sings song
-
Singer Majji Devi Sri : చంద్రబాబుపై అదిరిపోయే సాంగ్
-
‘లవ్ అండ్ వార్’లో గాయనిగా ఆలియా భట్
‘హైవే’, ‘హంప్టీ శర్మకీ దుల్హనియా’ సినిమాల్లో హీరోయిన్గా నటించడంతో పాటు గాయకురాలిగా పాటలు పాడారు ఆలియా భట్. ఇలా గాయకురాలిగా కాస్త అనుభవం ఉన్నా కూడా స్వరాలాపనలో మరింత పట్టు సాధించేందుకు ఆలియా భట్ ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నారని బాలీవుడ్ సమాచారం. ఎందుకంటే తన తాజా చిత్రం ‘లవ్ అండ్ వార్’లో ఆలియా భట్ పూర్తి స్థాయి గాయకురాలి పాత్రలో కనిపిస్తారట. పాత్ర దృష్ట్యా కథలో చాలా పాటలు పాడతారట ఆలియా భట్. ఈ చిత్రం కోసమే ఆమె స్పెషల్ ట్రైనింగ్ తీసుకోనున్నారు. రణ్‌బీర్ కపూర్, విక్కీ కౌశల్ ఇతర లీడ్ రోల్స్‌లో నటించనున్న ఈ సినిమాకు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలోనే షూటింగ్ ఆరంభం కానుంది. ఈ సినిమా వచ్చే ఏడాది క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే.. పెళ్లి తర్వాత రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ స్క్రీన్ షేర్ చేసుకోనున్న ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. -
భార్య కోసం పాట పాడిన దిల్‌రాజు.. వీడియో వైరల్
Producer Dil Raju Sings a Song Her Wife Video Viral: ప్రముఖ నిర్మాత దిల్‌రాజు గాయకుడిగా మారారు. కరీంనగర్‌లోని ఓ రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆర్కెస్ట్రా గ్రూపుతో కలిసి స్టేజ్ మీద పాట పాడి సందడి చేశారు. నాగార్జున నటించిన నిర్ణయం సినిమాలోని ని 'హలో గురూ ప్రేమ కోసమేరోయ్...' అనే పాటను ఎంతో ఉల్లాసంగా ఆలపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే ఈ పాటను దిల్‌రాజు తన శ్రీమతికి డెడికేట్ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ కార్యక్రమానికి దిల్‌రాజుతో పాటు మంత్రి గంగుల కమలాకర్ కూడా హాజరయ్యారు. #DilRaju Garu Singing at Karimnagar Drive Inn Opening ;) pic.twitter.com/pgpTFZpFij — Milagro Movies (@MilagroMovies) December 12, 2021 -
స్పైడర్మాన్ అంటూ రిషభ్ పాట.. వైరల్
బ్రిస్బేన్: గత సిరీస్‌లో ఆసీస్ కెప్టెన్, రిషభ్ పంత్ మధ్య జరిగిన ‘బేబీ సిట్టర్’ సంభాషణపై ఆసక్తికర చర్చ సాగింది. తాజా సిరీస్‌లో గత మూడు టెస్టుల్లోనూ పైన్‌తో పంత్ పెద్దగా పెట్టుకున్నట్లు కనిపించలేదు. కానీ చివరి పంచ్ అనుకున్నాడేమో సోమవారం పైన్‌ను ఆట పట్టించే ప్రయత్నం చేశాడు. స్మిత్ అవుటై కెప్టెన్ క్రీజ్‌లోకి వచ్చిన సమయంలో పంత్... ‘స్పైడర్మాన్, స్పైడర్మాన్’ అంటూ పాడటం మొదలు పెట్టాడు. అంతటితో ఆగకుండా అదే సినిమా హిందీ డబ్బింగ్ పాటను కొనసాగిస్తున్నట్లు నా మనసు నువ్వే దోచుకున్నావంటూ ‘తూనే చురాయా మేరా దిల్ కా చైన్’ అంటూ పాటను పాడటం భారత బృందంలో నవ్వులు పుట్టించింది. కాగా, రిషభ్ పంత్ (138 బంతుల్లో 89 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్), శుభ్‌మన్ గిల్ (146 బంతుల్లో 91; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), చతేశ్వర్ పుజారా (211 బంతుల్లో 56; 7 ఫోర్లు) రాణించడంతో బ్రిస్బేన్ టెస్టులో భారత్ 328 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి గెలుపొందింది. దాంతోపాటు 2-1 తో బోర్డర్ గావస్కర్ ట్రోఫిని వరుసగా రెండోసారి సొంతం చేసుకుంది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా రిషభ్ పంత్ నిలిచాడు. 21 వికెట్లు ఖాతాలో వేసుకున్న ఆసీస్ ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా ఎంపికయ్యాడు. ఇక సోమవారం నాటి ఆటలో ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్‌తో రిషభ్‌పంత్ సాగించిన ‘స్పైడర్ మాన్’ పాటకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. (చదవండి: ఈరోజుతో నా కల నెరవేరింది : పంత్) రోహిత్... స్మిత్‌లా: సిడ్నీ టెస్టులో పంత్ బ్యాటింగ్ గార్డ్ చెరిపేసే ప్రయత్నం స్మిత్ చేసినట్లు వార్తలు రావడం, తాను షాడో ప్రాక్టీస్ మాత్రమే చేసినట్లు స్మిత్ చెప్పడం తెలిసిందే. ఇప్పుడు రోహిత్ శర్మ ఇలాగే తన చేతలతో స్మిత్‌ను కాస్త ఉడికించే ప్రయత్నం చేశాడు. స్మిత్ క్రీజ్‌లో ఉన్న సమయంలో అతని ఎదురుగా రోహిత్ పిచ్ పైకి వెళ్లి షాడో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసి చూపించాడు! నువ్వు చేసింది ఇదేనా అనే అనే భావం అందులో కనిపించింది. (చదవండి: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్: భారత జట్టు ఇదే!) Rishab pant singing from behind the stumps "Spiderman Spiderman Tune churaya mera dil ka chain 🤣🤣😍😍 What a entertainer he is 🤣😍@RishabhPant17 pic.twitter.com/mnKpVSKstT — AVinash_RAo (@Avinash21181121) January 18, 2021 Rohit doing a Steve Smith 😛😂😂@ImRo45#INDvsAUSTest #IndiavsAustralia #AUSvsIND #RohitSharma pic.twitter.com/W1t1GiyCLG — D s 45 (@imDs45) January 18, 2021 -
ఫ్యాన్స్‌కి కిక్ ఇస్తున్న ఎన్టీఆర్ పాట
-
విజయ్ నోట ‘కత్తి’లాంటి
ఇళయదళపతి విజయ్‌లో మంచి గాయకుడున్నాడన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పాడటం ఆయనకు ఫ్యాషన్. తన చిత్రాల్లో ఒక్కో పాట పాడుతుంటారు. ఆ మధ్య విడుదలైన తుపాకీ చిత్రంలో పాడిన గూగుల్ గూగుల్ పాట విశేష ప్రజాదరణ పొందింది. ప్రస్తుతం నటిస్తున్న కత్తి చిత్రంలో కూడా ఒక పాట పాడనున్నారు. ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కత్తిలో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇందులో ఒకటి ప్రతినాయకుడి ఛాయలున్న పాత్ర అని సమాచారం. సమంత హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చిత్రాన్ని దీపావళికి విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. యువ సంచలన సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీత బాణీలందిస్తున్న ఈ చిత్రంలో ఒక మంచి దుమ్మురేపే మసాలా సాంగ్ చోటు చేసుకుందట. ఈ పాటకు ప్రస్తుతం ట్యూన్ కడుతున్న అనిరుధ్ త్వరలోనే విజయ్‌తో పాడించడానికి సిద్ధం అవుతున్నారని తెలిసింది.