డేర్ డెవిల్ దీపిక
కథానాయికల్లో దీపికా పదుకొనేని డేర్ డెవిల్ అనొచ్చు. తెరపైనే కాదు, తెర వెనుక కూడా ఏదైనా డేర్‌గా చేసేస్తారామె. సిద్దార్థ్ మాల్యాతో డేటింగ్, తర్వాత అతనితో కటీఫ్ చెప్పేసి రణబీర్‌కపూర్‌తో లవ్ ఎఫైర్. తర్వాత అతనికి కూడా గుడ్‌బై చెప్పేసి రీసెంట్‌గా రణవీర్‌సింగ్‌తో చెట్టాపట్టేసుకొని తిరగడం... ఇవన్నీ దీపిక ధైర్యానికి దర్పణాలు. ఇటీవల ‘కాఫీ విత్ కరణ్’ అనే బుల్లితెర కార్యక్రమంలో ప్రియాంకతో కలిసి పాల్గొన్న దీపిక... తన మనసులో మాటను డేర్‌గా చెప్పేసి.. తాను డేర్ డెవిల్‌నని మరోసారి రుజువు చేసుకుంది. ‘మీ బెస్ట్ ఆఫ్ స్క్రీన్ కిస్ ఎవరితో? రణబీర్ కపూర్‌తోనా,
సైఫ్ అలీఖాన్‌తోనా, లేక రణవీర్‌సింగ్‌తోనా? అని సదరు కార్యక్రమ వ్యాఖ్యాత అడిగితే... ‘రణవీర్‌సింగ్’ అని డేర్‌గా సమాధానమిచ్చేసి తనదైన శైలిలో కిలకిలా నవ్వేసింది ఈ సొట్టబుగ్గల వయ్యారి. ప్రస్తుతం రణవీర్‌తో దీపిక పీకలలోతు ప్రేమలో కూరుకుపోయి ఉన్నారు. వీరిద్దరు కలిసి ఇటీవలే ‘రామ్‌లీలా’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో ఘాటైన లిప్‌లాక్‌లు చాలా ఉన్న విషయం తెలిసిందే. ఆ సన్నివేశాల్లో దీపిక, రణవీర్ నటించ లేదని జీవించారని ‘కాఫీ విత్ కరణ్’ కార్యక్రమంలో దీపిక చెప్పిన సమాధానం చెప్పకనే చెబుతోంది. లక్షలాది మంది చూసే టీవీ కార్యక్రమంలో ధైర్యంగా ఉన్నదున్నట్లు మాట్లాడి ‘డేర్ డెవిల్’ అనే బిరుదుని సార్థకం చేసుకుంది దీపిక.