సూపర్ స్టార్ మహేశ్ బాబు భరత్ అనే నేను మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ. ప్రస్తుతం ఆమె హిందీలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. ఇటూ తెలుగు, అటూ హిందీలో వరుస ఆఫర్లు అందుకుంటోంది. ఈ నేపథ్యంలో స్టార్ హీరో షాహిద్ కపూర్‌తో కలిసి ఆమె కాఫీ విత్ కరణ్ షోకు హాజరైంది. ఈ సందర్భంగా పరిశ్రమలోకి రాకుముందు ఓ దర్శకుడి పట్ల తను వ్యవహరించు తీరుకు చాల ఇబ్బంది పడ్డానని చెప్పింది.
చదవండి: పూరీ దగ్గర సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశాడా!
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘చిన్నప్పటి నుంచి నటి అవ్వాలనేది నా కోరిక. ఇదే విషయం మా దగ్గరి బంధువు అయిన నటి జూహి చావ్లాకు తెలిసింది. నన్ను నటిగా తెరపైకి తీసుకురావాలని ఆమె ప్రయత్నిస్తున్న క్రమంలో తను నటించిన ఐ యామ్ మూవీ విడుదలైన మంచి టాక్ తెచ్చుకుంది. దీంతో ఆమె ఇండస్ట్రీ వాఆళ్ల కోసం ఓ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీ హీరోహీరోయిన్లు, దర్శక-నిర్మాతలతో పాటు పలువుకు సినీ పెద్దలు కూడా హాజయ్యారు. వారికి పరిచయం చేసేందుకు నన్నూ కూడా ఆపార్టీకి ఆహ్వానించారు.
చదవండి: సౌందర్యతో అలాంటి రిలేషన్ ఉండేది, అసలు విషయం చెప్పిన జగ్గూభాయ్
అక్కడికి వెళ్లిన నన్ను.. దర్శకుడు సుజాయ్ హోష్‌కు ఆమె పరిచయం చేశారు. పరిచయం అనంతరం ఆయన నాతో మాట్లాడుతూ.. చేయి పైకెత్తి ఎవరినో పిలవబోయారు. దాన్ని అర్థం చేసుకోలేని నేను.. కౌగిలించుకోమన్నారేమో అనుకుని వెంటనే ఆయన్ని హగ్ చేసుకున్న. నేను చేసిన పనికి అక్కడే ఉన్న జూహీ షాకై చూశారు. ‘ఈ అమ్మాయి ఇలా చేసిందేంటి!’ అన్నట్టుగా ఆమె నా మొహం వైపు చూశారు. ఆ సంఘన గుర్తొస్తే ఇప్పటికీ నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. నేను మర్చిపోలేని ఇబ్బందికర సంఘటన ఇది’’ అంటూ కియారా చెప్పుకొచ్చిది.
Comments
Please login to add a commentAdd a comment