స్టార్ ప్రొడ్యూసర్ పరువు తీసిన కామెడీ షో.. ఇన్ స్టా పోస్ట్ వైరల్ | Karan Johar Upset With Mimicking Him Instagram Post Viral | Sakshi
Sakshi News home page

Karan Johar: కమెడియన్‌పై విరుచుకుపడ్డ ప్రముఖ నిర్మాత

Published Mon, May 6 2024 11:13 AM | Last Updated on Mon, May 6 2024 12:21 PM

Karan Johar Upset With Mimicking Him Instagram Post Viral

హిందీలో చాలా ఏళ్ల నుంచి దర్శకుడు, నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి కరణ్ జోహార్. ప్రస్తుతం డైరెక్షన్ పక్కనబెట్టి నిర్మాతగా వరస చిత్రాలు తీస్తున్నారు. కరణ్ నిర్మించిన 'మిస్టర్ అండ్ మిసెస్ మహి' ఈ నెల చివర్లో రానుంది. సరే దాని గురించి పక్కనబెడితే ఈయన్ని ఇప్పుడు ఓ కమెడియన్ ఘోరంగా హర్ట్ చేశాడు. దీంతో కరణ్ ఫుల్ ఫైర్ అయ్యాడు. తనని చాలా బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇన్ స్టాలో స్టోరో కూడా పోస్ట్ చేశాడు.

(ఇదీ చదవండి: This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?)

ఇంతకీ ఏమైంది?
దర్శకనిర్మాత కరణ్ జోహార్ గురించి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రోల్స్, మీమ్స్ వస్తూనే ఉంటాయి. వాటిని చూసిచూడనట్లు వదిలేస్తుంటాడు. అయితే ప్రముఖ రియాలిటీ షోలో ఓ కమెడియన్.. కరణ్‌ని దారుణంగా అనుకరించాడట. తల్లితో కలిసి టీవీ చూస్తున్న టైంలో ఇందుకు సంబంధించిన ప్రోమో వచ్చిందని, దీంతో తనకు చాలా ఇబ్బందిగా అనిపించిందని కరణ్ జోహార్ చెప్పుకొచ్చాడు.

కరణ్ పోస్టులో ఏముంది?
'నేను, మా అమ్మతో కలిసి టీవీ చూస్తున్నాను. ఓ పేరున్న ఛానెల్‌లో రియాలిటీ కామెడీ షో ప్రోమో ఒకటి చూశాను. అయితే ఓ కమెడియన్.. నన్ను చాలా చీప్‌గా అనుకరించాడు. ఇలాంటివి ట్రోలర్స్ నుంచి వచ్చాయంటే అర్థముంది. కానీ ఇండస్ట్రీలో పేరున్న కమెడియన్ ఇలా చేయడం ఏం బాలేదు. దాదాపు 25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న నన్ను ఇలా అవమానించడం కరెక్టేనా? ఈ విషయంలో నాకు కోపం రావట్లేదు కానీ చాలా బాధ కలుగుతోంది' అని కరణ్ జోహార్ ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ఆ షో ఏంటి? కమెడియన్ ఎవరనేది మాత్రం బయటకు చెప్పలేదు.

(ఇదీ చదవండి: శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా)

karan johar

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement