‘రొమాంటిక్’ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కేతిక శర్మ.. ‘రంగరంగ వైభవంగా’ అంటూ సందడి చేస్తోంది. స్క్రీన్ మీదే కాదు బయట కూడా ఫ్యాషన్ పట్ల ఆమెకు స్పృహ ఎక్కువే. అందుకే ఈ బ్రాండ్స్‌ను ఎంచుకుంటుంది!
అపేక్ష ద లేబుల్...
హైదరాబాద్‌కు చెందిన ఫ్యాషన్ డిజైనర్ ఆపేక్ష.. 2018లో తన పేరు మీదే ఓ ఫ్యాషన్ హౌస్ ప్రారంభించి తన చిన్నప్పటి కలను నిజం చేసుకుంది. మొదట కాస్త ఇబ్బందిపడినా కొద్ది కాలంలోనే తన బ్రైడల్ కలెక్షన్స్‌తో పాపులర్ అయింది. ఇండోవెస్టర్న్ డిజైన్స్‌కూ ఆమె బ్రాండ్ పెట్టింది పేరు. ఎంతోమంది అమ్మాయిలు తమ పెళ్లి పీటలపై ఆకాంక్ష డిజైన్స్ ధరించాలని కోరుకుంటారు. సామాన్యులకు కూడా వీటి ధరలు అందుబాటులో ఉంటాయి.
చీర
బ్రాండ్: ఆపేక్ష ద లేబుల్
ధర: రూ. 14,000
హౌస్ ఆఫ్ క్యూ సీ...
2016లో ఒక వెబ్‌సైట్ ద్వారా ప్రారంభించిన వ్యాపారం, తమ అందమైన డిజై¯Œ ్సతో ఇప్పుడు సెలబ్రిటీలకు కూడా నోటెడ్ అయింది. ఎలాంటి వారికైనా నప్పే, ఎలాంటి వారైనా మెచ్చే ఆభరణాలను అందించడం ‘హౌస్ ఆఫ్ క్యూ సీ’ జ్యూయెలర్స్ ప్రత్యేకత.. హైదరాబాద్, బెంగళూరులలో ఈ మధ్యనే స్టోర్స్ ఓపెన్ చేశారు. ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చి కూడా ఆభరణాలను కొనుగోలు చేయొచ్చు. ఆభరణాల నాణ్యత, డిజైన్స్‌ను బట్టే ధర.
జ్యూయెలరీ
బ్రాండ్: హౌస్ ఆఫ్ క్యూ సీ జ్యూయెల్స్
ధర: డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.
మనసుకు నచ్చినట్లుండే అమ్మాయిని నేను. కచ్చితంగా ఇవే కావాలి, ఇలాగే ఉండాలి అని అనుకోను. నచ్చినవి నచ్చినట్లుగా ధరిస్తుంటాను.– కేతిక శర్మ
-దీపిక కొండి
చదవండి: Fashion: కేప్ స్టైల్.. వేడుక ఏదైనా వెలిగిపోవచ్చు!
Comments
Please login to add a commentAdd a comment