
టీడీపీ–బీజేపీ–జనసేన కూటమికి ప్రయోజనం చేకూర్చేలా ఆమె ప్రచారం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై చంద్రబాబు గ్యాంగ్ చిమ్ముతున్న విషాన్నే వెదజల్లుతున్న పీసీసీ చీఫ్
చంద్రబాబు సూచించిన మేరకే అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక
ప్రతిఫలంగా కడప లోక్‌సభ స్థానంలో షర్మిలకు టీడీపీ–బీజేపీ ఓట్లు బదలాయించేలా లోపాయికారి ఒప్పందం
అందులో భాగంగానే అక్కడ డమ్మీ అభ్యర్థిని బరిలోకి దించిన బాబు
చింతలపూడిలోనూ మిలాఖత్.. టీడీపీ అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి చెట్టాపట్టాల్
కుప్పం, మంగళగిరి, పిఠాపురం నియోజకవర్గాల వైపు కన్నెత్తి కూడా చూడని షర్మిల
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్‌ను ఒంటరిగా ఎదుర్కోవడానికి బెంబేలెత్తిపోయిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు జనసేన, బీజేపీలతో జతకట్టి.. చివరికి పీసీసీ చీఫ్ షర్మిలతోనూ మిలాఖత్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా సీఎం జగన్‌పై దుష్ఫ్రచారం చేసి, తాను సూచించిన అభ్యర్థులను కాంగ్రెస్ తరఫున బరిలోకి దించేలా బాబు స్కెచ్ వేశారు. ఇందుకు ప్రతిఫలంగా కడప లోక్‌సభ స్థానంలో షర్మిలకు టీడీపీ–బీజేపీ ఓట్లు బదలాయించేలా వారిద్దరి మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరింది.
కడప లోక్‌సభ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా సీనియర్ నేతలు ఆర్. శ్రీనివాసులురెడ్డి, మల్లెల లింగారెడ్డి వంటి వారిని కాదని ఎవరికీ పెద్దగా తెలియని భూపేష్‌రెడ్డిని చంద్రబాబు బరిలోకి దించారు. నిజానికి.. భూపేష్‌రెడ్డి చిన్నాన్న ఆదినారాయణరెడ్డి అదే లోక్‌సభ స్థానం పరిధిలోని జమ్మలమడుగు అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తుండటం గమనార్హం.
ముందస్తుగా కుదిరిన లోపాయికారి ఒప్పందం మేరకు కడప లోక్‌సభ అభ్యర్థిగా డమ్మీని బరిలోకి దించిన చంద్రబాబు.. ఇప్పుడు షర్మిలకు టీడీపీ–బీజేపీ ఓట్లను బదలాయించేలా కూటమి శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. చంద్రబాబు–షర్మిల మధ్య కుదిరిన ఈ రహస్య ఒప్పందం చింతలపూడి నియోజకవర్గంలోనూ ప్రతిబింబిస్తోంది. ఇక్కడ టీడీపీ అభ్యర్థి రోషన్, కాంగ్రెస్ అభ్యర్థి ఎలీజా ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని ప్రచారం చేస్తుండటమే అందుకు నిదర్శనం.
దారితప్పిన బాటసారి..
నిజానికి.. తెలంగాణలో రాజకీయ శూన్యత లేకపోయినా వాస్తవాన్ని అంచనా వేయలేక.. రాజకీయంగా తనను తాను ఎక్కువగా ఊహించుకుని 2021, జూలై 8న వైఎస్సార్టీపీని షర్మిల స్థాపించారు. అదే సమయంలో.. షర్మిల, ఆమె భర్త అనిల్ వ్యక్తిత్వాలను హననం చేస్తూ గతంలో దుష్ఫ్రచారం చేసిన ఎల్లో మీడియా ఆమెకు అనుకూలంగా కథనాలు వండివార్చడం మొదలుపెట్టింది.
వైఎస్సార్టీపీ స్థాపించడానికి కాస్త ముందు ఇడుపులపాయలో, పులివెందులలో ఏవేవో జరిగిపోతున్నట్లుగా ఎల్లో మీడియా రాసిన విషపు రాతలను షర్మిల ఖండించలేదు. ఈ పరిణామాలన్నీ పరిశీలిస్తే.. షర్మిల ఎల్లో మీడియాతోపాటు చంద్రబాబు డైరెక్షన్‌లోనే రాజకీయ ప్రయాణం మొదలైందని అప్పట్లో రాజకీయ పరిశీలకులు విశ్లేషించారు.
‘తెలంగాణలోనే నా బతుకు.. చావు ఇక్కడే’.. అంటూ వైఎస్సార్‌టీపీ స్థాపించినప్పుడు శపథం చేసిన షర్మిల.. తాను పాలేరు, మరోచోట పోటీచేస్తానని.. మొత్తం 119 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దించుతానని ప్రకటించారు. పైగా.. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఫొటో పెట్టుకుని ఓట్లు అడగడానికి కాంగ్రెస్ నాయకులకు సిగ్గుండాలి’ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
సీన్ కట్‌చేస్తే.. గతేడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే చంద్రబాబు డైరెక్షన్‌లో కాంగ్రెస్ పార్టీకి షర్మిల భేషరతుగా మద్దతు ప్రకటించారు. ఆ తర్వాత ఆయన ఆదేశాలతోనే తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో వైఎస్సార్టీపీని కాంగ్రెస్‌లో విలీనంచేసి ఆమె ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ పదవిని దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment