కత్రినా కైఫ్‌తో ఎఫైర్ పెట్టుకుంటా!
కత్రినా కైఫ్‌తో ఎఫైర్ పెట్టుకుంటా!
Published Tue, Nov 8 2016 8:14 PM | Last Updated on Mon, Sep 4 2017 7:33 PM
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ తాజాగా ‘కాఫీ విత్ కరణ్’ షోలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఎవరితో ఎఫైర్ పెట్టుకోవడం నీకు ఇష్టమని కరణ్ ప్రశ్నించగా.. ఏమాత్రం తడుముకోకుండా ‘కత్రినా కైఫ్‌తో’ అని చెప్పింది. దీంతో అందరూ ఒకింత విస్తుపోయారు. అలియా వివరణ ఇస్తూ.. ‘ఎందుకో నేను చెప్తాను. మేం కలిసి చాలా కసరత్తులు (బన్నీ హాప్) వేశాం. కాబట్టి ఇది పనిచేస్తుంది’ అని అంటూ కొంటెగా చెప్పుకొచ్చింది.
కరణ్ జోహార్ ’కాఫీ విత్ కరణ్’ సీజన్ 5 ఫస్ట్ ఎపిసోడ్‌లో షారుఖ్ ఖాన్, అలియా భట్ పాల్గొన్నారు. షారుఖ్, అలియా చేసిన అల్లరి ప్రేక్షకులను బాగా ఎంటర్‌టైన్ చేసింది. ర్యాపిడ్ ఫైర్ రౌండ్‌లో షారుఖ్, అలియా పోటాపోటీగా సమాధానాలు చెప్పారు. ఈ సందర్భంగా ఎవరితో ఎఫైర్ పెట్టుకుంటావని అలియాను అడుగగా, కత్రిన అని సమాధానం చెప్పింది. తామిద్దరి కలిసి బన్నీహాప్ బాగా చేస్తామని చెప్పింది. అయితే, బన్నీహాఫ్ అంటే ఏమిటంటూ షారుఖ్ అమాయకంగా అడుగటం.. దానికి అలియా, కరణ్ ఇచ్చిన సమాధానాలు షోలో నవ్వులు పూయించాయి. అయితే, ఇంతకుముందు స్వీమింగ్‌పూల్‌లో కత్రిన, అలియా కలిసి కసరత్తులు చేస్తూ బన్నీహాప్ చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో అలియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఈ వీడియో అప్పట్లో బాగా హల్‌చల్ చేసింది. దీనిని ఉద్దేశిస్తూ అలియా ఆ వ్యాఖ్యలు చేసిందన్నమాట.
Advertisement
Advertisement