యానిమల్ హీరోయిన్ రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ తర్వాత కత్రినా కైఫ్,అలియా భట్, కాజోల్ ఫోటోలు సైతం నెట్టింట వైరలయ్యాయి. దీంతో ఇలాంటి డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలు వైరల్ కావడంతో కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌కు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు చర్యలు చేపట్టింది. అయినప్పటికీ డీప్ ఫేక్ వీడియోలు ఎక్కడో ఒక చోట వైరలవుతూనే ఉన్నాయి.
తాజాగా మరో స్టార్ హీరోయిన్ డీప్ ఫేక్ బారిన పడింది. స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు సంబంధించిన డీప్ ఫేక్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రియాంక గతంలో మాట్లాడిన ఓ వీడియోలో ఆమె ముఖం మార్చకుండా.. అందులోని వాయిస్‌ను మార్చి వైరల్ చేశారు. ఆమె ఓ నకిలీ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు లిప్ సింక్ అయ్యేలా క్రియేట్ చేశారు.
ఆ వీడియోలో ఆమె తన వార్షిక ఆదాయాన్ని వెల్లడిస్తున్నట్లు రూపొందించారు. ఓ బ్రాండ్ ప్రకటనతో 2023లో తన వార్షిక ఆదాయం భారీగా పెరిగిందని.. అందరూ ఆ బ్రాండ్‌నే ఉపయోగించాలని ప్రియాంక చెప్పినట్లు క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment