పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్, కేజీఎఫ్ 2 సినిమాలు బాలీవుడ్‌పై దండయాత్ర చేశాయి. అక్కడి బాక్సాఫీస్‌ను కొల్లగొట్టి కోట్లరూపాయలు వసూలు చేశాయి. కానీ హిందీ సినిమాలు మాత్రం ఒకటీరెండూ మినహా అన్నీ బోల్తా కొట్టాయి. పెద్ద హీరోల సినిమాలకు కూడా ప్రేక్షకాదరణ దక్కకపోవడంతో బాలీవుడ్ పని ఖతమైందంటూ వార్తలు వెలువడుతున్నాయి. తాజాగా ఈ రూమర్స్‌పై ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్ స్పందించాడు.
'చెత్తవాగుడు వాగుతున్నారు. మంచి సినిమాలు ఎప్పుడూ విజయం సాధిస్తాయి. గంగూబాయ్ కతియావాడి, భూల్ భులాయా 2 సినిమాలు భారీ హిట్ కొట్టాయి. అలాగే జుగ్ జుగ్ జియో మూవీ కూడా బానే ఆడింది. సరైన కంటెంట్ లేని సినిమాలు మాత్రమే బెడిసికొడతాయి. అయినా ఇప్పుడు మనదగ్గర చాలా సినిమాలు లైన్‌లో ఉన్నాయి. లాల్ సింగ్ చద్దా, రక్షా బంధన్, బ్రహ్మాస్త్ర, రోహిత్ శెట్టి మూవీ, ఏడాది చివర్లో సల్మాన్ ఖాన్ సినిమా ఉంది. ఈ సినిమాల కోసం మనం ఎదురుచూడాలి. థియేటర్‌కు జనాలను రప్పించడం ఇప్పుడంత సులువేమీ కాదు. సినిమా ట్రైలర్, క్యాంపెయిన్ అన్నీ పర్ఫెక్ట్‌గా ఉండాలి. మనం మన పేరుప్రతిష్టలకు అనుగుణంగా బతుకుతున్నాం. కొన్నిసార్లు అది ఒత్తిడిగా అనిపిస్తుందేమో! కానీ ఛాలెంజ్‌లు స్వీకరించడమే నాకిష్టం' అని చెప్పుకొచ్చాడు కరణ్ జోహార్.
కాగా జుగ్ జుగ్ జియో చిత్రం కరణ్ జోహార్ సొంత బ్యానర్‌లోనే నిర్మితమైంది. గత నెలలో రిలీజైన ఈ మూవీ దాదాపు రూ.84 కోట్లు రాబట్టింది. గంగూబాయ్ కతియావాడికి రూ.180 కోట్లు రాగా భూల్ భులాయా 2 అవలీలగా రూ.250 కోట్లను కొల్లగొట్టింది. ఇదే సమయంలో భారీ సినిమాలు సల్మాన్ ఖాన్ 'అంతిమ్', అజయ్ దేవ్‌గణ్ 'రన్‌వే 34', అక్షయ్ కుమార్ 'సామ్రాట్ పృథ్వీరాజ్', రణ్‌బీర్ కపూర్ 'షంషేరా' చిత్రాలు అట్టర్ ఫ్లాప్‌గా నిలిచాయి.
చదవండి: అందం ఇదేనేమో.. త్రిష చీరకట్టు ఫోటోలు వైరల్
నన్ను పెళ్లి చేసుకుంటే మీరు తట్టుకోలేరు.. రోజంతా స్మరించాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment