యాంకర్‌ వస్త్రాధారణపై విమర్శలు | Moushumi Chatterjee Criticises Female Anchor For Wearing Pant | Sakshi
Sakshi News home page

Published Wed, Jan 23 2019 8:41 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

Moushumi Chatterjee Criticises Female Anchor For Wearing Pant - Sakshi

మౌస్మీ చటర్జీ(పాత చిత్రం)

సూరత్‌: ఇటీవల బీజేపీలో చేరిన బాలీవుడ్‌ నటి మౌస్మీ చటర్జీ ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. ఓ మహిళ యాంకర్‌ వస్త్రాధారణపై ఆమె విమర్శలు చేశారు. వివరాల్లోకి వెళితే.. సూరత్‌లోని ఓ హోటల్లో జరిగిన మీడియా సమావేశానికి మౌస్మీ హాజరయ్యారు. ఈ సమావేశం ప్రారంభంలో అతిథుల పేర్లు చదువుతున్న యాంకర్‌ చేతిలో నుంచి మైక్‌ లాక్కున్న మౌస్మీ, ఆమె వస్త్రాధారణను తప్పుబట్టారు. యాంకర్‌ ప్యాంట్‌ ధరించడం సరికాదని మౌస్మీ వ్యాఖ్యానించారు

మౌస్మీ యాంకర్‌తో మాట్లాడుతూ.. ‘నువ్వు ధరించిన దుస్తులు సరిగాలేవు. నువ్వు చీర కానీ, డ్రెస్‌(చుడీదార్‌) కానీ ధరించాల్సింది. పబ్లిక్‌ ఈవెంట్లకు హాజరయ్యేటప్పుడు డ్రెస్సింగ్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. నేను నీకు ఇది ఓ తల్లిగా భావించి చెబుతున్నాను. పబ్లిక్‌లో నా కూతుళ్లు ఇలాంటి డ్రెస్స్‌లు ధరించడాన్ని నేను అంగీకరించన’ని తెలిపారు. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికే తాను ఈ సమావేశానికి హాజరయినట్టు ఆమె మీడియాకు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement