సగం ధరకే ఫ్యాషన్‌ దుస్తులు | Zara Indian Partner Building Its Own Cheaper Fast Fashion Chain | Sakshi
Sakshi News home page

సగం ధరకే ఫ్యాషన్‌ దుస్తులు

Published Mon, Jun 24 2019 7:28 PM | Last Updated on Mon, Jun 24 2019 7:33 PM

Zara  Indian Partner Building Its Own Cheaper  Fast Fashion Chain - Sakshi

సాక్షి, ముంబై:  పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూపు  తన భాగస్వామ్య సంస్థకు ధీటుగా  తన  సొంత వస్త్ర సామ్రాజ్యాన్ని స్థాపించుకునేందుకు  సమాయత్తమవుతోంది. అదీ  అతి చౌక ధరలకే ఫ్యాషన్‌ దుస్తులను  భారత వినియోగదారులకు అందుబాటులోకి  తీసుకురానుంది. పదేళ్ల క్రితం దక్షిణాఫ్రికా అపారెల్ సంస్థ ‘జారా’తో జట్టుకట్టిన టాటా సంస్థ..ఇప్పుడు సొంతంగానే  దేశీయంగా వస్త్ర దుకాణాలను ప్రారంభించేందుకు సమాయత్తమవుతోంది.  ప్రధానంగా ప్రపంచంలోనే అతిపెద్ద వస్త్ర దుకాణాల  సముదాయం  జారాలో దొరికే దుస్తుల కంటే సగం ధరకే కస్టమర్లను ఆకట్టుకోనుంది.

వినియోగదారులకు జారా అందించే దానికంటే సగం ధరలకే దుస్తులను అందించనున్నట్లు టాటాకు చెందిన రీటెయిల్ సంస్థ ట్రెంట్ లిమిటెడ్  ఛైర్మన్‌ నోయల్ టాటా చెప్పారు. ఏడాదికి దేశవ్యాప్తంగా 40  వెస్ట్‌సైడ్‌  ఔట్‌లెట్లను ప్రారంభించనున్నట్లు నోయల్ తెలిపారు. 12 రోజుల్లో  "ఎక్స్‌ట్రీమ్ ఫాస్ట్ ఫ్యాషన్‌’’  దుస్తులను వినియోగదారులకు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు, వారి ఆదాయం క్రమేపీ పెరుగుతోంది.  వారు దుస్తుల విషయంలో ట్రెండీ గా మారుతున్నారు. కానీ వారికి జారా లాంటి చోట్ల  తక్కువ ఆదాయ వర్గాలైన వీరికి తక్కువ ధరల్లో ఫ్యాషన్‌ దుస్తులు అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలోనే  తక్కువ ధరకే ట్రెండీ  దుస్తులను వారికి అందుబాటులోకి తేన్నామని తెలిపారు. ప్రస్తుతం తీసుకున్న నిర్ణయంతో కస్టమర్లను ఆకట్టుకుని మార్కెట్లో త్వరగా ఎదిగేందుకు  ప్రయత్నిస్తామని నోయల్ చెప్పారు. దేశీయ వస్త్ర దుకాణాల నుంచి వచ్చే మోడల్స్‌ ధీటుగా ట్రెంట్ సప్లై చైన్‌ను వేగవంతంగా వృద్ది చేయాలని భావిస్తున్నట్టు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement