కరణ్‌ విషం పెడతాడన్న కంగనా | Kangana syas Karan Johar serves poison to his guests | Sakshi
Sakshi News home page

Published Sat, Jan 13 2018 10:52 AM | Last Updated on Tue, Sep 18 2018 7:34 PM

Kangana syas Karan Johar serves poison to his guests - Sakshi

బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్‌, స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహర్‌ల మధ్య ఉన్న విధం గురించి తెలిసిందే. గతంలో కరణ్ టీవీ షో ‘కాఫీ విత్ కరణ్’లో పాల్గొన్న కంగన అతనిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. కరణ్ కు బంధుప్రీతి ఎక్కువ అని, అతడు వారసత్వాన్ని, సినిమా మాఫియాను ప్రొత్సహిస్తున్నాడని ఆరోపించింది. ఈ ఆరోపణలపై కరణ్ కూడా ఘాటుగానే స్పందించాడు. ఈ కార్యక్రమం తరువాత ఈ ఇద్దరు ఒకే వేదిక మీద ఎప్పుడూ కలవలేదు.

అయితే మాటల యుద్ధం మాత్రం కొనసాగుతూ వచ్చింది. తాజాగా మరోసారి ఓ టీవీలో కరణ్ తో పాటు పాల్గొన్న కంగన సంచలన వ్యాఖ్యలు చేసింది. షోలో భాగంగా ఒకరి గురించి ఒకరికి ఎంత తెలుసు అని తెలుసుకునేందుకు, కరణ్ తన ఇంటికి వచ్చిన అతిథులకు ఏం వడ్డిస్తారు అన్న ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు సమాధానంగా కరణ్ తన అతిథిలకు విషం వడ్డిస్తారని చెప్పింది కంగనా. ఈ వ్యాఖ్యలపై కరణ్ స్పందించకపోవటం విశేషం. అయితే కంగన కావాలనే కరణ్ ను విమర్శిస్తుందంటున్నారు బాలీవుడ్ ప్రముఖులు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement