న్యూఢిల్లీ: న్యాయస్థానాల్లో కేసుల సందర్భంగా హాజరయ్యే అధికారుల వస్త్రధారణ హుందాగా ఉండాలని సుప్రీంకోర్టు తెలిపింది. రాజస్తాన్ పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ అదనపు చీఫ్ సెక్రటరీ మంజిత్ సింగ్ బుధవారం ఓ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టుకు సాధారణ దుస్తుల్లోనే హాజరయ్యారు. దీంతో జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్‌లతో కూడిన బెంచ్ ఆయన్ను మందలించింది.
ఈ కేసు విచారణ గురువారం కూడా కొనసాగింది. నీలం రంగు సూట్‌తో కోర్టుకు హాజరైన మంజిత్ సింగ్.. బుధవారం సాధారణ దుస్తుల్లో వచ్చినందుకు న్యాయస్థానానికి క్షమాపణలు చెప్పారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. నిబంధనలు ఉన్నా లేకున్నా ప్రభుత్వ అధికారులు కోర్టులకు వచ్చేటప్పుడు హుందాగా, మర్యాదపూర్వకంగా ఉండే వస్త్రాలనే ధరించాలని తెలిపింది. అధికారుల హోదాకు, బాధ్యతలకు దుస్తులు ప్రతీకలుగా నిలుస్తాయని వ్యాఖ్యానించింది.
Comments
Please login to add a commentAdd a comment