Trent
-
టాటా గ్రూప్ కంపెనీకి కళ్లు చెదిరే లాభాలు
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ రిటైల్ సంస్థ ట్రెంట్ డిసెంబర్ క్వార్టర్‌కు కళ్లు చెదిరే లాభాలు ఆర్జించింది. కన్సాలిడేటెడ్ నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.155 కోట్ల నుంచి రూ.371 కోట్లకు దూసుకుపోయింది. 140 శాతం వృద్ధి చెందింది. వెస్ట్‌సైడ్, జుడియో, స్టార్ పేరుతో రిటైల్ స్టోర్లను ఈ సంస్థ నిర్వహిస్తోంది. ఆదాయం 50 శాతం వృద్ధితో క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.2,303 కోట్ల నుంచి రూ.3,467 కోట్లకు చేరింది. మొత్తం వ్యయాలు 42 శాతం పెరిగి రూ.3,101 కోట్లుగా ఉన్నాయి. ‘‘అన్ని ఫార్మాట్లలోనూ స్థిరమైన వృద్ధిని కొనసాగించాం. నిర్వహణ క్రమశిక్షణ, వేగవంతమైన నిర్వహణ మా విస్తరణ అజెండాకు మద్దతుగా నిలిచాయి’’అని సంస్థ తెలిపింది. వెస్ట్‌సైడ్, జుడియో స్థూల మార్జిన్ గతంలో మాదిరే స్థిరంగా కొనసాగింది. ఆపరేటింగ్ ఎబిట్ మార్జిన్ 13 శాతానికి పుంజుకుంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 8.5 శాతంగానే ఉంది. బలమైన వృద్ధి విస్తరణ దిశగా తమకు మరింత ప్రోత్సాహాన్నిస్తున్నట్టు సంస్థ పేర్కొంది. వెస్ట్‌సైడ్ డాట్ కామ్, ఇతర టాటా గ్రూప్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా అమ్మకాల్లో 5 శాతం వాటా ఆదాయం లభించినట్టు తెలిపింది. డిసెంబర్ క్వార్టర్లో కొత్తగా 5 వెస్ట్‌సైడ్ స్టోర్లు, 50 జుడియో స్టోర్లను ప్రారంభించింది. దీంతో నిర్వహణలోని వెస్ట్‌సైడ్ స్టోర్ల సంఖ్య 227కు, జుడియో స్టోర్లు 460కు చేరాయి. స్టార్ పేరుతో (గ్రోసరీ) నిర్వహించే స్టోర్ల సంఖ్య 67కు పెరిగింది. భవిష్యత్తులోనూ స్టోర్ల విస్తరణ ద్వారా మరింత మందికి చేరువ అవుతామని సంస్థ చైర్మన్ నోయల్ టాటా ప్రకటించారు. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ట్రెంట్ షేరు 19 శాతం లాభపడి 3,609 వద్ద క్లోజ్ అయింది. -
సగం ధరకే ఫ్యాషన్ దుస్తులు
సాక్షి, ముంబై: పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూపు తన భాగస్వామ్య సంస్థకు ధీటుగా తన సొంత వస్త్ర సామ్రాజ్యాన్ని స్థాపించుకునేందుకు సమాయత్తమవుతోంది. అదీ అతి చౌక ధరలకే ఫ్యాషన్ దుస్తులను భారత వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది. పదేళ్ల క్రితం దక్షిణాఫ్రికా అపారెల్ సంస్థ ‘జారా’తో జట్టుకట్టిన టాటా సంస్థ..ఇప్పుడు సొంతంగానే దేశీయంగా వస్త్ర దుకాణాలను ప్రారంభించేందుకు సమాయత్తమవుతోంది. ప్రధానంగా ప్రపంచంలోనే అతిపెద్ద వస్త్ర దుకాణాల సముదాయం జారాలో దొరికే దుస్తుల కంటే సగం ధరకే కస్టమర్లను ఆకట్టుకోనుంది. వినియోగదారులకు జారా అందించే దానికంటే సగం ధరలకే దుస్తులను అందించనున్నట్లు టాటాకు చెందిన రీటెయిల్ సంస్థ ట్రెంట్ లిమిటెడ్ ఛైర్మన్ నోయల్ టాటా చెప్పారు. ఏడాదికి దేశవ్యాప్తంగా 40 వెస్ట్‌సైడ్ ఔట్లెట్లను ప్రారంభించనున్నట్లు నోయల్ తెలిపారు. 12 రోజుల్లో "ఎక్స్ట్రీమ్ ఫాస్ట్ ఫ్యాషన్’’ దుస్తులను వినియోగదారులకు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు, వారి ఆదాయం క్రమేపీ పెరుగుతోంది. వారు దుస్తుల విషయంలో ట్రెండీ గా మారుతున్నారు. కానీ వారికి జారా లాంటి చోట్ల తక్కువ ఆదాయ వర్గాలైన వీరికి తక్కువ ధరల్లో ఫ్యాషన్ దుస్తులు అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలోనే తక్కువ ధరకే ట్రెండీ దుస్తులను వారికి అందుబాటులోకి తేన్నామని తెలిపారు. ప్రస్తుతం తీసుకున్న నిర్ణయంతో కస్టమర్లను ఆకట్టుకుని మార్కెట్లో త్వరగా ఎదిగేందుకు ప్రయత్నిస్తామని నోయల్ చెప్పారు. దేశీయ వస్త్ర దుకాణాల నుంచి వచ్చే మోడల్స్ ధీటుగా ట్రెంట్ సప్లై చైన్‌ను వేగవంతంగా వృద్ది చేయాలని భావిస్తున్నట్టు తెలిపారు. -
ట్రెంట్ లాభం 37 శాతం అప్
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ రిటైల్ సంస్థ, ట్రెంట్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో 37 శాతం పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.12 కోట్లుగా ఉన్న నికర లాభం గత క్యూ4లో రూ.16 కోట్లకు పెరిగిందని ట్రెంట్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.539 కోట్ల నుంచి 26 శాతం వృద్ధితో రూ.677 కోట్లకు పెరిగిందని ట్రెంట్ చైర్మన్ నోయల్ ఎన్. టాటా చెప్పారు.. మొత్తం వ్యయాలు రూ.522 కోట్ల నుంచి రూ.659 కోట్లకు పెరిగాయని తెలిపారు. ఒక్కో షేర్‌కు రూ.1.30 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్(డీడీటీ)తో కలుపుకుంటే మొత్తం డివిడెండ్ చెల్లింపులు రూ.52.08 కోట్లవుతాయని వివరించారు. గత క్యూ4లో తమ సంస్థ బ్రాండ్, వెస్ట్‌సైడ్ కొత్తగా 27 స్టోర్స్‌ను ప్రారంభించిందని గతంలో ఏ సంవత్సరంలోనూ ఈ స్థాయిలో స్టోర్స్‌ను ఏర్పాటు చేయలేదని పేర్కొన్నారు. పూర్తి ఆర్థిక సంవత్సరంలో రూ.127 కోట్ల లాభం ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18లో రూ.117 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.127 కోట్లకు పెరిగిందని నోయల్ తెలిపారు. ఆదాయం రూ.2,109 కోట్ల నుంచి రూ.2,568 కోట్లకు పెరిగింది. గత శుక్రవారం బీఎస్ఈలో ట్రెంట్ షేర్ 0.7% నష్టంతో రూ.355 వద్ద ముగిసింది. -
టాటా పుస్తక వ్యాపారం ‘వెస్ట్‌ల్యాండ్’ అమెజాన్ చేతికి
ముంబై: టాటా గ్రూపునకు చెందిన ట్రెంట్ అనుబంధ ప్రచురణ విభాగం వెస్ట్‌ల్యాండ్‌ను కొనుగోలు చేయనున్నట్టు అమెరికాకు చెందిన ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రకటించింది. ఎంత మొత్తానికి అన్న విషయం తెలియజేయలేదు. ఈ కొనుగోలుతో వెస్ట్‌ల్యాండ్ రచయితలు స్థానిక అవకాశాలను అందిపుచ్చుకోవడమే కాకుండా తమ ప్రచురణల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వినియోగదారులను చేరుకోవచ్చని అమెజాన్ తెలిపింది. టాటాలకు చెందిన వెస్ట్‌ల్యాండ్‌లో అమెజాన్ గతంలోనే 26 శాతం వాటాను కొనుగోలు చేసింది. వెస్ట్‌ల్యాండ్ కంపెనీ పుస్తక విక్రయాలు, పంపిణీ, ప్రచురణ విభాగంలో 50 ఏళ్ల నుంచీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.