
ఈషా రెబ్బా (PC: Eesha Rebba Instagram)
తెలుగు సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న అతికొద్ది తెలుగు హీరోయిన్స్‌లో ఈషా రెబ్బా ఒకరు. సెలక్టెడ్‌గా సినిమాలు చేస్తూ తనకంటూ ఓ సెపరేట్ స్టయిల్ క్రియేట్ చేసుకున్న ఆమె.. ఫ్యాషన్‌లోనూ అంతే సెలెక్టివ్‌గా ఉంటుంది. ఈ బ్రాండ్స్ ఈషా వార్డ్‌రోబ్‌లోనివే..
షామీన్ హుస్సేన్
మిమ్మల్ని మీరు ఒక ప్రిన్సెస్‌లా చూడాలనుకుంటున్నారా? అయితే, డిజైనర్ షామీన్ హుస్సేన్ కలెక్షన్స్‌ను ఒకసారి ట్రై చేయండి. దేశీ వెర్షన్‌లో అందమైన ఫ్లీ లెహంగాలు, గౌన్లు తయారుచేయడంలో షామీన్ స్పెషలిస్ట్.
స్టైలిష్ లుక్‌నిచ్చే ఈ డిజైన్స్‌ను సెలబ్రిటీలు సైతం ఇష్టపడతారు. చిన్న పిల్లలక్కూడా ఈ డిజైన్స్ లభిస్తాయి. స్పెషల్‌గా ఆర్డర్ ఇచ్చి డిజైన్ చేయించుకునే వీలూ ఉంది. ఆన్‌లైన్ స్టోర్‌లో మాత్రమే లభ్యం.
ఛగన్‌లాల్ జ్యూయెల్స్
1956లో ఛగన్‌లాల్ జ్యూయెల్స్ ప్రారంభమైంది. మొదట వీరు కేవలం రాజకుటుంబీకులకు మాత్రమే ఆభరణాలను తయారుచేసేవారట. తర్వాత సామాన్యులు కూడా వీరి ఆభరణాలను ధరించాలనే ఉద్దేశంతో ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టారు.
ఇక్కడ లభించే ఆభరణాల డిజైన్స్ ఎక్కువగా ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంటాయి. ధర.. ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. ఆన్‌లైన్‌లోనూ లభ్యం.
బ్రాండ్ వాల్యూ
జ్యూయెలరీ
బ్రాండ్: ఛగన్‌లాల్ జ్యూయెల్స్
ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.
డ్రెస్ బ్రాండ్: షామీన్ హుస్సేన్
ధర: రూ. 35,018
నన్ను కొంతమంది ‘తెల్లగా ఉండుంటే ఇంకా ఎక్కువ సినిమాలు చేసేదానివి’ అన్నారు. అలాంటి అభిప్రాయలను నమ్మను.. ఆ మాటలను ఖాతరు చేయను. మేని ఛాయ.. ప్రతిభను కమ్మేయదు. – ఈషా రెబ్బా
-దీపికా కొండి
Comments
Please login to add a commentAdd a comment