంటే ఓ ఫుల్ ఔట్‌డోర్ ప్రాజెక్ట్‌ని త‌క్క‌వు బ‌డ్జెట్‌..త‌క్కువ మ్యాన్ ప‌వ‌ర్‌తో ఎలా హ్యాండిల్ చేయాలి అని తెలుసుకున్నాను.

సర్వం శ‌క్తి మ‌యం సిరీస్‌కు ప‌ని చేయ‌టం నాకు విక‌ట‌క‌వి సిరీస్‌కు వ‌ర్క్ చేయ‌టానికి ఎంతగానో హెల్ప్ అయ్యింది. నిజానికి స‌ర్వం శ‌క్తిమ‌యం సిరీస్ త‌ర్వాత పీపుల్ మీడియా బ్యాన‌ర్ సంస్థ నిర్మించిన సిరీస్ హ‌రిక‌థ‌కు వ‌ర్క్ చేశాను. అది కూడా పీరియాడిక్ సిరీస్ 90వ ద‌శ‌కం క‌థ‌,క‌థ‌నంతో రూపొందింది. డిసెంబ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. త్రీరోజెస్ ఫేమ్ మ్యాగీ ఈ సిరీస్‌ను డైరెక్ట్ చేశారు. దీంతో పాటు విక‌ట‌క‌వి సిరీస్‌కు వ‌ర్క్ చేసే అవ‌కాశం ఒకేసారి వ‌చ్చింది. పీరియాడిక్ సిరీస్‌ల్లో హ‌రిక‌థ ముందుగా స్టార్ట్ అయ్యింది.

ఒక సిరీస్ షూట్ ఉన్న‌ప్పుడు మ‌రో సిరీస్ షూట్ లేకుండా ఉండ‌టం కూడా కాస్త క‌లిసొచ్చింది. అలాగే హ‌రిక‌థ చేసిన వ‌ర్క్ విక‌ట‌క‌వి విష‌యంలో హెల్ప్ అయ్యింద‌నే చెప్పాలి. ఇలాంటి డిఫ‌రెంట్ కాన్సెప్ట్ సిరీస్‌లకు వ‌ర్క్ చేయ‌టం అనేది రెగ్యుల‌ర్‌గా సాధ్యంకాదు. అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడు అందిపుచ్చుకోవాలంతే.

సిరీస్‌ల‌కు వ‌ర్క్ చేసే స‌మ‌యంలో బ‌డ్జెట్‌కు సంబంధించిన ప‌రిమితులుంటాయి. త‌క్కువ బ‌డ్జెట్‌లో ఎక్కువ ఔట్‌పుట్ ఎదురు చూస్తారు. అయితే సినిమాల విష‌యానికి వ‌చ్చే స‌రికి బ‌డ్జెట్ విష‌యంలో కాస్త వెసులుబాటు ఉంటుంది. సిరీస్‌ల‌కు వ‌ర్క్ చేసేట‌ప్పుడు డైరెక్ట‌ర్‌తో పాటు ఓటీటీల‌కు సంబంధించిన ఇన్‌పుట్స్ చాలానే ఉంటాయి. కానీ సినిమాల్లో మాత్రం డైరెక్ట‌రే ఫైన‌ల్ డిసిష‌న్ మేక‌ర్‌.

టెక్నిషియ‌న్స్ ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్ అవుతుండాలి. నేను సినిమాలు చేసిన త‌ర్వాత వెబ్ సిరీస్‌ల‌కు వ‌ర్క్ చేయ‌లేదు. సిరీస్‌ల‌కు వ‌ర్క్ చేయ‌టంతోనే కెరీర్‌ స్టార్ట్ అయ్యింది. ఓటీటీల్లో, వెబ్ సిరీస్‌ల‌కు ప‌ని చేయటం అనేది యంగ్ టాలెంట్‌, యంగ్ టెక్నీషియ‌న్స్‌కు గుడ్ ఫ్లాట్‌ఫామ్స్‌. అయితే వ‌ర్క్ ప‌రంగా ఎప్ప‌టిక‌ప్పుడు హిందీ, ఫ్రెంచ్‌, కొరియ‌న్ వంటి ప్రాజెక్ట్స్‌ను చూస్తుంటాను. బిజీగా ఉన్నామ‌ని అప్‌డేట్ కావ‌టం మానుకోలేం.

హీరో లుక్ విష‌యంలో కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నాం. అప్ప‌టి లుక్‌లో క‌నిపిస్తూనే పొడ‌వుగా క‌నిపించాలి.. ఇవ‌న్నీ మాకు చాలెంజింగ్‌గా అనిపించాయి. అయితే వాట‌న్నింటినీ త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ రీసెర్చ్ చేసుకుంటూ క‌రెక్ట్ చేసుకుంటూ వ‌చ్చాం. మేఘా ఆకాష్‌గారికి ముందుగా చుడీదార్ అనుకున్నాం. కానీ క‌థానుగుణంగా చుడీదార్ కంటే శారీనే బాగా న‌ప్పుతుంద‌నిపించింది. అలాగ‌ని ప‌ట్టు శారీల‌ను ఉప‌యోగించ‌లేదు. కాట‌న్‌, లెనిన్‌, ఖాదీ చీరల‌నే ఉప‌యోగించాం.

ప్ర‌స్తుతం స‌తీష్ వేగేశ్న‌గారు ద‌ర్శ‌క‌త్వంలో హాట్ స్టార్ రూపొందిస్తోన్న వెబ్ సిరీస్ మ‌ర్మ‌యోగి కోసం వ‌ర్క్ చేస్తున్నాను. రీసెంట్‌గానే షూటింగ్ స్టార్ట్ అయ్యింది. అలాగే మాన‌స‌చోర అనే సినిమాకు వ‌ర్క్ చేస్తున్నాను.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement