
విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర కాంగ్రెస్‌లోని అన్ని విభాగాలు రద్దు చేసింది. ఈ విషయాన్ని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ప్రకటించారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగానే కమిటీల రద్దు నిర్ణయం తీసుకున్నామని, త్వరలో కొత్త కమిటీలతో రాబోతున్నామని ఆమె పేర్కొన్నారు.
ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణమైన ఫలితాల్ని చవిచూసింది. దీంతో ఢిల్లీకి షర్మిలను రప్పించుకున్న హైకమాండ్.. ఫలితాలపై సమీక్షించడంతో పాటు పార్టీ పునర్మిర్మాణంపైనా చర్చించినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment