సాక్షి, విజయవాడ: కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పీసీసీ చీఫ్ షర్మిలకు వ్యతిరేకంగా ఆ పార్టీ నాయకులు నిరసన తెలిపారు. షర్మిల కాంగ్రెస్‌ను భ్రష్టు పట్టించిందని వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు.. షర్మిలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ మీడియాతో మాట్లాడారు.
‘‘ రాహుల్ గాంధీకి విలువ ఇచ్చి షర్మిలను ఏమీ అనకుండా వదిలేశాం. కక్షపూరిత చర్యల కోసమే షర్మిల ఏపీకి వచ్చిందా?. పార్టీ ఇచ్చిన ఫండ్ దాచుకుని షర్మిల అభ్యర్ధుల్ని గాలికి వదిలేసింది. షర్మిల క్యాడర్‌ను గాలికి వదిలేశారు.
రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమయ్యాను. పీసీసీ ప్రెసిడెంట్‌గా పనిచేసిన షర్మిల నైతిక బాధ్యతగా తన పదవికి రాజీనామా చేయాలి. పార్టీ అభ్యర్థులకు కనీసం జెండాలు కూడా అందించలేదు. రాహుల్ గాంధీ ధైర్యంగా మోదీకి ఎదురుగా నిలబడ్డారు’’ అని ఆమె అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment