Fashion: Madonna Sebastian In Label Earthen Yellow Dress Shocking Price - Sakshi
Sakshi News home page

Madonna Sebastian: లేబుల్‌ అర్తెన్‌ ప్రత్యేకత అదే.. ఈ హీరోయిన్‌ ధరించిన డ్రెస్‌ ధర ఎంతంటే

Published Tue, Jun 28 2022 4:39 PM | Last Updated on Tue, Jun 28 2022 7:03 PM

Fashion: Madonna Sebastian In Label Earthen Yellow Dress Shocking Price - Sakshi

పసుపు రంగు దుస్తుల్లో పచ్చగా మెరిసిపోతున్న ఈ నటిని గుర్తు పట్టారు కదా! ప్రేమమ్‌ ఫేమ్‌..మడోన్నా సెబాస్టియన్‌. గాయని కూడా. ఆమె మెచ్చే ఫ్యాషన్‌ బ్రాండ్స్‌ ఇవే... 

లేబుల్‌ అర్తెన్‌
అర్తెన్‌.. అంటే సింపుల్‌గా సహజత్వం.. సహజసిద్ధమైన అని చెప్పుకోవచ్చు. పేరుకు తగ్గట్టే ఈ బ్రాండ్‌ రంగుల్లో కానీ.. ఫ్యాబ్రిక్‌లో కానీ.. డిజైన్స్‌లో కానీ.. సహజత్వాన్నే అద్దుతుంది. సౌకర్యానికి ప్రాధాన్యం ఇస్తుంది. ఇదే ఈ బ్రాండ్‌ వాల్యూ. ధరలు మోస్తరు రేంజ్‌లో ఉంటాయి. ఆన్‌లైన్‌లో లభ్యం.

బ్రాండ్‌ వాల్యూ 
డ్రెస్‌ : త్రీ పీస్‌ సెట్‌
బ్రాండ్‌: లేబుల్‌ అర్తెన్‌
ధర: రూ. 22,900

కుశాల్స్‌ జ్యూయెలరీ
ఇది బెంగళూరుకు సంబంధించిన జ్యూయెలరీ బ్రాండ్‌. దీనికి  దేశంలోని చాలా ప్రాంతాలతోపాటు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణాల్లో స్టోర్స్‌  ఉన్నాయి.  సరసమైన ధరలు.. చక్కటి డిజైన్లలో సిల్వర్‌ జ్యూయెలరీ ఈ బ్రాండ్‌ వాల్యూ. ఆన్‌లైన్‌లో కూడా దొరుకుతాయి.

బ్రాండ్‌ వాల్యూ 
జ్యూయెలరీ: ఇయర్‌ రింగ్స్‌ 
బ్రాండ్‌: కుశాల్స్‌ జ్యూయెలరీ
ధర:రూ. 1,980

నాకు ఎల్లో కలర్, హెవీ ప్రింట్స్‌ అంటే చాలా ఇష్టం. మాక్సీ స్కర్ట్స్, ఒంటికి హత్తుకునేట్టుండే బ్లౌజెస్‌ నా ఆల్‌ టైమ్‌ ఫెవరెట్‌ కాస్ట్యూమ్స్‌. – మడోన్నా సెబాస్టియన్‌ 
-దీపిక కొండి
చదవండి: Surbhi Puranik: హీరోయిన్‌ సురభి ధరించిన లెహంగా ధరెంతో తెలుసా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement