
బాలీవుడ్ భామ కంగనా రనౌత్ బీ టౌన్‌లో ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటోంది. తాజాగా నిర్మాత కరణ్ జోహార్‌పై విమర్శల వర్షం కురిపించింది. ఇటీవలే కరణ్ జోహార్ చేసిన పోస్ట్‌పై కంగనా స్పందించారు. హీరోయిన్ ప్రియాంక చోప్రాను కరణ్ మానసికంగా వేధించాడని.. అందుకే ఆమె బాలీవుడ్‌ను వదిలి వెళ్లిందని కంగనా సంచలన ఆరోపణలు కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా అనుష్క శర్మ కెరీర్‌ను దెబ్బతీశాడని ఆరోపించింది.
దీనికి బదులిస్తూ కరణ్ జోహార్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తప్పుడు ఆరోపణలకు భయపడేది లేదంటూ రిప్లై ఇచ్చారు. తాజాగా కరణ్ పోస్ట్‌పై స్పందించిన కంగనా..కరణ్ పోస్ట్ స్క్రీన్ షాట్‌ను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసింది . అంతే కాకుండా ఓ జాతీయ ఛానెల్‌తో మాట్లాడుతూ తనను అవమానించాడని కంగనా ఆరోపించింది.
కంగనా ఇన్‌స్టాలో స్టోరీస్‌లో రాస్తూ..' కరణ్ నన్ను ఓ జాతీయ మీడియాలో అవమానించాడు. ఎందుకంటే నాకు ఇంగ్లీష్ రాదు. అందుకే ఇలాంటి నెపో మాఫియా వ్యక్తులు నన్ను అవమానించారు. వేధింపులకు కూడా గురి చేశారు.' అని పోస్ట్ చేశారు.
కరణ్ జోహార్ పోస్ట్
ప్రియాంక, అనుష్కల కెరీర్‌ను నాశనం చేశారన్న ఆరోపణలపై చిత్రనిర్మాత కరణ్ ఘాటుగానే స్పందించారు. అలాంటి అబద్ధాలతో తనకేలాంటి నష్టం కలగదన్నారు.తనను ఎవరు ఎంత దూషించినా.. చెడుగా చూపించాలని ప్రయత్నించినా భయపడేది లేదన్నారు. కాగా.. ఇటీవల ఇంటర్వ్యూలో ప్రియాంక మాట్లాడుతూ.. హిందీ పరిశ్రమలో రాజకీయాలు ఎక్కువని, వాటిని తట్టుకోలేకనే హాలీవుడ్‌కి వచ్చేశానని చెప్పుకొచ్చింది. దీనిపై కూడా కంగనా ట్విటర్ వేదికగా స్పందించింది.