డీప్ ఫేక్ బారిన స్టార్‌ హీరోయిన్‌.. వీడియో వైరల్! | Bollywood Actress Alia Bhatt Deepfake Video Goes Viral Again | Sakshi

Alia Bhatt: మరోసారి డీప్ ఫేక్ బారిన ఆలియా భట్.. వీడియో వైరల్!

May 7 2024 7:01 PM | Updated on May 7 2024 7:56 PM

Bollywood Actress Alia Bhatt Deepfake Video Goes Viral Again

సినిమా ఇండస్ట్రీ వాళ్లను డీప్‌ ఫేక్‌ వదలడం లేదు. రష్మిక డీప్ ఫేక్ వీడియో అప్పట్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా  బాలీవుడ్ నటి అలియా భట్ మరోసారి డీప్‌ఫేక్ బాధితురాలిగా మారింది. అలియా ముఖాన్ని మార్ఫింగ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆ వీడియో మరో నటి వామికా గబ్బికి సంబంధించినదిగా తెలుస్తోంది.

గత నెలలో 27న వామిక గబ్బి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. అందులో ఆమె ఎర్రటి చీరను ధరించి స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో కనిపించింది. తాజాగా ఆ వీడియోలో ఆలియా భట్‌ ఫేస్‌ను మార్ఫింగ్‌ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ డీప్‌ఫేక్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ నెటిజన్ షేర్ చేయగా.. కొద్ది క్షణాల్లోనే వైరల్‌గా మారింది.

కాగా.. అలియా డీప్‌ఫేక్ ముప్పు బారిన పడడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది నవంబర్‌లో ఆమె ఫేస్‌ను మార్ఫ్ చేసిన వీడియో వైరలైంది. అంతుకుముందే  రష్మిక మందన్న, రణవీర్ సింగ్, కత్రినా కైఫ్, నోరా ఫతేహి, అమీర్ ఖాన్, కాజోల్ లాంటి ప్రముఖ తారలు డీప్ ఫేక్ బారిన పడ్డారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement