
‘బాహుబలి’ చిత్రంతో ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమాకు గుర్తింపు తెచ్చిన దర్శకధీరుడు రాజమౌళి మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు సిద్దమైన విషయం తెలిసిందే. ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల కాంబోలో తెరకెక్కుతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ ప్రాజెక్టును ఇటీవలే అధికారికంగా ప్రారంభించారు. రాజమౌళి సినిమా అంటూ దక్షిణాది అభిమానులే కాదు బాలీవుడ్ అభిమానులు కూడా ఎదురుచూస్తుండటం విశేషం. దీంతో ఈ సినిమా కోసం సినీ అభిమానులే కాకుండా రాజమౌళికి ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో బడా ప్రోడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఎదురుచూస్తున్నారు.
ఇక పైసా పెట్టుబడి లేకుండా 'బాహుబలి' రెండు భాగాల్ని హిందీలో రిలీజ్ చేయడంతో భారీగా డబ్బులు మూటగట్టుకున్న బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రంపైనా కన్నేశాడు. హిందీలో ఈ చిత్రాన్ని ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్‌లోనే విడుదల చేయాలని ఆరాటపడుతున్నాడు. ఇప్పటికే రాజమౌళిని, నిర్మాత డివీవీ దానయ్యను సంప్రదించినట్టు సమాచారం. రజనీ కాంత్ ‘రోబో 2ఓ’ ను హిందీలో తన బ్యానర్‌లోనే విడుదల చేయాలని భావించినా చివర్లో కుదరక ప్రాజెక్ట్‌ను వదులుకున్నాడు. అయితే ఆ నష్టాన్ని రాజమౌళి తదపరి చిత్రంతో భర్తీ చేయాలని కరణ్ జోహార్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment