
Fashion: వేసవిలో ఎక్కువగా వినిపించే పదం కాటన్. వేడిని తట్టుకొని, మేనికి హాయినిచ్చే సుగుణం ఉన్న ఫ్యాబ్రిక్. సింపుల్‌గా ఉండే కాటన్‌ని పార్టీవేర్‌గా మార్చుకోలేం. అనుకునేవారికి రితుబెరి కాటన్ కలెక్షన్ సరైన సమాధానం. లగ్జరీ ఫ్యాషన్ డిజైనర్‌గా పేరొందిన రితుబెరి ఇక్కత్, ఖాదీలతో చేసిన రంగుల హంగామా చూడాల్సిందే!
సంప్రదాయ డిజైన్స్‌లోనే ఆధునికతను చూపడం ఈ డిజైనర్ ప్రత్యేకత. పలాజో, స్కర్ట్స్, ఓవర్‌కోట్స్, లాంగ్‌గౌన్స్‌కి రెండు మూడు రంగుల హంగులు అమర్చి చేసే మ్యాజిక్ చూపరులను మంత్రముగ్ధులను చేస్తాయి.
చేనేతలతో ఎన్ని హంగుల అమరికతో వినూత్నమైన డిజైన్స్ తీసుకురావచ్చో రితుబెరి కలెక్షన్ చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. క్రింకిల్డ్ ఖాదీ స్కర్ట్స్, ట్రౌజర్స్, ఎంబ్రాయిడీ చేసిన జాకెట్స్, లాంగ్ గౌన్స్.. కాంబినేషన్స్ చూపులను ఇట్టే కట్టిపడేస్తాయి.
ఇకత్ రూపాలు ఇన్నన్ని కావు అని కళ్లకు కడతాయి. ఎక్కడ ఉన్నా ప్రత్యేకతను చాటుతాయి. విదేశాలలోనూ మన దేశీయ డిజైన్స్ ప్రత్యేకతను చాటే ఈ డిజైనర్ ఢిల్లీ వాసి. భారతదేశంలోని ఫ్యాషన్ పరిశ్రమలో సృజనాత్మకత, వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి లాభాపేక్షలేని ‘ది లగ్జరీ లీగ్’ని ప్రారంభించింది.
-రితుబెరి, ఫ్యాషన్ డిజైనర్
చదవండి👉🏾Aparna Balamurali: ఈ హీరోయిన్ కట్టిన చీర ధర 95 వేలు.. స్పెషాలిటీ ఏమిటంటే!
చదవండి👉🏾Wedding Season Fashion: లెహంగా ఒక్కటే కాదు.. పెళ్లిలో మరింత ఆకర్షణీయంగా కనిపించాలంటే!