
‘హైవే’, ‘హంప్టీ శర్మకీ దుల్హనియా’ సినిమాల్లో హీరోయిన్‌గా నటించడంతో పాటు గాయకురాలిగా పాటలు పాడారు ఆలియా భట్. ఇలా గాయకురాలిగా కాస్త అనుభవం ఉన్నా కూడా స్వరాలాపనలో మరింత పట్టు సాధించేందుకు ఆలియా భట్ ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నారని బాలీవుడ్ సమాచారం. ఎందుకంటే తన తాజా చిత్రం ‘లవ్ అండ్ వార్’లో ఆలియా భట్ పూర్తి స్థాయి గాయకురాలి పాత్రలో కనిపిస్తారట.
పాత్ర దృష్ట్యా కథలో చాలా పాటలు పాడతారట ఆలియా భట్. ఈ చిత్రం కోసమే ఆమె స్పెషల్ ట్రైనింగ్ తీసుకోనున్నారు. రణ్‌బీర్ కపూర్, విక్కీ కౌశల్ ఇతర లీడ్ రోల్స్‌లో నటించనున్న ఈ సినిమాకు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలోనే షూటింగ్ ఆరంభం కానుంది. ఈ సినిమా వచ్చే ఏడాది క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే.. పెళ్లి తర్వాత రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ స్క్రీన్ షేర్ చేసుకోనున్న ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment