‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మొదలైంది.. ప్రభాస్‌, రానాల సందడి! | Rajamouli Ntr Ram Charan RRR Movie Pooja Events Highlights | Sakshi
Sakshi News home page

Published Sun, Nov 11 2018 5:02 PM | Last Updated on Mon, Nov 12 2018 11:26 AM

Rajamouli Ntr Ram Charan RRR Movie Pooja Events Highlights - Sakshi

బాహుబలి లాంటి భారీ ప్రాజెక్ట్‌ తరువాత రాజమౌళి చేపట్టిన ప్రాజెక్ట్‌ ఆర్‌ఆర్‌ఆర్‌. ఎన్టీఆర్‌-రామ్‌ చరణ్‌తో ఈ మల్టీస్టారర్‌ ప్రకటించిన్పటినుంచీ ఈ చిత్రంపై టాలీవుడ్‌లో ప్రకంపనలు మొదలయ్యాయి. నందమూరి, మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. 

నేడు ( నవంబర్‌ 11) ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించారు. సినీ పెద్దల సమక్షంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. చిరంజీవి, కె.రాఘవేంద్రరావు, అల్లు అరవింద్‌, వివి వినాయక్‌,  సురేష్‌ బాబు లాంటి ప్రముఖులు ఈ వేడుకుక హాజరయ్యారు. ప్రభాస్‌, రానా, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, రాజమౌళి ఈ వేడుకలో సందడి చేశారు.అయితే ఈ కార్యక్రమానికి బాలయ్య హాజరువుతారని ప్రచారం జరిగింది కానీ అది నిజం కాలేదు. ఈ మూవీలో నటించబోయే ముగ్గురు హీరోయిన్లను కూడా ప్రకటించనున్నట్లు వార్తలు వినిపించాయి కానీ అవి కూడా రూమర్స్‌గానే మిగిలిపోయాయి. అయితే ఈ నెల 19నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ జరగనుందని, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లపై యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సమాచారం. .

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement