Rajamaouli
-
‘ఆర్ఆర్ఆర్’ చిత్ర షూటింగ్ ప్రారంభం
-
వైరల్: ‘ఆర్ఆర్ఆర్’ తొలి రోజు షూటింగ్..
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ కాంబినేషన్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్ర షూటింగ్ సోమవారం ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన వివరాలను రాజమౌళి ట్విటర్లో వెల్లడించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో కలిసి దిగిన ఫొటోను ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. అలాగే రాజమౌళి తొలి షాట్‌కు దర్శకత్వం వహిస్తున్న వీడియో కూడా వైరల్‌గా మారింది. చరణ్ రెడీ, తారక్ రెడీ అంటూ రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఆర్ఆర్ఆర్ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్ర పూజ కార్యక్రమాలు ఇటీవల హైదరాబాద్‌లో సినీ ప్రముఖల సమక్షంలో జరిగిన సంగతి తెలిసిందే. రామ్‌చరణ్, ఎన్టీఆర్‌ల కలయికలో రాజమౌళి ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారనే వార్తలు వెలువడినప్పటి నుంచి.. ఈ మల్టీస్టారర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రామ్‌చరణ్‌కు విషెస్ చెప్పిన ఉపాసన రామ్‌చరణ్‌కు ఆయన సతీమణి ఉపాసన ట్విటర్ ద్వారా బెస్ట్ విషెస్ తెలిపారు. ‘నా ప్రియమైన మిస్టర్ సీకి.. ఆర్ఆర్ఆర్ తొలి రోజు షూటింగ్ ప్రారంభమైన సందర్భంగా శుభాకాంక్షలు’ అని ఆమె పేర్కొన్నారు. To my dearest Mr.C - wishing u all the very best on the 1st day of #RRR ❤️#ramcharan pic.twitter.com/g3beeERP3b — Upasana Konidela (@upasanakonidela) 19 November 2018 -
‘ఆర్ఆర్ఆర్’పై బాలీవుడ్ బడా నిర్మాత కన్ను!
‘బాహుబలి’ చిత్రంతో ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమాకు గుర్తింపు తెచ్చిన దర్శకధీరుడు రాజమౌళి మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు సిద్దమైన విషయం తెలిసిందే. ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల కాంబోలో తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’ ప్రాజెక్టును ఇటీవలే అధికారికంగా ప్రారంభించారు. రాజమౌళి సినిమా అంటూ దక్షిణాది అభిమానులే కాదు బాలీవుడ్ అభిమానులు కూడా ఎదురుచూస్తుండటం విశేషం. దీంతో ఈ సినిమా కోసం సినీ అభిమానులే కాకుండా రాజమౌళికి ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో బడా ప్రోడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఎదురుచూస్తున్నారు. ఇక పైసా పెట్టుబడి లేకుండా 'బాహుబలి' రెండు భాగాల్ని హిందీలో రిలీజ్ చేయడంతో భారీగా డబ్బులు మూటగట్టుకున్న బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రంపైనా కన్నేశాడు. హిందీలో ఈ చిత్రాన్ని ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్లోనే విడుదల చేయాలని ఆరాటపడుతున్నాడు. ఇప్పటికే రాజమౌళిని, నిర్మాత డివీవీ దానయ్యను సంప్రదించినట్టు సమాచారం. రజనీ కాంత్ ‘రోబో 2ఓ’ ను హిందీలో తన బ్యానర్లోనే విడుదల చేయాలని భావించినా చివర్లో కుదరక ప్రాజెక్ట్‌ను వదులుకున్నాడు. అయితే ఆ నష్టాన్ని రాజమౌళి తదపరి చిత్రంతో భర్తీ చేయాలని కరణ్ జోహార్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. -
‘ఆర్ఆర్ఆర్’ మొదలైంది.. ప్రభాస్, రానాల సందడి!
బాహుబలి లాంటి భారీ ప్రాజెక్ట్ తరువాత రాజమౌళి చేపట్టిన ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్-రామ్ చరణ్‌తో ఈ మల్టీస్టారర్ ప్రకటించిన్పటినుంచీ ఈ చిత్రంపై టాలీవుడ్లో ప్రకంపనలు మొదలయ్యాయి. నందమూరి, మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. నేడు ( నవంబర్ 11) ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించారు. సినీ పెద్దల సమక్షంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. చిరంజీవి, కె.రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, వివి వినాయక్, సురేష్ బాబు లాంటి ప్రముఖులు ఈ వేడుకుక హాజరయ్యారు. ప్రభాస్, రానా, ఎన్టీఆర్, రామ్‌చరణ్, రాజమౌళి ఈ వేడుకలో సందడి చేశారు.అయితే ఈ కార్యక్రమానికి బాలయ్య హాజరువుతారని ప్రచారం జరిగింది కానీ అది నిజం కాలేదు. ఈ మూవీలో నటించబోయే ముగ్గురు హీరోయిన్లను కూడా ప్రకటించనున్నట్లు వార్తలు వినిపించాయి కానీ అవి కూడా రూమర్స్‌గానే మిగిలిపోయాయి. అయితే ఈ నెల 19నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనుందని, ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లపై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సమాచారం. . -
బాహుబలి 2 కోసం రూల్స్ మార్చేస్తున్నారట..?
ఒక భాషలో సూపర్ హిట్ అయిన సినిమాలను ఇతర భాషల్లోకి అనువదించి రిలీజ్ చేయటం చాలా కామన్. అలా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల చిత్రాలు ఇతర భాషల్లోకి అనువాదమవుతుంటాయి. అలా అనువాదమైన చిత్రాలు ఘనవిజయం సాధించిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే ఇలాంటి అనువాదాలకు కన్నడ పరిశ్రమ దూరం. కన్నడ సినిమాలు ఏ భాషలోకి అనువాదం కాకపోగా.. మరే భాషా చిత్రాన్ని కన్నడలోకి అనువదించడానికి అంగీకరించరు. ఒకవేళ కన్నడ నాట తమ సినిమాను రిలీజ్ చేయాలని ఇతర భాషా చిత్ర ప్రముఖులు భావిస్తే ఒరిజినల్ సినిమానే రిలీజ్ చేయాల్సి ఉంటుంది. తమ ఇండస్ట్రీని, తమ నటీనటుల భవిష్యత్తును కాపాడుకోవటానికి కన్నడ సినీ ప్రముఖులు ఎప్పటి నుంచో పాటిస్తున్న కట్టుబాటు ఇది. కానీ బాహుబలి 2 కోసం రూల్ మార్చే ఆలోచనలో ఉన్నారట. కన్నడ నాట కూడా తెలుగు, తమిళ భాషల్లోనే రిలీజ్ అయిన బాహుబలి తొలి భాగం మంచి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో బాహుబలి 2ను కన్నడ ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఇండస్ట్రీ రూల్స్‌ను మార్చే ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని కన్నడలోకి అనువదించేందుకు అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ ఇండస్ట్రీ ప్రముఖుల అంగీకారం కోరారన్న ప్రచారం జరుగుతోంది. అయితే నిజంగానే అలాంటి చాన్స్ ఉందా..? లేక ప్రమోషన్ కోసమే బాహుబలి పీఆర్ టీం ఇలాంటి వార్తలను సృష్టిస్తుందా..? తెలియాలంటే మాత్రం అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే.