
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ 29 ఏళ్ల ఫ్యాషన్ డిజైనర్ మితిమీరన వేగంతో బీఎండబ్ల్యూ కారును నడపడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో లాజ్‌పత్ నగర్‌లోని అమర్ కాలనీ ప్రాంతంలో జరిగింది. ప్రమాదం అనంతరం పారిపోవడానికి ప్రయత్నించిన యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితురాలిని ఫ్యాషన్ డిజైనర్ రోష్నిగా గుర్తించారు.
ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. ‘నిందితురాలు కారులో ఐస్ క్రీం తినడానికి ప్రయత్నిస్తుండగా పెంపుడు కుక్క ఆమె మీదకు దూకింది. ఆ కంగారులో రోష్ని అనుకోకుండా యాక్సిలరేటర్‌ని తొక్కింది. దాంతో ప్రమాదం జరిగి.. నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటన స్థలంలోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆమెపై కేసు నమోదు చేశాం’ అని తెలిపారు. ప్రస్తుతం ఆమె బెయిల్ మీద విడుదలయ్యిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment