పవర్‌ డ్రెస్సింగ్‌ | World Fashion Introduction | Sakshi
Sakshi News home page

పవర్‌ డ్రెస్సింగ్‌

Published Thu, Jun 8 2017 10:43 PM | Last Updated on Tue, Sep 5 2017 1:07 PM

World Fashion Introduction

ఫ్యాషన్‌ ఫ్యూజన్‌
ప్రపంచ ఫ్యాషన్‌ పరిచయం


మహిళా సాధికారత కోసం... అదేనండీ... ఉమెన్‌ పవర్‌ఫుల్‌గా అవ్వాలనుకోవడం కొత్తేమీ కాదు అన్నది పాత విషయమే! అయినా ఇప్పటికీ పోరాటాలు నడుస్తున్నాయి.మగ ఫ్యాషన్‌ ప్రపంచంలో ‘ప్రాడా’ మనకోసం తెచ్చిన పవర్‌ డ్రెస్సింగ్‌! సాధికారతకు వేసిన కొత్త తొడుగు.  డ్రెస్‌ డిజైనింగ్‌లోనే కాదు, అసమెట్రికల్‌ ప్రింట్స్, ఇతర అలంకరణలోనూ ఏదో ఒక బ్లాక్‌ లైన్‌ ఉండటం
 ప్రత్యేకత.



►బ్రైట్‌ కలర్స్‌ హంగామా లేకుండా సాదాసీదా లేత రంగులతో డల్‌సీజన్‌నీ బ్రైట్‌గా మార్చేయచ్చు.

►ఫ్రాక్‌ నెక్‌ దగ్గర సన్నని కుచ్చులు అమర్చి వాటిని కుడివైపున బెల్ట్‌తో అటాచ్‌ చేశారు. ఇలా డ్రెస్‌ కట్‌లో ఏదో ఒక అంశం హైలెట్‌ చేయడం స్పెషల్‌.

►స్లీవ్‌లెస్‌ లాంగ్‌ప్రాక్‌కి అమర్చిన వెడల్పాటి క్లాత్‌ బెల్ట్, దాని పైన మరో లెదర్‌ బెల్ట్‌ .. డ్రెస్‌కి ఆధునిక హంగుగా అమరింది.

►ఇటలీలోని స్ట్రీట్‌ ఆర్ట్‌ని డ్రెస్‌ డిజైన్స్‌పై చూపించి, వేదికల మీద ఫ్యాషన్‌ ప్రపంచం నివ్వెరపోయేలా చేసింది.

►1920–30లలో ఉపయోగించే   గ్రాఫిక్‌ ప్రింట్స్‌ని 90ల కాలానికి దుస్తుల మీదకు తీసుకువచ్చారు.

►ఉద్యోగినుల పవర్‌ని చూపే మిడ్‌ ఫ్రాక్‌ డిజైన్స్‌ ప్రాడా జాబితాలో ఎన్నో!

►బ్రౌన్‌ కలర్‌ స్కర్ట్‌ టాప్‌గా ప్లెయిన్‌ టీ షర్ట్‌.. రిచ్‌లుక్‌కి ఇంతకుమించిన రంగులు ఎందుకు?

►ప్యాంట్, షర్ట్‌ మీదకు లాంగ్‌ స్లీవ్స్‌ స్వెటర్, లెదర్‌ బూట్స్, బ్యాగ్స్‌.. ప్రాడా మార్క్‌ స్టైల్‌!

►అబ్‌స్ట్రాక్ట్‌ పెయింటింగ్స్, చెక్స్‌ ప్యాటర్న్స్‌.. ఈ డ్రెస్‌ డిజైన్స్‌ ఆల్‌టైమ్‌ ఎవర్‌గ్రీన్‌గా నిలుస్తున్నాయి.

►ఆధునిక కాలానికి రెట్రోస్టైల్‌ని పరిచయం చేసే డిజైన్‌ బ్లేజర్‌!


ఫోర్బ్స్‌ మ్యాగజీన్‌ 2014లో ప్రపంచంలోని 75 శక్తివంతమైన మహిళలలో ‘మియుక్యా ప్రాడా’ను ఒకరిగా ప్రకటించింది. ప్రపంచ ఫ్యాషన్‌ రంగంలో ఓ కొత్తదనంతో చూపడంతో పాటు మహిళను శక్తివంతంగా చూపించడంలో ప్రాడా విజయం సాధించారు. ప్రపంచ ఫ్యాషన్‌ రంగంలో పేరెన్నికగన్నవారంతా మగవారే కనిపిస్తారు. అలాంటి చోట ‘ప్రాడా’ తనంటే ఏంటో నిరూపించింది. ఏటికి ఎదురీదే లక్షణం ఉన్న ప్రాడా ఇటలీ ఫ్యాషన్‌ డిజైనర్‌. ఏడు పదులకు చేరువవుతున్న ప్రాడా ట్రెండ్‌ని సృష్టించడానికి ఉబలాటపడదు. స్త్రీ సాధికారత, ధైర్యంతో చొచ్చుకుపోయే గుణం ఆమె డిజైన్స్‌లో కనిపిస్తుంది. ఆధునిక ప్రపంచాన్ని బాగా అర్థం చేసుకున్న ఆమె గురించి చెప్పాలంటే ‘ప్రాడా’ ఫ్యాషన్‌ ప్రపంచానికి ఒక ‘నాడా!’.

ఒకనొకప్పుడు ప్రాడాకు ఫ్యాషన్‌ ప్రపంచంలో ‘జీరో’ పరిజ్ఞానం. ఫ్యాషన్‌ అంటే ఎంతమాత్రమూ ఆసక్తి ఉండేది కాదు. చాలామంది తారలు డాక్టర్‌ని కాబోయి యాక్టర్‌ అయ్యాను అని చెబుతుంటారు. ప్రాడా నాటకరంగంపై ఆసక్తి ఉండి, అందులో శిక్షణ కూడా పొంది అనుకోకుండా ఫ్యాషన్‌ డిజైనర్‌ అయ్యారు. ప్రాడా తాత ‘మారియో ప్రాడా’ లెదర్‌ బ్యాగుల తయారీలో పేరెన్నికగన్నవాడు. వీరి కుటుంబం అంతా అదే పరిశ్రమలో ఉన్నారు. ప్రాడాకు నాటకరంగం అంటే అమిత ఆసక్తి ఉండి, దాంట్లో శిక్షణ కూడా పొందారు. అలాగే రాజకీయాలంటే తగని మక్కువ. ప్రపంచాన్ని మార్చేయాలనే విప్లవాత్మక ధోరణిలో ఉండేవి ఆమె ప్రసంగాలు. ఆ విప్లవాత్మక దృష్టిని డ్రెస్‌ డిజైన్స్‌ వైపు మళ్ళించారు. ఫ్యాషన్‌ ప్రపంచంలో స్త్రీని ‘పవర్‌ఫుల్‌’గా నిలిపారు.  

‘మహిళ ఫ్యాషనబుల్‌గా కనిపించాలంటే ఎవరినీ అనుకరించకూడదు’ అని చెబుతారు ప్రాడా. ఈ వయసులో విశ్రాంత జీవితం గడపాల్సిన మీరు నేటి కాలానికి తగినవిధంగా జైన్స్‌ చేయగలను అనుకుంటున్నారా? అని అడిగితే ‘వృద్ధాప్యంలో ఆకర్షణీయంగా కనిపించకూడదా, సృజనాత్మకంగా ఆలోచించకూడదా?’ అని ఎదురు ప్రశ్నిస్తారు ఆమె. స్త్రీని‘బొమ్మ’గా మాత్రమే చూపిన వేదికల మీద శక్తివంతమైన మహిళగా తన డిజైన్స్‌ ద్వారా పరిచయం చేశారు.

ప్రాడా డిజైన్స్‌లో ఆధునికత
∙ప్రాడా డిజైన్స్‌లో పూర్తి ఫ్లాట్‌ కట్‌ కనిపిస్తుంది. అనవసరపు హంగులు, ఆర్భాటాలు ఉండవు. అయితే, ఆ డిజైన్‌లో నెక్‌ లేదా హ్యాండ్స్‌.. డ్రెస్‌లో ఏదో ఒక్కటైనా ప్రత్యేకత కనిపిస్తుంది.
⇒బోల్డ్‌ స్ట్రోక్స్‌తోనే డిజైన్‌ని కళాత్మకంగా చూపడంలో ఎక్స్‌పర్ట్‌ ప్రాడా.
⇒మారుతున్న రుతువులకు తగిన విధంగా డ్రెస్‌ డిజైనింగ్‌ ఉంటుంది
⇒ఫ్రిల్స్‌తో హంగామా చేయదు. అలాగని స్త్రీని మగరాయుడిలా చూపించాలనుకోదు.
⇒టాప్‌ అండ్‌ బాటమ్‌లోనూ పెద్ద హంగామా ఉండదు. రెండు రంగుల క్లాత్‌తో ఒక రిచ్‌లుక్‌ని తీసుకువస్తారు.
⇒గాడీ పువ్వుల ప్రింట్లు ప్రాడా డిజైన్స్‌లో కనిపించవు. పెయింటింగ్‌తో ఒక ఆర్ట్‌ఫామ్‌ కళ్లకు కడతారు.
⇒లెదర్‌ బ్యాగ్స్‌ మాత్రమే కాదు లెదర్‌ కోటులోనూ ఒక గ్రాండ్‌ లుక్‌ కనిపిస్తుంది.
⇒అన్ని దేశాల డ్రెస్‌కట్‌ని గమనించి తన డిజైన్స్‌లో చూపడం వల్లనేమో విదేశీయులకూ ఈ డ్రెస్సులో తమ సంప్రదాయ, స్టైలిష్‌ కట్‌ కనిపిస్తుంది.
‘ఏ పనినైతే ఎంచుకుంటానో దాంట్లో పూర్తిగా ఇన్‌వాల్వ్‌ అవుతాను, అదే నా సక్సెస్‌ మంత్ర. ఈ పనిలో ఉండే కళ నాలో స్ఫూర్తిని నింపుతుంది. అదే ఈ రంగంలో నన్ను ఇంకా కొనసాగేలా చేస్తుంది’ అంటారు మియుక్యా ప్రాడా!

ప్రాడా గురించి మరింతగా!
⇒1993లో అమెరికాలోని ఫ్యాషన్‌ డిజైనర్స్‌ కౌన్సెల్‌ నుంచి  అంతర్జాతీయ అవార్డును అందుకున్నారు.
⇒న్యూయార్క్, లండన్‌ ఫ్యాషన్‌ వీక్‌లలో ఒకేసారి ఆమె ఫ్యాషన్‌ షోలో జరిగేవి.
⇒ప్రతిష్టాత్మక మిలన్‌ ఫ్యాషన్‌ వీక్‌లో రెగ్యులర్‌గా ప్రాడా ఫ్యాషన్‌ షోలు జరుగుతాయి.
⇒ఫెండీ, హెల్‌మట్‌ లంగ్, జిల్‌సందర్, అజెడిన్‌ అలయా ప్రాడా ఇతర లేబుల్స్‌.
⇒లెదర్‌ ఉత్పత్తులు, షూ, పెర్‌ఫ్యూమ్‌ ఇతర వస్తువుల తయారీలోనే ‘ప్రాడా, మియు మియు’ లేబుల్స్‌కి ఘనమైన పేరుంది.
– నిర్వహణ: ఎన్‌.ఆర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement