శోభిత ధూళిపాళ (PC: Sobhita Dhulipala Instagram )
ఎప్పుడో గానీ తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్లు కనిపించరు. ‘గూఢచారి’ చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైన తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ. తమిళ, మలయాళం, హిందీ సినిమాల్లోనే కాదు హాలీవుడ్ సినిమా ‘మంకీ మ్యాన్’లోనూ నటిస్తూ బిజీగా ఉంది. శోభిత హాలీవుడ్ స్క్రీన్ పరిచయానికి ఆమె యూనిక్ స్టయిలే కారణం అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఆ స్టయిల్ ఏంటో చూద్దాం...
తరుణ్ తహిలియానీ....
తరుణ్ తహిలియానీ .. ప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్. భార్య శైలజా సాల్ తహిలియానీతో కలసి 1987లో మల్టీ–డిజైనర్ బోటిక్ స్థాపించాడు. తర్వాత 1990లో తహిలియానీ డిజైన్ స్టూడియో కూడా ప్రారంభించాడు. భారతీయ హస్తకళా నైపుణ్యాన్ని ప్రతిబింబించేలా ఉంటాయి అతని డిజైన్స్!
ముఖ్యంగా సంప్రదాయ సౌందర్యాన్ని ఆధునిక డిజైన్స్‌తో సమ్మిళితం చేయడం అతని సిగ్నేచర్ స్టయిల్. పెళ్లి దుస్తులకు పెట్టింది పేరు. ఈ మధ్యనే ఈవెంట్ డిజైనింగ్‌నూ ప్రారంభించాడు. అయితే తహిలియానీ డిజైన్స్‌ను సామాన్యులు అందుకోవడం అసాధ్యమే. ఆన్ లైన్‌లో లభ్యం.
ఆమ్రపాలి జ్యూయెలరీ
రాజీవ్ అరోరా, రాజేష్ అజ్మేరా అనే మిత్రులు కలసి జైపూర్‌లో ‘ఆమ్రపాలి’ పేరుతో ఓ మ్యూజియాన్ని ప్రారంభించారు. ఇక్కడ వివిధ సంప్రదాయ ఆభరణాలను చూడొచ్చు. నచ్చితే కొనుగోలూ చేసుకోవచ్చు. ధర మాత్రం లక్షల్లో ఉంటుంది.
అందుకే ఆ యాంటిక్ జ్యూయెలరీకి రెప్లికా డిజైన్స్‌ను సరసమైన ధరలకే అందుబాటులోకి తెచ్చారు ఈ ఇద్దరూ. ఆమ్రపాలి.. ట్రైబల్ డిజైన్స్‌కు ప్రసిద్ధి. చాలా మంది సెలబ్రిటీస్‌కి ఇది ఫేవరేట్ బ్రాండ్. ఆన్‌లైన్‌లోనూ ఆమ్రపాలి జ్యూయెలరీని కొనుగోలు చేయొచ్చు.
బ్రాండ్ వాల్యూ
చీర బ్రాండ్: తరుణ్ తహిలియానీ
ధర: రూ. 4,79,900
జ్యూయెలరీ
బ్రాండ్: ఆమ్రపాలి జ్యూయెల్స్
ధర: డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.
సంప్రదాయ దుస్తులను వెస్టర్న్ లుక్‌లో.. అంటే సౌకర్యంగా ఉండేలా వేసుకోవడమే నాకు నచ్చే.. నేను మెచ్చే స్టయిల్. నిజానికి దుస్తులకంటే ఆభరణాల ఫ్యాషన్ పైనే నాకు ఆసక్తి ఎక్కువ. ముఖ్యంగా కమర్‌బంధ్(వడ్డాణం) అన్నా డైమండ్స్ అన్నా చాలా ఇష్టం. ఇక నేను ఎక్కడికి వెళ్తున్నానో దాన్నిబట్టి ఉంటుంది నా ఫ్యాషన్ స్టయిల్! – శోభిత ధూళిపాళ
-దీపిక కొండి
చదవండి: Gota Work: గోటా పట్టి.. దీపకాంతుల కోసం ముస్తాబులో మరిన్ని వెలుగులు!
Ramya Krishnan: రమ్యకృష్ణ ధరించిన ఈ చీర ధర 2.75 లక్షలు! ప్రత్యేకత ఏమిటంటే!
Comments
Please login to add a commentAdd a comment