
అలంకరణలో ఆభరణాలు అందులోనూ ప్రత్యేకమైన వాటినే అతివలు ఎప్పుడూ కోరుకుంటారు. అందుకే నాట్య బొమ్మలు ఆభరణాలుగా మగువల మెడలోనూ, చెవులకు ఇంపుగా మెరిసిపోతున్నాయి. బుట్టబొమ్మా.. బుట్టబొమ్మా.. అంటూ చూపరులను పాడుకునేలా చేస్తున్నాయి.
కూచిపూడి, భరతనాట్యం శాస్త్రీయ నృత్య రూపాలే కాదు వెస్టర్న్ స్టైల్‌లో బాలే డ్యాన్స్ భంగిమలు ఆభరణాల్లో కనువిందు చేస్తుంటే చూపు తిప్పుకోలేం.
రత్నాలు పొదిగిన బంగారు బుట్టలు, లాకెట్లు.. వెండితో మురిసిన నాట్యమయూరాలు చెవులకు లోలాకులు అయితే ఎంత అందంగా ఉంటాయో కళ్లారా చూడాల్సిందే.
పచ్చలు, కెంపులు, వజ్రాలు, కుందన్స్ తో మెరిపించిన ఈ ఆభరణాల జిలుగులు ఎంత చూసినా తనివి తీరవు.
సంప్రదాయ వేడుకల సందర్భాలలోనే కాదు క్యాజువల్‌గా, ప్రత్యేక వెస్ట్రన్ పార్టీలకూ ధరించడానికి నాట్యాభరణాలను మన ఇంటి బుట్టబొమ్మల కోసం ఎంపిక చేసుకోవాల్సిందే అనిపిస్తున్నాయి.
బంగారు, వెండి మాత్రమే కాకుండా ఇమిటేషన్, ఫ్యాషన్ జువెల్రీలోనూ ఈ ఆభరణాలు అందమైన నృత్య భంగిమల్లో కనువిందు చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment