
ఎన్టీఆర్, కరణ్ జోహార్, రామ్‌చరణ్
Jr NTR Comments RRR PreRelease Event: ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రౌద్రం..రణం..రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్). డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం ముంబైలో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హాజరయ్యారు. ఈ బిగ్ ఈవెంట్‌కు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
‘‘రామ్ చరణ్ అభిమానులందరికీ స్వాగతం. బహుశా..ఈ కలయిక (చరణ్‌తో తన కాంబినేషన్‌ను ఉద్దేశించి) దేవుడు నిర్ణయించినదేమో! రామ్ అంటే తారక్. చరణ్ అంటే రామ్‌చరణ్. అందుకే రామ్‌చరణ్ అభిమానులందరికీ స్వాగతం’’ అన్నారు ఎన్టీఆర్. అలాగే ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సల్మాన్ ఖాన్ ‘భజరంగీ భాయిజాన్’ సీక్వెల్ ‘భజరంగీ భాయిజాన్ 2’ను ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment