రాబోయే దీపకాంతుల కోసం ముస్తాబులో మరిన్ని వెలుగులు చోటుచేసుకోవాలనుకునేవారికి సరైన ఎంపికగా నిలుస్తుంది గోటా వర్క్ డిజైన్స్. డ్రెస్, శారీ, లెహంగా.. ఏ డ్రెస్‌నైనా అందంగా మార్చే ఈ కళారూపం అతివలను అమితంగా ఆకట్టుకుంటుంది. ఆభరణాలలోనూ అందంగా ఇమిడిపోతుంది.
రాజస్థాన్‌లో పుట్టి, దేశమంతా మెచ్చిన గోటా పట్టి లేదా గోటా వర్క్ మనదైన ఎంబ్రాయిడరీ శైలి. ఇది ఆప్లిక్ వర్క్ నైపుణ్యాలతో ఉంటుందని చెప్పవచ్చు. వెండి, జరీ రిబ్బన్ చిన్న చిన్న ముక్కలను వివిధ నమూనాలుగా రూపొందించి, ఫ్యాబ్రిక్‌పైన డిజైన్ చేస్తారు. గ్రాండ్ లుక్ కోసం ధరించే ఈ ఎంబ్రాయిడరీ దుస్తులు వేడుకలలో ప్రత్యేకంగా నిలుస్తుంటాయి.
గోటా అనేది లక్నో నుంచి వచ్చిన జరీ రిబ్బన్ లేదా లేస్ అని చెప్పవచ్చు. దీనిని ట్విల్ నేతలతో వివిధ రంగు రిబ్బన్లను ఉపయోగించి డిజైన్ చేస్తారు. వెండి, బంగారు, రాగి లోహాలతో డిజైన్ చేసిన గోటా కాలానుగుణంగా మార్పులు చెంది ప్లాస్టిక్‌తోనూ అందరికీ అందుబాటులోకి వచ్చింది.
ఫ్యాబ్రిక్‌పై ఈ డిజైన్‌ను గుర్తించడం కూడా చాలా సులువు. అలాగే, డిజైన్ చేయడం కూడా సులువుగానే ఉంటుంది. డిజైన్ బట్టి, గోటాను వివిధ ఆకారాలలో కత్తిరించి, మడత పెట్టి, చేత్తో కుడతారు.
ప్రకృతి ప్రేరణ
పువ్వులు, లతలు, నెమళ్లు, చిలుకలతో పాటు ఏనుగుల వంటి జంతు బొమ్మలను ఈ వర్క్‌లో ఎక్కువ చూస్తుంటాం. గ్రాండ్‌గా ఉండే ఈ వర్క్ డ్రెస్సులను శుభకార్యాలలో ధరించడం కూడా మన దేశంలో సంప్రదాయంగా వస్తుంది.
ఆభరణాల జిలుగులు
గోటా వర్క్ లేదా లేస్‌లలో ఉండే డిజైన్స్ ఆభరణాల నిపుణులనూ ఆకర్షించింది. అందుకే వీటిని ఫ్యాషన్ జ్యువెలరీలో భాగంగా వివిధ రూపాలలో తీర్చిదిద్దుతున్నారు. క్యాజువల్ వేర్‌గానూ, మెహిందీ ఫంక్షన్ల వంటి వేడుకలలోనూ వీటిని ధరించిన అమ్మాయిలు కలర్‌ఫుల్‌గా వెలిగిపోతుంటారు.
చదవండి: Ramya Krishnan: రమ్యకృష్ణ ధరించిన ఈ చీర ధర 2.75 లక్షలు! ప్రత్యేకత ఏమిటంటే!
Wrap Drape Dress: ర్యాప్.. డ్రేప్.. టాప్ టు బాటమ్ ఒకే రంగుతో!
Comments
Please login to add a commentAdd a comment