
శ్రీనిధి శెట్టి
Fashion And Lifestyle: ‘కేజీఎఫ్’తో అఖిల భారత ప్రేక్షకులకు అభిమాన నటి అయింది శ్రీనిధి శెట్టి. ఫ్యాషన్ విషయంలో కూడా పేరున్న బ్రాండ్స్‌కు ఫేవరెట్. ఈ విషయం కేజీఎఫ్ 2 ప్రమోషన్స్‌లో ఆమె ఆహార్యాన్ని గమనించిన ఎవరైనా చెప్పగలరు. అలా ప్రమోషన్స్‌లో భాగంగా ఢిల్లీకి వెళ్లినప్పుడు శ్రీనిధిని మెరిపించిన బ్రాండ్స్ గురించి ఇక్కడ..
పౌలమి అండ్ హర్ష్
అతివల అందంతో పోటీపడే దుస్తుల డిజైన్ ఈ బ్రాండ్ సొంతం. ప్రకృతిలోని రకరకాల మొక్కలు.. రంగురంగుల పూలే ఈ బ్రాండ్ డిజైన్స్‌కు స్ఫూర్తి, ప్రేరణ. నేటి మహిళల సౌకర్యానికి 1950ల నాటి ఫ్యాషన్‌ను జోడించి డిజైన్ చేయడమే ఈ బ్రాండ్‌కున్న వాల్యూ.
వీళ్లు రూపొందించే ప్రతి పీస్‌ను హ్యాండ్ పెయింట్ చేస్తారు. దాని మీద నాజూకైన ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది. ఈ క్రమంలో ప్రతి చిన్న డీటైల్ కూడా డిజైన్‌లో ప్రస్ఫుటిస్తుంది. ఈ ప్రత్యేకత ఈ బ్రాండ్ డిమాండ్‌ను మరింత పెంచుతోంది. ధరలూ అదే స్థాయిలో ఉంటాయి.
మోర్‌తంత్ర
భవిష్యత్ జీవితపు కలలు సరే.. అందులోని ముఖ్యమైన ఘట్టాలు అంటే పెళ్లీపేరంటాలకు సంబంధించీ కలలుంటాయి. ఆయా సందర్భాల్లో ఏ చీర కట్టుకోవాలి.. దానికి తగినట్టుగా ఎలాంటి నగలు పెట్టుకోవాలి వగైరా వగైరా. అమ్మాయిల ఆ కలలను నిజం చేసే జ్యూయెలరీ బ్రాండే మోర్‌తంత్ర (అహ్మదాబాద్). రత్నాల జిలుగులే ఈ బ్రాండ్ ఐడెంటిటీ.
పెళ్లి కూతురి కోసం డిజైన్ చేసే నగలే మోర్‌తంత్ర బ్రాండ్ వాల్యూ. ఈ ఆభరణాలతో ఆ ఆనంద ఘట్టాలను సెలబ్రేట్ చేస్తుంది.. మరిచిపోలేని మధురమైన జ్ఞాపకాలుగా పదిలపరస్తుందీ బ్రాండ్. డిజైన్‌ను బట్టి ధరలు. ఆన్‌లైన్‌లో లభ్యం.
బ్రాండ్ వాల్యూ
డ్రెస్ : లెహెంగా
బ్రాండ్: పౌలమి అండ్ హర్ష్
ధర:రూ. 61,900
జ్యూయెలరీ
బ్రాండ్: మోర్‌తంత్ర
ఇయర్ రింగ్స్ ధర:
రూ. 5,500
ఉంగరం ధర:
రూ. 3,500
‘మనసు పెడితే రోజూ కొత్తగా.. ఉల్లాసంగా.. ఉత్సాహంగా ఉండొచ్చు! సినిమా నా డ్రీమ్. కాకపోతే అది ఇంత త్వరగా .. ఇంత ఈజీగా నెరవేరుతుందని అనుకోలేదు’– శ్రీనిధి శెట్టి.
∙దీపిక కొండి
చదవండి👉🏾 Vimala Reddy: టైమ్‌పాస్ కోసం బ్యూటీ కోర్స్ చేశా.. 2 గంటలకు ఆరున్నర వేలు వచ్చాయి.. ఆ తర్వాత..
Comments
Please login to add a commentAdd a comment