
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తరచూ ఏదో ఒక వివాదంలో నలుగుతూ ఉంటాడు. గతంలో ఆయనమీద దారుణమైన వార్తలు కూడా వచ్చాయి. షారుక్ ఖాన్‌తో సన్నిహితంగా వ్యవహరించడంతో అతడు హీరోతో శారీరక సంబంధం పెట్టుకున్నాడంటూ పుకార్లు వ్యాప్తి చెందాయి. అయితే ఈ రూమర్స్ తనను ఎంతగానో బాధించాయని బయోగ్రఫీలో రాసుకొచ్చాడు కరణ్. ఎన్ అన్‌సూటబుల్ బాయ్ పుస్తకంలో కరణ్ తన మనసును ఎంతగానో బాధించిన పుకార్ల గురించి ఓపెన్ అయ్యాడు.
'శారీరక సంబంధం పెట్టుకోవడం అనేది అంత ఈజీ ఏం కాదు. అది ఎవరి విషయంలోనైనా వ్యక్తిగతమే. నా దురదృష్టం కొద్దీ నాకు, షారుక్‌కు శారీరక సంబంధం అంటగట్టారు. నేను అతడితో పడుకున్నాను అంటూ వచ్చిన వార్తలు చూసి చాలా షాకయ్యాను. ఒకసారైతే ఓ టీవీ ఛానల్ యాంకర్ నేరుగా ఆ ప్రశ్నను నా ముఖం మీదే అడిగాడు. అది విని నాకు పట్టరానంత కోపం వచ్చింది. నువ్వు నీ అన్నతో పడుకుంటావా? అని అడిగాను. అందుకతడు ఏంటి? ఏమంటున్నారు? అని ప్రశ్నించాడు.
నన్నసలు ఆ ప్రశ్న ఎలా అడగాలనిపించిందని ఛీ కొట్టాను. ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని పుకార్లు సృష్టించినా మా మధ్య మంచి అనుబంధం ఉంది. షారుక్ నాకు నాన్నలాంటివాడు, ఒక అన్నలాంటివాడు. అలాంటిది మా గురించి అసహ్యంగా మాట్లాడారు. షారుక్ ఎప్పుడూ ఈ పుకార్లను లెక్కచేయలేదు. 'వాళ్లు నోటికొచ్చినట్లు మాట్లాడతారు. పెళ్లయ్యాక అక్రమ సంబంధం పెట్టుకోలేదంటే గే అని రాసేస్తారు. అవేం పట్టించుకోకు అని నాకు ధైర్యం చెప్పేవాడు'' అని రాసుకొచ్చాడు.
చదవండి: హీరోకు ఖరీదైన స్పోర్ట్స్ కారు గిఫ్టిచ్చిన నిర్మాత
రణ్‌బీర్ కపూర్ కారుకు యాక్సిడెంట్, అద్దాలు ధ్వంసం
Comments
Please login to add a commentAdd a comment