‘సల్మాన్ మాటలకు పడిపోయా’ | Got stumped while talking to Salman Khan on my chat show: Karan Johar | Sakshi
Sakshi News home page

‘సల్మాన్ మాటలకు పడిపోయా’

Published Tue, Jan 14 2014 12:39 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

‘సల్మాన్ మాటలకు పడిపోయా’ - Sakshi

‘సల్మాన్ మాటలకు పడిపోయా’

విత్ కరణ్’ టాక్‌షోలో తొలిసారిగా పాల్గొ న్న బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ మాటలకు పడిపోయానని సినీ నిర్మాత కరణ్ జోహర్ అన్నారు. చాలా తమాషాగా సంభాషించారని, ప్రశ్నలకు సమాధానాలు వడివడిగా, ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పారని తెలిపారు. సెలిబ్రిటీ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’ నాలుగో ఎడిషన్‌లో కరణ్ తొలిసారిగా అతడి ప్రియ స్నేహితుడైన షారుఖ్ ఖాన్ ఒకప్పటి శత్రువు సల్మాన్‌తో చిట్‌చాట్ చేశారు. తానిప్పటికీ స్వచ్ఛమైన మనిషి(వర్జిన్)నేనన్న సల్మాన్ వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. అయితే అనేక మంది తన వద్దకు వచ్చి మీరు నిజంగా ‘వర్జినే’నా? అని అడుగుతుంటారన్నాడు.
 
 అయితే ఆ రోజు తాను తమాషాగా ఆ మాట అన్నానని వివరించారు. చాలా హస్య చతురతతో మాట్లాడుతున్న సల్మాన్‌తో కొన్నిసార్లు ఎలా సంభాషించాలో కూడా తెలియలేదన్నారు. గతేడాది ఎడిషన్‌ను బాలీవుడ్ నటులు, దంపతులు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్‌తో ప్రారంభమైందని, అప్పుడు అంతా ప్రశాంతంగా సాగిందని కరణ్ చెప్పారు. ఇప్పటి షో దానికి కాస్త విభిన్నంగా జరిగిందని వివాదానికి ఊతమిచ్చారు. ప్రతి అంశాన్ని ప్రేక్షకులు లోతుగా వెళ్లి  ఎందుకు విశ్లేషిస్తారో అర్ధం కావడం లేదని, ఇది కేవలం షో మాత్రమేనని తెలిపారు. ఈసారి ఈ షోలో సల్మాన్‌ఖాన్, అమీర్ ఖాన్‌లు పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణ కానుంది. ప్రతిఏటా షారుఖ్ ఖాన్ ఈ షోలో పాల్గొంటున్నారు. అయితే సల్మాన్ ఖాన్ వినసొంపైన మాటలతో ఆకట్టుకున్నారని, అతడు ఈ షోలో పాల్గొన్నందుకు ఎంతో సంతోషంగా ఉందని కరణ్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement