బాలీవుడ్‌లోని బడా నిర్మాతల్లో కరణ్ జోహార్ ఒకరు. సోషల్ మీడియాలో అతడు నిత్యం ట్రోల్స్ బారిన పడుతుంటాడు. కొన్నిసార్లు ఈ విమర్శలు బాధించినా వాటిని అధిగించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాననే ఈయన తాజాగా అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ట్విటర్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. 'జీవితంలో పాజిటివ్ ఎనర్జీల కోసం కొంత సమయాన్ని కేటాయించాలనుకుంటున్నాను. అందులో భాగంగా ట్విటర్‌కు వీడ్కోలు చెప్తున్నా' అని ట్వీట్ చేశాడు.
అయితే ట్విటర్‌కు గుడ్‌బై చెప్పాడు కానీ తన అకౌంట్‌ను మాత్రం డిలీట్ చేయలేదు. అతడి చివరి ట్వీట్ చూసిన అభిమానులు మానసిక ప్రశాంతతకు మించినది ఏదీ లేదు. మంచి నిర్ణయం తీసుకున్నారు, మీ ఆరోగ్యంపై, బ్రహ్మాస్త్ర రెండో పార్ట్‌పై ఫోకస్ చేయండి అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఆయన ఇటీవల తెరకెక్కించిన లైగర్ సహా పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూశాయి.
చదవండి: నామినేషన్స్‌లో 9మంది కంటెస్టెంట్లు
నయనతార కవలల పేర్లకు అర్థాలు తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment