DAGGUBATI purandesvari
-
May 28th: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
May 28th AP Elections 2024 News Political Updates..07:00 PM, May 28th, 2024 కౌంటింగ్ రోజున అల్లర్లకి టీడీపీ కుట్ర!: మంత్రి మేరుగు నాగార్జునపోలింగ్ రోజున పేదలపై దాడులతో అలజడులు సృష్టించిన టీడీపీ గూండాలుఅయినా ఎలాంటి చర్యలు తీసుకోని ఈసీ. ఆఖరికి ఈసీఐ నిబంధనలు కూడా బేఖాతరుఈసీఐకి విరుద్ధంగా సీఈవో ఆదేశాలు ఇవ్వడమేంటి?కౌంటింగ్ రోజున అల్లర్లకి టీడీపీ కుట్ర! పోలింగ్ రోజున పేదలపై దాడులతో అలజడులు సృష్టించిన టీడీపీ గూండాలు అయినా ఎలాంటి చర్యలు తీసుకోని ఈసీ. ఆఖరికి ఈసీఐ నిబంధనలు కూడా బేఖాతరుఈసీఐకి విరుద్ధంగా సీఈవో ఆదేశాలు ఇవ్వడమేంటి?-మంత్రి మేరుగు నాగార్జున#TDPLosing#YSRCPWinningBig pic.twitter.com/FLV1NZcVbf— YSR Congress Party (@YSRCParty) May 28, 2024 06:00 PM, May 28th, 2024 నెల్లూరు..మీడియాతో మాట్లాడిన నెల్లూరు జిల్లా కలెక్టర్ హరి నారాయణ, ఎస్పీ అరిఫ్ హఫీజ్..కౌంటింగ్ కేంద్రం వద్ద మూడు అంచెల్లో భద్రత ను ఏర్పాటు చేశాం: కలెక్టర్కౌంటింగ్ రోజు కౌంటింగ్ కేంద్రం వద్ద ట్రాఫిక్ ఆంక్షలువుంటాయి.కౌంటింగ్ రోజు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో వుంటుంది.కౌంటింగ్ కేంద్రం వద్దకు కేవలం అభ్యర్థులు,ఎజెంట్ లకు మాత్రమే అనుమతి.కౌంటింగ్ రోజు బాణాసంచా కాల్చడం, డీజేలు పెట్టడం పూర్తిగా నిషేధం.. ధిక్కరిస్తే కఠిన చర్యలు తప్పవు: ఎస్పీకౌంటింగ్ కేంద్రం వద్ద కేంద్ర బలగాలు,బయట రాష్ట్ర సాయుధ పోలీసు బలగాలు ఉంటాయి.అల్లర్లకు అవకాశం వుండే వారిని ఇప్పటికే బైండోవర్ చేశాం2:00 PM, May 28th, 2024సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్లు..ఈవీఎంల్లో ఫలితాలు నిక్షిప్తమయ్యాక ఊహగానాలతో లాభమేంటి?పోస్టల్ బ్యాలెట్లో ఓట్లు తమకే పడ్డాయని టీడీపీ ప్రచారం చేసుకుంటోంది.10-15 రోజులుగా మాచర్ల సెంటర్‌గా టీడీపీ, ఎల్లో మీడియా గందరగోళం సృష్టిస్తోంది. పోలింగ్ కేంద్రంలోని పిన్నెల్లి వీడియో ఎలా బయటికి వచ్చింది?. టీడీపీ నేతలు ఈవీఎంలు ధ్వంసం చేసిన వీడియోలు ఎందుకు బయటకు రాలేదు. కూటమి ఏర్పడిన తర్వాత ఈసీ వ్యవహారశైలి మారింది.ఈసీ కక్ష సాధింపు ధోరణిలో వెళ్లాల్సిన అవసరమేంటి? ఈసీ అంపైర్‌లా వ్యవహరించాల్సి ఉంటుంది.బాధితులు రీపోలింగ్ అడగాలి.. టీడీపీ ఎందుకు అడగట్లేదు?. సీఎస్‌ను తప్పించాలని కుట్ర చేస్తున్నారు. చంద్రబాబు వైరస్‌తో ఈసీ ఇన్ఫెక్ట్ అయ్యింది1:30 PM, May 28th, 2024ప్రజా పాలన జూన్ 4 నుంచి మళ్లీ కొనసాగనుందిపేదోడిని ఆప్యాయంగా అక్కున చేర్చుకునే జనరంజకమైన ప్రజా పాలన జూన్ 4 నుంచి మళ్లీ కొనసాగనుంది. పేదోడిని ఆప్యాయంగా అక్కున చేర్చుకునే జనరంజకమైన ప్రజా పాలన జూన్ 4 నుంచి మళ్లీ కొనసాగనుంది.#YSRCPWinningBig#YSJaganAgain pic.twitter.com/YvbPmfC2sj— YSR Congress Party (@YSRCParty) May 28, 2024 12:30 PM, May 28th, 2024సచివాలయంమాజీమంత్రి పేర్ని నాని కామెంట్లు..ఈసీ అధికారులును కలిసి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు సడలింపు నిబంధనలపై ఫిర్యాదు చేశాంఅన్ని రాష్ట్రాలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై గతంలో నిబంధనలు పంపారుపోస్టల్ బ్యాలెట్ కవర్లు, 13ఏ, 13బి నిబంధనలను చెప్పారుగెజిటెడ్ అధికారి సంతకం పెట్టి స్టాంప్ వెయ్యాలి అని గతంలో చెప్పారుస్టాంప్ లేకపోయినా చేతితో రాసినా ఆమోదించాలని గతంలో ఆదేశించారుకానీ ఇప్పుడు కొత్తగా అలా స్టాంప్ వెయ్యకపోయినా, చేత్తో రాయకపోయినా సరే ఆమోదించమని అన్నారుదేశంలో ఏ రాష్ట్రంలో లేనిది ఇక్కడే ఎందుకు తీసుకొచ్చారుఈసీ ఇచ్చిన ఆదేశాలు గొడవలకు దారి తీసే అవకాశం ఉందిఈసీ నిబంధనలు వలన ఓటు రహస్యత ఉండదుఏజెంట్లు అభ్యంతరం తెలిపితే ఘర్షణలకు దారి తీస్తుందిఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పని నిబంధనలను ఎలా అమాలుచేస్తారు అని ఆడిగాంఈ నిబంధనలపై పునరాలోచించాలి అని కోరాం11:57 AM, May 28th, 2024తిరుమలఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి కామెంట్లు..వైఎస్సార్సీపీకి 175/175 సీట్లు రావడం ఖాయంఈవీఎం ట్యాంపరింగ్ అనేది టీడీపీ అభూత కల్పితం మాత్రమే2019లో అధికారంలో ఉన్న చంద్రబాబు ఎందుకు ఈవీఎం ట్యాంపరింగ్ చేయలేక పోయాడుగెలిస్తే ప్రజల మద్దతు.. ఓడితే ఈవీఎం ట్యాంపరింగ్ అంటూ మాటలు మారుస్తాడు చంద్రబాబుప్రజా మద్దతు ఉన్నట్లు కేవలం టీడీపీ భ్రమ కల్పించే ప్రయత్నం చేసిందిఅనేక ప్రాంతాల్లో ఈవీఎంలను ధ్వంసం చేయడం జరిగింది.. ఒక ప్లాన్ ప్రకారం వైఎస్సార్సీపీ నాయకులను ఇరికించడానికి చేసిన కుట్రతెలుగుదేశం పార్టీ చేసిన దౌర్జన్యాలు ప్రజలు గమనించారుఎలాగో ఓడిపోతున్నాం కాబట్టి దౌర్జన్యాలు చేయండని చంద్రబాబు పార్టీ కేడర్‌కు ఆదేశాలు ఇచ్చారుమహిళా ఓటింగ్ అధికంగా ఉండటం వల్ల చంద్రబాబుకు భయం.. జగన్‌కు ధైర్యం వచ్చింది 11:44 AM, May 28th, 2024ఏపీ హైకోర్టులో ఎమ్మెల్యే పిన్నెల్లికి ఊరటమూడు కేసుల్లో మందస్తు బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టుఈవీఎం ధ్వంసం కేసులో ఇచ్చిన బెయిల్ షరతులే వర్తిస్తాయన్న హైకోర్టుకండీషన్లతో బెయిల్ మంజూరు 6వ తేదీ వరకు పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టకూడదన్న హైకోర్టు కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు అనుమతి11:27 AM, May 28th, 2024తిరుమల:వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కామెంట్లు.. వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయంటే.. వైఎస్ జగన్ మళ్లీ సీఎంగా రావడం ఖాయంఅశాంతి కిషోర్ మాటలకు, మంత్రాలకు చింతకాయలు రాలవుఓ పార్టీలో చేరి సక్సెస్ అవ్వాలని అనుకున్న ప్రశాంత్ కిషోర్ భవితవ్యం, శకునం పలికిన బల్లి కుడితిలో పడ్డట్టు మారిందిప్రశాంత్ కిశోర్ మాటలు నమ్మి టీడీపీ నాయకులు కోట్లలో బెట్టింగ్ చేస్తున్నారు2019లో వచ్చిన ఫలితాలే మళ్లీ పునరావృతం కానున్నాయిఎన్నికలు సజావుగా సాగాయి.. ఎన్నికల ప్రక్రియకు వైఎస్సార్సీపీ ఎక్కడ విఘాతం కలిగించలేదుటీడీపీ దొంగ ఓట్లు వేస్తున్నారనే ఉద్దేశంతో వైఎస్సార్సీపీ అడ్డుకొనే ప్రయత్నం చేసిందిమా నాయకుడు గెలిచే సీట్లతో పాటుగా.. ప్రమాణస్వీకారానికి డేట్, టైం ఫిక్స్ చేశారుప్రజలను మభ్యపెట్టే చంద్రబాబుకు అలా చెప్పే ధైర్యం లేదుఅసెంబ్లీలో 151కి పైగా, పార్లమెంట్లో 22కు పైగా సీట్లు వైఎస్సార్సీపీ గెలవబోతుందిపెట్టుకున్న ముహూర్తంలో ప్రమాణ స్వీకారం సీఎం జగన్ చేయడం ఖాయం 10:30 AM, May 28th, 2024నమ్మిన వాళ్లను వెన్నుపోటు పొడవడం చంద్రబాబు నైజంనమ్మిన వాళ్లను వెన్నుపోటు పొడవడం చంద్రబాబు నైజమని ఆనాడే చెప్పిన ఎన్టీఆర్ గారు..తెలుగు వాళ్లు చేతులెత్తి మొక్కిన మహానుభావుడిని ఆఖరి రోజుల్లో బాబు ఎలా ఏడిపించాడో ఆయన మాటల్లోనే..!Remembering Shri. Nandamuri Taraka Rama Rao Garu on his Jayanthi Today.నమ్మిన వాళ్లను వెన్నుపోటు పొడవడం చంద్రబాబు నైజమని ఆనాడే చెప్పిన ఎన్టీఆర్ గారు..తెలుగు వాళ్లు చేతులెత్తి మొక్కిన మహానుభావుడిని ఆఖరి రోజుల్లో బాబు ఎలా ఏడిపించాడో ఆయన మాటల్లోనే..!#CBNKilledNTR pic.twitter.com/A5PJ6b4NAQ— YSR Congress Party (@YSRCParty) May 28, 20249:34 AM, May 28th, 2024విజయవాడపిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటీషన్ పై నేడు తీర్పునిన్నటి వాదనలలో పోలీసుల కుట్రలు బట్టబయలుపిన్నెల్లి విషయంలో రోజురోజుకి దిగజారుతున్న పోలీసుల తీరుపిన్నెల్లి కౌంటింగ్ లో పాల్గోకుండా పోలీసులతో కలిసి పచ్చముఠా కుట్రఇవిఎం డ్యామేజ్ కేసులో జూన్ 6 వరకు పిన్నెల్లిపై చర్యలు తీసుకోవద్దని 23 న హైకోర్టు ఆదేశంహైకోర్టు తీర్పు తర్వాతే అదే రోజు పిన్నెల్లి పై మరో మూడు కేసులు నమోదు చేసిన పోలీసులుఇందులో రెండు హత్యాయత్నం కేసులు నమోదు చేయడంతో ముందస్తు బెయిల్ కి హైకోర్టుని మరోసారి ఆశ్రయించిన పిన్నెల్లిహైకోర్టు విచారణలో మూడు కేసులని 22 న నమోదు చేసినట్లుగా పోలీసుల వెల్లడిహైకోర్టు తీర్పు తర్వాతే 23 న తప్పుడు కేసులు నమోదు చేశారన్న పిన్నెల్లి న్యాయవాదిరికార్డులు పరిశీలించడంతో రికార్డులు తారుమారు చేసినట్లు బయడపడ్డ వైనం23 న కేసులు నమోదు చేసి 24 న స్ధానిక మేజిస్డ్రేట్ కి తెలియపరిచినట్లుగా రికార్డులలో నమోదుహైకోర్టుని తప్పుదోవ పట్టించే విధంగా పోలీసుల వ్యవహరించిన తీరుపై సర్వత్రా విస్మయంమరోవైపు ప్రభుత్వ జిఓ లేకుండా పోలీసుల తరపున వాదించిన ప్రైవేట్ న్యాయవాది అశ్వినీకుమార్తొలిరోజు వాదనలు వినిపించి రెండవ రోజు వాదనలకి గైర్హాజరైన అశ్వినీకుమార్ఆసక్తికరంగా బాదితుల తరపున ఇంప్లీడ్ పిటీషన్ వేసి వాదనలు వినిపించిన టిడిపి లీగల్ సెల్ అధ్యక్షుడు పోసాని వెంకటేశ్వర్లుతీర్పు నేటికి వాయిదా వేసిన హైకోర్టు న్యాయమూర్తి 8:09 AM, May 28th, 2024మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేసులో డీజీపీ, పోలీసుల కుట్ర బట్టబయలుహైకోర్టు సాక్షిగా దొరికి పోయిన డీజీపీ, పల్నాడు పోలీసులుపిన్నెల్లిపై కేసుల నమోదు విషయంలో రికార్డులు తారుమారు చేసినట్టుగా వెల్లడిపోలీసుల తీరుపై హైకోర్టులో వాదనల సందర్భంగా తీవ్ర విస్మయంపిన్నెల్లికి ముందస్తు బెయిల్‌పై కోర్టు తీర్పు నేటికి వాయిదామరోవైపు ప్రభుత్వం జీవో లేకుండా, నిబంధనలు పాటించకుండా పోలీసుల తరఫున వాదనలకు దిగిన లాయర్ అశ్వనీకుమార్పోలీసుల తరపున ప్రైవేట్ లాయర్ అశ్వనీకుమార్ హాజరుకావడం చర్చనీయాంశం కావడంతో నిన్నటి వాదనలకి గైర్హాజరుటీడీపీ లీగల్ సెల్ న్యాయవాది పోసాని ఇంప్లీడ్ పిటిషన్దిగ్భ్రాంతి కలిగిస్తున్న పోలీసులు తీరుపిన్నెల్లి విషయంలో రోజురోజుకూ దిగజారుతున్న డీజీపీ, పల్నాడు పోలీసులుపోలీసు రాజ్యాన్ని తలపిస్తోందన్న చర్చఈవీఎం డ్యామేజీ కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లికి ఈనెల 23న హైకోర్టులో ఊరటజూన్ 5 వరకూ ఎలాంటి అరెస్టులు వద్దని తేల్చిచెప్పిన హైకోర్టుకౌంటింగ్ సమయంలో పిన్నెల్లి లేకుండా చేయడానికి పచ్చముఠాలతో పోలీసుల కుట్రహత్యాయత్నం సహా మూడు కేసులను ఎమ్మెల్యే పిన్నెల్లిపై నమోదు చేసిన పోలీసులువాస్తవంగా ఈకేసులను హైకోర్టు తీర్పు ఇచ్చిన మే 23నే నమోదు చేసిన పోలీసులుకాని హైకోర్టు విచారణలో మే 22న నమోదుచేసినట్టుగా హైకోర్టుకు చెప్పిన పోలీసులుపోలీసులు వాదనలపై పిన్నెల్లి తరఫు న్యాయవాది తీవ్ర అభ్యంతరంఏకంగా ఉన్నత న్యాయస్థానానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారని అభ్యంతరంవెంటనే రికార్డులు పరిశీలించిన హైకోర్టుపిన్నెల్లిపై అదనంగా మోపిన మూడు కేసులు మే 23న నమోదు చేసినట్టుగా వెల్లడిఆతర్వాత మే 24నే స్థానిక మెజిస్ట్రేట్‌కు తెలియపరిచినట్టుగా రికార్డుల్లో వెల్లడి వాస్తవాలు ఇలా ఉండగా పోలీసులు పీపీ ద్వారా, స్పెషల్ కౌన్సిల్ అశ్వనీకుమార్ ద్వారా కోర్టుకు ఎందుకు తప్పడు సమాచారం ఇచ్చారో అర్థంకాలేదన్న పిన్నెల్లి తరఫు న్యాయవాదిపీపీకి తప్పుడు సమాచారం ఇవ్వడమే కాకుండా, దాన్ని సమర్థించేందుకు స్పెషల్ కౌన్సిల్‌ను కూడా పెట్టారన్న పిన్నెల్లి తరఫు న్యాయవాదిహైకోర్టు చరిత్రలో ఇదొక తప్పుడు సంప్రదాయమని తెలిపిన పిన్నెల్లి తరఫు న్యాయవాదిరికార్డులను పరిశీలించిన తర్వాత కోర్టులో తీవ్ర విస్మయంకోర్టులో ప్రొసీడింగ్స్ తర్వాత ఏపీలో పోలీసుల తీరుపై తీవ్ర చర్చఈ వ్యవహారం వెనుక ఎవరున్నారన్నదానిపై చర్చఎవరి వెన్నుదన్నుతో డీజీపీ, ఎస్సీలు ఇలా బరితెగింపునకు దిగుతున్నారన్నదానిపై చర్చచివరకు తీర్పును నేటికి వాయిదా వేసిన హైకోర్టుమరోవైపు ప్రభుత్వం నియమించిన పీపీ కాకుండా పోలీసుల తరఫున న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ హాజరుపైనా తీవ్ర చర్చప్రభుత్వ జీవో లేకుండా, నిబంధనలు పాటించకుండా అశ్వనీకుమార్ హాజరుపై సర్వత్రా విస్మయంకనీసం తమ తరఫున వాదనలు వినిపిస్తున్న పీపీకి కూడా సమాచారం ఇవ్వని డీజీపీ, పోలీసులుతొలిరోజు హాజరైన అశ్వనీకుమార్ నిన్న హాజరు కాని వైనంఆసక్తికరంగా టీడీపీ లీగల్ సెల్ నుంచి న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు హాజరుబాధితుల తరఫున ఇంప్లీడ్ పిటిషన్ వేసి వాదనలు వినిపించిన పోసాని వెంకటేశ్వర్లు.ఈ వ్యవహారాలపై న్యాయవర్గాల్లో తీవ్ర చర్చ. 7:15 AM, May 28th, 2024హైకోర్టు సాక్షిగా దొరికిపోయిన డీజీపీ, పచ్చ పోలీసులు పిన్నెల్లిపై కేసుల విషయంలో రికార్డులు తారుమారు ఆయన్ను ఎప్పుడు నిందితుడిగా చేర్చారని ప్రశ్నించిన హైకోర్టుముందస్తు బెయిల్ ఇచ్చాకే నిందితుడిగా చేర్చినట్లు అంగీకారంఈమేరకు స్థానిక కోర్టులో మెమో దాఖలు చేసిన పోలీసులుసంబంధిత డాక్యుమెంట్లను కోర్టు ముందుంచిన పిన్నెల్లి న్యాయవాదులుపిన్నెల్లి మధ్యంతర ముందస్తు బెయిల్‌పై ముగిసిన వాదనలు.. నేడు హైకోర్టు నిర్ణయంకౌంటింగ్‌లో పాల్గొనే హక్కు ప్రతీ అభ్యర్ధికి ఉందన్న సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి 6:45 AM, May 28th, 2024రాష్ట్రానికి 20 కంపెనీల బలగాలుకౌంటింగ్ రోజు అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత చర్యలు పోలింగ్ అనంతర ఘర్షణలను దృష్టిలో పెట్టుకుని కట్టుదిట్టంగా ఏర్పాట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా 6:30 AM, May 28th, 2024పెత్తందారులకు, పేదలకు యుద్ధం: సీఎం జగన్‌మేము ధనవంతులకు, పేదలకు మధ్య యుద్ధం అని ఎప్పుడూ అనలేదు. పెత్తందారులకు, పేదలకు యుద్ధం అని చెప్పాము. చెప్పిన పెత్తందారులు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకించారు. 31 లక్షల మంది పేదలకు ఇళ్ళ స్థలాలు ఇస్తే కోర్టుకు వెళ్ళి అడ్డుకున్నారు.మేము ధనవంతులకు, పేదలకు మధ్య యుద్ధం అని ఎప్పుడూ అనలేదు. పెత్తందారులకు, పేదలకు యుద్ధం అని చెప్పాము. మేము చెప్పిన పెత్తందారులు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకించారు. 31 లక్షల మంది పేదలకు ఇళ్ళ స్థలాలు ఇస్తే కోర్టుకు వెళ్ళి అడ్డుకున్నారు.-సీఎం @ysjagan… pic.twitter.com/BvDgxcKYWO— YSR Congress Party (@YSRCParty) May 27, 2024 -
టీడీపీ చెప్పినట్లు ఆడినందుకే
సాక్షి, అమరావతి: ప్రజాస్వామ్య ప్రక్రియను పరిరక్షించాల్సిన పోలీసు యంత్రాంగం, ఉన్నతాధికారులు బాధ్యత మరచి హింస చెలరేగేందుకు తావిచ్చినందుకు వేటు పడింది! నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన వారు రాజకీయ ఒత్తిళ్లతో చెప్పినట్లలా ఆడినందుకే ఈ పరిస్థితి వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కుట్రలకు తలొగ్గి పచ్చ ముఠాల విధ్వంసకాండకు కొమ్ముకాసిన పోలీసు అధికారులపై ఎన్నికల కమిషన్ (ఈసీ) కన్నెర్ర చేసింది. రాజకీయ ఒత్తిళ్లతో పోలీసు అధికారులను హఠాత్తుగా బదిలీ చేసిన జిల్లాల్లోనే హింసాకాండ చెలరేగిన విషయాన్ని వైఎస్సార్సీపీ, రాష్ట్ర ప్రభుత్వం సవివరంగా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. పురందేశ్వరి సమర్పించిన జాబితాలోని అధికారులను నియమించడంతో ఎన్నికల వేళ హింస చెలరేగేందుకు ఆస్కారం ఏర్పడింది. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో ఈసీ నియమించిన పోలీసు అధికారులు తోలు»ొమ్మల్లా వ్యవహరించడంతో టీడీపీ రౌడీ మూకలు బరి తెగించి భయానక వాతావరణాన్ని సృష్టించాయి. లావు సన్నిహితుడు.. బిందు మాధవ్ ప్రజాదరణ కోల్పోవడంతో పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో అక్రమాలు, హింసకు చంద్రబాబు తెర తీశారు. ఆ జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పట్టున్న సమర్థులైన పోలీసు అధికారులు ఉండటం చంద్రబాబుకు ఇబ్బందికరంగా మారింది. దీంతో వారిపై నిరాధార ఆరోపణలతో ఈసీకి ఫిర్యాదులు చేశారు. దగ్గుబాటి పురందేశ్వరి ద్వారా ఈ కుట్రలను అమలు చేశారు. పల్నాడు నుంచి అనంతపురం జిల్లా వరకు పోలీసు అధికారులను బదిలీ చేయాలని పేర్కొంటూ ఆ స్థానాల్లో ఎవరిని నియమించాలో కూడా సూచిస్తూ ఏకంగా జాబితాను సమర్పించారు. ఈ ఒత్తిడికి తలొగ్గిన ఈసీ హడావుడిగా డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, నిఘా విభాగం ఇన్చార్జ్ పీఎస్ఆర్ ఆంజనేయులతోపాటు గుంటూరు డీఐజీ పాలరాజు, అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిని బదిలీ చేసింది. సమస్యాత్మక నియోజకవర్గాలు అత్యధికంగా ఉన్న పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అనంతపురం ఎస్పీలు, విజయవాడ సీపీని బదిలీ చేసింది. క్షేత్రస్థాయిలో కీలకంగా వ్యవహరించే డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు కలిపి 14 మందిని బదిలీ చేయడం గమనార్హం. చంద్రబాబు ఆదేశాలతో పురందేశ్వరి సమర్పించిన జాబితాలోని పోలీసు అధికారులకు ఆ స్థానాల్లో పోస్టింగ్‌లు ఇచ్చింది. సమస్యాత్మక పల్నాడు జిల్లా ఎస్పీగా గరికిపాటి బిందు మాధవ్‌ను నియమించారు. ఆయన టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. అదే రీతిలో పురందేశ్వరి సూచించిన వారినే తిరుపతి, అనంతపురం జిల్లాల్లో నియమించారు. పూర్తిగా విఫలమైన ఈసీ నియమించిన అధికారులు క్షేత్రస్థాయి పరిస్థితులపై అవగాహన, పట్టులేని అధికారులను నియమించడంతో పోలింగ్ సందర్భంగా, అనంతరం టీడీపీ రౌడీ మూకలు చెలరేగిపోయాయి. యథేచ్ఛగా విధ్వంసకాండ సృష్టించాయి. నరసరావుపేట, గురజాల, మాచర్ల, చంద్రగిరి, తాడిపత్రి నియోజకవర్గాల్లో స్వైర విహారం చేశాయి. పెట్రోల్ బాంబులతో భయానక వాతావరణాన్ని సృష్టించాయి. ఈ జిల్లాల్లో ఈసీ నియమించిన పోలీసు అధికారులు శాంతిభద్రతల పరిరక్షణలో పూర్తిగా విఫలమయ్యారు. టీడీపీ మూకలు విధ్వంసం సృష్టిస్తుంటే పల్నాడు ఎస్పీ గరికిపాటి బిందు మాధవ్‌తోపాటు ఆయన ఆధ్వర్యంలోని డీఎస్పీలు, సీఐలు చేష్టలుడిగి చూస్తుండిపోయారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి, వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్‌లపై టీడీపీ రౌడీ మూకలు దాడులకు తెగబడి బాంబులు విసిరినా సరే పోలీసులు పత్తా లేరు. తమపై దాడులు జరుగుతున్నాయని పల్నాడు ఎస్పీకి మొర పెట్టుకున్నా కనీస స్పందన లేదు. పోలింగ్ సక్రమంగా నిర్వహించడంలో పల్నాడు కలెక్టర్ లోతేటి శివ శంకర్ పూర్తిగా విఫలమయ్యారు. అనంతపురం జిల్లాల్లో శాంతిభద్రతల పరిస్థితి ఘోరంగా దిగజారినా జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ చోద్యం చూస్తూ ఉండిపోయారు. కదిరి టీడీపీ అభ్యర్థి కందికుంట ప్రసాద్ వాహనంలో రూ.2 కోట్లు లభ్యమైతే కేసు నమోదు చేయకుండా తాత్సారం చేశారు. పోలింగ్ సందర్భంగా తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు, టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్‌రెడ్డి, అల్లుడు దీపక్‌రెడ్డి పోలింగ్ కేంద్రాల్లో చొరబడి అక్రమాలకు తెగించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసంపై టీడీపీ గూండాలు రాళ్ల వర్షం కురిపించారు. ఎస్పీ అమిత్ బర్దర్ వీటిని కట్టడి చేయలేకపోయారు. ఏకంగా పోలీసులే కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసంలోకి దూరి విధ్వంసం సృష్టించడం నివ్వెరపరిచింది. చంద్రగిరి వైఎస్సార్సీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిపై టీడీపీ గుండాలు దాడి చేశారు. ఆయన వాహన శ్రేణిలోని వాహనానికి నిప్పుపెట్టారు. తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పాటిల్ అల్లరి మూకలను కట్టడి చేయడంలో విఫలమయ్యారు. ఏఎస్పీ వల్లే తాడిపత్రిలో అల్లర్లుటీడీపీకి వెన్నుదన్నుగా నిలిచిన వైనం తాడిపత్రి రూరల్: అడిషనల్ ఎస్పీ రామకృష్ణ తీరే తాడిపత్రిలో విధ్వంసానికి కారణమైందని పట్టణంలో చర్చ జరుగుతోంది. టీడీపీకి దన్నుగా నిలిచి ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై కక్ష సాధింపు ధోరణితో ప్రవర్తించారని స్పష్టమవుతోంది. అనంతపురంలో ‘సెబ్’ అడిషనల్ ఎస్పీగా ఉన్న రామకృష్ణను పథకం ప్రకారమే అధికారులు తాడిపత్రి ఎన్నికల ఇన్చార్జ్గా నియమించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీకి చెందిన జేసీ ప్రభాకర్‌రెడ్డికి పోలింగ్ కేంద్రాలను పరిశీలించే అనుమతి లేదని, ఆయన రాకతో అల్లర్లు చెలరేగి శాంతిభద్రతల సమస్య ఏర్పడుతుందని ఎన్నికల అధికారులు చెప్పినా, ఏఎస్పీ పెడచెవిన పెట్టారు. పైగా జేసీ ప్రభాకర్‌రెడ్డి వెంట ఉంటూ వైఎస్సార్సీపీ నాయకులపై చిందులు తొక్కారు. పోలింగ్ రోజు ఓంశాంతి నగర్లో జేసీ ప్రభాకర్‌రెడ్డి సమక్షంలో ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై టీడీపీ వర్గీయులు రాళ్ల దాడికి దిగారు. ఆ సమయంలో జేసీ, అతని అనుచరులను అదుపులోకి తీసుకొని ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు. ఏఎస్పీ తమకు అండగా ఉన్నాడన్న ధైర్యంతోనే జేసీ వర్గీయులు అరాచకం సృష్టించారు. ఈ విషయమై ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఈసీ, డీజీపీలకు ఫిర్యాదు చేయగానే.. ఏఎస్పీ పోలీసు సిబ్బందితో కలిసి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటి తలుపులు పగులగొట్టి పర్నీచర్, కంప్యూటర్లు ధ్యంసం చేయించడం, దొరికిన వారిని దొరికినట్లు చితక బాదడం చర్చనీయాంశమైంది. -
ఒకప్పుడు పొసగేదే కాదు.. ఇప్పుడు మరీ ఇంత ఆత్మీయతా?
ఏపీలో వైఎస్సార్సీపీను ఓడించలేమన్న భావనకు వచ్చిన విపక్ష కూటమి ఇప్పుడు బ్లాక్ మెయిల్ రాజకీయానికి బరి తెగిస్తోంది. బీజేపీని అడ్డు పెట్టుకుని తెలుగుదేశం పార్టీ కేంద్రాన్ని, ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు తెలిసిపోతూనే ఉన్నాయి. పట్టుమని పది అసెంబ్లీ సీట్లకు పోటీచేయని బీజేపీ పక్షాన ఆ పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఎన్నికల సంఘానికి పోలీసు అధికారులపై ఒక పెద్ద ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో పనిచేస్తున్న 22 మంది పోలీసు అధికారులపై ఈ ఫిర్యాదు ఉంది. అది చదివితే ఒక విషయం బోధ పడుతుంది. ఇదంతా తెలుగుదేశం పార్టీ ఆడిస్తున్న నాటకం అని ఇట్టే అర్దం అయిపోతుంది. బీజేపీ తాను పోటీచేస్తున్న ప్రాంతాలలో పోలీసు అధికారులు ఎవరైనా తప్పు చేస్తున్నారని సమాచారం ఉంటే ఎన్నికల సంఘం దృష్టికి తీసుకు వెళ్లవచ్చు. అలాకాకుండా ఇంతమంది పోలీసు అధికారులపై ఆరోపణలు చేస్తున్నారంటే ఇదంతా టీడీపీ కుట్రగానే కనిపిస్తుంది. ఇందులో విడ్డూరం ఏమిటంటే 'తమకు ఫలానా అధికారులు కావాలని అడగడం'. బహుశా దేశంలోనే ఇలా ఏ రాజకీయ పార్టీ కోరి ఉండరు. తాను నేరుగా ఫిర్యాదు చేస్తే పోలీసు వ్యవస్థ అంతా తమకు వ్యతిరేకం అవుతుందని, దాని వల్ల నష్టం ఏమైనా జరుగుతుందేమోనని అనుమానించిన చంద్రబాబు ఈ పనికి పురందేశ్వరిని పురమాయించినట్లు కనిపిస్తుంది. దీనివల్ల ఏదైనా అప్రతిష్ట వచ్చినా పురందేశ్వరికే కాబట్టి వ్యూహాత్మకంగా ఈ ప్లాన్ అమలు చేశారని అనుకోవాలి. ఎన్టీ రామారావు కుమార్తెగా ఉన్న పురందేశ్వరి ఆయనకు ప్రతిష్ట తీసుకురాకపోతే మానే.. ఆయన పరువు తీస్తున్న కూతురుగా ప్రసిద్దికెక్కుతున్నారు. 'ఒకప్పుడు చంద్రబాబుకు, పురందేశ్వరికి మధ్య ఏ మాత్రం పొసగేది కాదు. తన భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావును పలుమార్లు చంద్రబాబు అవమానించారని ఆమె మదనపడేవారు. ఒక సందర్భంలో ఆమె ఇంటిలో జరిగిన ఒక కార్యక్రమానికి వచ్చిన చంద్రబాబును పలకరించడానికి కూడా ఆమె ఇష్టపడలేదంటే ఆశ్చర్యం కాదు'. అలాంటిది ఇప్పుడు సడన్‌గా ఇలా రెండు కుటుంబాల మధ్య ఇంత ఆత్మీయత ఎలా వచ్చిందా అని అంతా ఆశ్చర్యపోతున్నారు. పురందేశ్వరి తమకు జరిగిన అవమానాలు మర్చిపోయి తెలుగుదేశం ఎజెండా కోసం, చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారంటే, ఆమె ఎంపీ పదవి కోసం ఎంత తహతహలాడుతున్నారో అర్ధం అవుతుంది. 2014లో కూడా బీజేపీ, జనసేన,టీడీపీ కలిసి పోటీచేశాయి. కానీ అప్పటికి చంద్రబాబు, దగ్గుబాటి కుటుంబాల మధ్య రాజీ కుదరలేదు. చంద్రబాబు, వెంకయ్య నాయుడు కలిసి పురందేశ్వరిని తెలివిగా రాజంపేటలో పోటీచేయించారు. తద్వారా ఆమె అక్కడ ఓడిపోయేలా చేశారు. చాలాకాలం ఆ బాధ ఆమెలో ఉండేది. ఎప్పుడు రాజీపడ్డారో కానీ, చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్‌లో జైలులో ఉన్నప్పుడు లోకేష్‌ను పురందేశ్వరి వెంటబెట్టుకుని వెళ్లి హోం మంత్రి అమిత్‌షా తో కలిపారు. అలాగే ఎన్టీ రామారావు గోల్డ్ కాయిన్ విడుదల సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను పిలిచి, అక్కడ చంద్రబాబుతో మాట, మంతి కలిసేలా దగ్గుబాటి దంపతులు చేశారు. బీజేపీ అధిష్టానం పురందేశ్వరిని ఎందుకు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు చేశారో తెలియదు కానీ, ఆమె అప్పటి నుంచి ఆ పార్టీని పూర్తిగా తెలుగుదేశంకు అనుకూలంగా మార్చివేశారు. చివరికి బీజేపీ ఇచ్చిన లోక్ సభ టిక్కెట్లు ఆరింటిలో ఐదు ఇతర పార్టీల నుంచి వచ్చినవారికే దక్కడం విశేషం. ఒరిజినల్ బీజేపీ నేతలంతా దిక్కుతోచని స్థితిలో తమ ఖర్మ అనుకుంటూ కాలం గడుపుతున్నారు. ఈ విషయాలు పక్కనబెడితే పురందేశ్వరి రాసిన ఫిర్యాదును పరిశీలిస్తే, అందులో టీడీపీ అరాచకాలను అడ్డుకున్నవారి పేర్లు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన స్కామ్‌లను బయటకు తెచ్చినవారి పేర్లే ఎక్కువగా కనిపించాయి. ప్రత్యేకించి ఒక సామాజికవర్గంపై వ్యతిరేకతతో కూడా ఈ ఫిర్యాదు చేశారా అన్న అనుమానం వస్తుంది. టీడీపీ మీడియాలో వచ్చిన కథనంలో ఏమి రాశారో చూడండి.. 'డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి నుంచి ఎస్పీ ఆనందరెడ్డి వరకు అని పేర్కొనడంలోనే కుత్సిత స్వభావం కనిపిస్తుంది.వీరంతా వైసిపితో సంబంధాలు ఉన్నవారట. విపక్షాలను వేధిస్తున్నారట. వీరిని తప్పిస్తేకానీ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగవని ఈమె అంటున్నారు'. నిజానికి ఈ 22 మంది ఎవరో పురందేశ్వరికి తెలియకపోవచ్చు. వీరి పేర్లు చెప్పాలని ఆమెను అడిగితే చెప్పలేకపోవచ్చు కూడా. ఎందుకంటే కేవలం టీడీపీ రాసిన ఒక పత్రంపై ఆమె సంతకాలు చేసి ఎన్నికల సంఘానికి పంపి ఉండవచ్చనిపిస్తుంది. బహుశా టీడీపీ హయాంలో ఆనాటి ఇంటిలెజెన్స్ ఛీప్ ఏబీ వెంకటేశ్వరరావు మాదిరే, అలాగే కొందరు ఎస్పీల మాదిరే ఇప్పుడు కూడా ఐపిఎస్ అధికారులు ఎవరైనా చేస్తారేమోనన్న అనుమానంతో టీడీపీ ఈ లేఖ రాయించి ఉంటుంది. వెంకటేశ్వరరావు టీడీపీ పార్టీ కార్యకలాపాలు కూడా పర్యవేక్షించేవారు. ఈ మాట అప్పట్లో టీడీపీ నేతలే చెప్పిన వీడియోలు కూడా వెలుగులోకి వచ్చాయి. బహుశా టీడీపీ కూటమికి అవకాశం ఇస్తే అలాంటివారిని నియమించుకోవాలని భావిస్తున్నారేమో తెలియదు. ఈనాడు రామోజీరావు మరో అడుగు ముందుకేసి కొన్ని జిల్లాలలో కొత్తగా వచ్చిన ఐపీఎస్ అధికారులకు కూడా పక్షపాత బుద్ధి ఆరోపిస్తూ పెద్ద స్టోరీ ఇచ్చేసింది. జర్నలిజం విలువలను దిగజార్చి టీడీపీకి నీచమైన రీతిలో మద్దతు ఇస్తున్న రామోజీనుంచి ఇంతకన్నా విలువలను ఆశించడం అత్యాశే అవుతుంది. పురందేశ్వరి రాసిన లేఖలో డీజీపీపై ఆరోపణలు చేస్తూ, సీక్రెట్ ఫండ్‌ను సొంతానికి వాడుకున్నారని, సంబంధిత ఫైళ్లను ద్వంసం చేశారని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు ఏవీ చూపకుండా ఇలా రాయడం ఎంత బాధ్యతారాహిత్యం! వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉన్న ఇంటెలిజెన్స్ ఛీఫ్ సీతారామాంజనేయులు ఎన్నికలను మేనేజ్ చేసేందుకు, తప్పుడు సర్వేలు చేయించేందుకు బాగా డబ్బులు తీసుకున్నారని పురందేశ్వరి ఆరోపణ. 'విపక్ష నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారట. ప్రధాని సభకు జనం రాకుండా చేశారట'. వీటిలో ఒక్కదానికైనా అర్ధం ఉందా? పిచ్చి ఆరోపణలు చేసి జనాన్ని మోసం చేయడం తప్ప. చిత్తూరు ఎస్పీ జాషువా ఇటీవలే చిత్తూరు జిల్లాకు వెళ్లారు. ఆయనపై కూడా ఆరోపణ చేస్తూ కుప్పంలో చంద్రబాబును ఓడించే బాధ్యత పెట్టుకున్నారని పురందేశ్వరి అంటున్నారు.. 'కుప్పంలో వైఎస్సార్సీపీ నేతలు ఏవో అరాచకాలు చేశారట. వాటిని చూసిచూడనట్లు వ్యవహరించారట'. ఈ ఫిర్యాదు చూస్తే అసలు భయం కుప్పంలో చంద్రబాబు ఓడిపోతారన్న అనుమానం వస్తుంది. 'పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి కూడా ప్రధాని సభకు జనం రాకుండా చెక్ పోస్టులు పెట్టి అడ్డుకున్నారట'. ఏమైనా బుద్ది జ్ఞానం ఉన్నవారు ఇలాంటి పిచ్చి ఆరోపణలు చేస్తారా? ప్రధాని సభకు వెళ్లేవారిపై జాగ్రత్తగా నిఘా పెట్టకపోతే ఏమైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు. చెక్ పోస్టులు పెడితే మోడీ సభకు జనం రాకుండా ఉంటారా? ఇలాంటి అర్ధం పర్ధం లేని ఆరోపణలు చేస్తే, వాటిని నమ్మి ఎన్నికల కమిషన్ ఆయనను పక్కనబెట్టిందా? అందుకే అయితే కచ్చితంగా ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అవుతుంది. ఎన్నికల సంఘం బీజేపీ ఒత్తిడికి లొంగుతోందన్న అభిప్రాయం కలుగుతుంది. సీఐడీ అదనపు డీజీ సంజయ్‌పై కూడా ఆరోపణ చేశారు. 'ఆయన మీడియా సంస్థలను బెదిరిస్తున్నారట'. మార్గదర్శి అక్రమాలను బయటపెడితే అది మీడియాను బెదిరించడమా! చంద్రబాబును స్కిల్ స్కామ్‌లో అరెస్టు చేస్తే అది ఆయన చేసిన తప్పా! డిల్లీలో ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ అవినీతికి పాల్పడ్డారో, లేదో కానీ, అంతా కలిపి వంద కోట్ల స్కామ్‌లో ఈడి అరెస్టు చేసింది. ఆప్ మరో నేత మనీష్ సిసోడియా ఏడాదిగా జైలులో ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కూడా అరెస్టు చేశారు. అదంతా పద్ధతిగా జరిగినట్లు చెప్పే బీజేపీ ఏపీలో చంద్రబాబుపై వచ్చిన వందల, వేల కోట్ల రూపాయల విలువైన స్కామ్‌లను సమర్ధించడం ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇలా తమ అడ్డగోలు పనులకు సహకరించని అధికారులను, టీడీపీ ప్రభుత్వ స్కామ్‌లను బయటపెట్టిన అధికారులను బ్లాక్ మెయిల్ చేయడానికే పురందేశ్వరి ద్వారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వంటివారు ఇలాంటి ఫిర్యాదు చేసినట్లు అనిపిస్తుంది. వీటన్నిటిని పరిశీలించారో, లేక బీజేపీ ఒత్తిడి పనిచేసిందో కానీ వీరిలో కొందరిని ఎన్నికల సంఘం బదిలీ చేసి వారిని సంతృప్తి పరచే యత్నం చేసింది. అయినా అది చాలలేదని, ఇప్పుడు తెలుగుదేశం మీడియాలో ఆమె ఫిర్యాదు పేరుతో అందులోని అంశాలు అంటూ భారీ కథనం ఇచ్చారు. ఇదంతా కచ్చితంగా అధికారులను భయపెట్టి తమకు అనుకూలంగా లొంగదీసుకునే యత్నమే. ఇక్కడ ఒక మాట చెప్పాలి. '2019లో చంద్రబాబు నియమించుకున్న పోలీసు అధికారులే జిల్లాలలోను, రాష్ట్ర స్థాయిలోను వివిధ బాధ్యతలలో ఉన్నారు కదా! వీరిలో కొందరిని ఎన్నికల కమిషన్ బదిలీ చేస్తే టీడీపీ ప్రభుత్వం హైకోర్టుకు కూడా వెళ్లింది కదా! అప్పుడేమో అధికారులంతా సుద్దపూసలని, ఇప్పుడేమో అవినీతి పరులని బురద చల్లడానికి టీడీపీ మీడియా యత్నించింది'. ఎవరైనా అధికారి తప్పు చేస్తే చర్య తీసుకోవచ్చు. కానీ కేవలం ఒత్తిడులకు లొంగి ఐపీఎస్ అధికారులను పక్కనబెడుతూ ఎన్నికల సంఘం ఆదేశాలు ఇస్తే అది వ్యవస్థకే చేటు తెస్తుంది. బ్లాక్ మెయిల్ చేసే రాజకీయనాయకులకు, మీడియాకు అవకాశం ఇచ్చినట్లవుతుంది. ఈ ఎన్నికల రణక్షేత్రంలో టీడీపీ కూటమి ఇంకెన్ని కుట్రలకు పాల్పడుతుందో చూడాలి. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
చెల్లెలి కాపురం చూసి ఓర్వలేకపోతున్న పురందేశ్వరి
♦ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మండిపాటు ♦ పురందేశ్వరి, కావూరి, కన్నా.. సోనియాకు ఏజెంట్లని విమర్శ విజయవాడ: సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కాపురాన్ని చూసి కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి ఓర్వలేకపోతున్నారని ఎమ్మెల్పీ బుద్దా వెంకన్న విమర్శించారు. విజయవాడలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చేగొండి హరిరామజోగయ్య రచించిన పుస్తకావిష్కరణకు పురందేశ్వరి హాజరుకావటం వెనుక కుట్ర జరిగిందన్నారు. అమరావతి రూపకల్పనలో చంద్రబాబుకు వచ్చిన పేరుప్రఖ్యాతులు చూసి ఓర్వలేకనే ఆమె ఈ పుస్తకావిష్కరణకు హాజరయ్యారని విమర్శించారు. ఎన్టీఆర్ కుటుంబంలో పుట్టిన ఆమె టీడీపీకి అపఖ్యాతి కలిగించేలా వ్యవహరించటం శోచనీయమన్నారు. వంగవీటి మోహనరంగా హత్య జరిగి 26 ఏళ్లు పైబడుతుండగా జోగయ్య ఇప్పుడు పుస్తకం విడుదల చేసి అందులో చంద్రబాబుకు గూర్చి రాయటాన్ని ఖండించారు. రంగా హత్య వెనుక చంద్రబాబు ఉన్నట్లు చెప్పటం హాస్యాస్పదమన్నారు. రంగా కుటుంబసభ్యులు గతంలో టీడీపీలో చేరి పనిచేశారని గుర్తుచేశారు. బీజేపీలో ఉన్న పురందేశ్వరి, కావూరి సాంబశివరావు, కన్నా లక్ష్మీనారాయణలు సోనియాగాంధీ నియమించిన రహస్య ఏజెంట్లని ఆరోపించారు. -
పథకాలతో పుంజుకుంటాం
ఎమ్మిగనూరు: కొన్ని రాజకీయ పార్టీల తరహాలో అధికారంలో ఉన్నామని ‘ఆపరేషన్ ఆకర్ష్’, ప్యాకేజీలతో కాకుండా జనాకర్షన పథకాలతో తమ పార్టీ పుంజుకుంటుందని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఆదివారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో బీజేపీ నియోజకవర్గ విసృతస్థాయి సమావేశం పట్టణ అధ్యక్షుడు లలిత్‌కుమార్ అధ్యక్షతన స్థానిక సోమప్ప మెమోరియల్ హాల్లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ 2019లో రాష్ట్రంలో అధికారం చేపట్టే దిశగా పార్టీని బలోపేతం చేస్తామన్నారు. ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో బీజేపీ పట్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందన్నారు. ఐదేళ్లలో 11కోట్ల వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించి మహాత్మాగాంధీ 150వ జయంతి నాటికి ఆరోగ్యకరమైన దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళికతో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. రాయలసీమ సమగ్రాభివృద్ధికి పాటుపడతామన్నారు. హంద్రీనీవా, గురురాఘవేంద్ర, పులికనుమ ప్రాజెక్టులు పూర్తి కావాలంటే కేంద్ర ప్రభుత్వ సహాయం తప్పనిసరి అని ఆ దిశగా బీజేపీ కృషి చేస్తుందన్నారు. జిల్లాలో చేనేత కార్మికులఇక్కట్లను కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేకూరుస్తానన్నారు. సీమ సమస్యలను పీఎం దృష్టికి తీసుకెళ్లండి ఎమ్మిగనూరు టౌన్: రాయలసీమ సమస్యలను ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, కేంద్ర ప్రభుత్వంలోని పెద్దల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేయాలని దగ్గుబాటి పురందర్వేరిని పాణ్యం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకులు కాటసాని రాంభూపాల్‌రెడ్డి కోరారు. సీమకు సాగునీరు అందాలంటే పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నారు. సభ్యత్వంలో నెంబర్ వన్ పార్టీగా బీజేపీ.. మార్చి నాటికి సభ్యత్వ నమోదులో ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా బీజేపీ అవతరించబోతోందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రధాని అన్ని చర్యలు చేపట్టారని, ఇది పూర్తి అయితే 40టీఎంసీల నీరు రాయలసీమకు కేటాయిస్తారని వెల్లడించారు. బీజేపీలో పలువురి చేరిక ఎమ్మిగనూరు టౌన్: ఎమ్మిగనూరుకు చెందిన ముఖ్యమైన నాయకులు ఆదివారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ పట్టణ మాజీ అధ్యక్షుడు వై.దేవేంద్రగౌడ్, కెఆర్.గౌడారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు, ప్రముఖ వ్యాపారవేత్త కేఆర్.మురహరిరెడ్డి, రిటైర్డ్ ఇరిగేషన్ ఇంజినీర్, ఉప్పర సంఘం అధ్యక్షుడు ఉప్పర రాజన్నతో పాటు వారి అనుచరులు, రిటైర్డ్ ఎస్ఐ సోమన్న, కర్నూలుకు చెందిన న్యాయవాది హేమలత, బుడగజంగం నాయకుడు రామరాజు, యుటీ.శంకర్నాథ్, యుకె.సుశీలమ్మ, శ్రీరాములతో పాటు వందలాది మంది కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందరేశ్వరి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి, కపిలేశ్వరయ్య, జిల్లా అధ్యక్షుడు నాగరాజు యాదవ్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. వారికి బీజేపీ కండువాలను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. -
రామేశ్వరం పోయినా..
పురందేశ్వరిని వెన్నాడుతున్న ‘బాబు ఫ్యాక్టర్’ సవ్యసాచి జెమాలజిస్ట్ అయిన దగ్గుబాటి పురందేశ్వరి, ఇప్పుడు తన వద్దనున్న రత్నాలు, రాళ్లు వగైరా వగైరాలను క్షుణ్ణంగా పరిశీలించి అవి ఏ మేరకు తన అదృష్ట గతిని మార్చగలవో అంచనా వేసుకోవాలి! ఎందుకంటే, ఆమె రాయలసీమలోని రాజంపేట నుంచి లోక్‌సభకు వెళ్లాలనుకుంటున్నారు. అయితే, అక్కడ్నుంచి పోటీకి ఆమె బలమైన అభ్యర్థి అని బీజేపీ నాయకత్వం నిర్ణయిస్తే, బలహీనమైన అభ్యర్థి అని పొత్తు భాగస్వామ్య పక్షమైన టీడీపీ అధినేత చంద్రబాబు అంటున్నారు. నిజంగా ఆమె బలమైన అభ్యర్థా? బలహీనమైన అభ్యర్థా? ఈ మీమాంసకు ముందు, అసలామె ఎందుకు అక్కడ్నించి పోటీ చేయాల్సి వచ్చింది అన్నది ఆలోచించాలి. ఆ నియోజకవర్గాన్ని ఆమె ఎంపిక చేసుకొన్నారా? లేక విధి లేక అక్కడ్నించి పోటీ చేయాల్సి వస్తోందా? పెనం మీది నుంచి బయటపడాలని కోరుకుంటారు తప్ప, ఆ ప్రయత్నంలో పొయ్యిలో పడాలని ఎవరూ అనుకోరు. పురందేశ్వరయినా అంతే! కాంగ్రెస్‌లో ఉంటే గెలుపు కష్టమే కాదు, దాదాపు అసాధ్యమని భావించిన తర్వాతే ఆమె పార్టీ మారి బీజేపీలో చేరారు. ఆ పార్టీ తరపున లోక్‌సభకు వెళ్లాలనుకున్నారు. మోడీ రూపంలో అదృష్టం కలిసొస్తుందనుకుని ఉంటారు తప్ప బాబు రూపంలో దురదృష్టం తిరిగి వెన్నాడుతుందని ఊహించి ఉండరు. సన్నటి పొరతో వేరు చేయబడే అదృష్ట-దురదృష్టాలు పక్కపక్కనే ఉంటాయని, పాపం ఆమె భర్త డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా అనుకుని ఉండరు. కాంగ్రెస్ నుంచి పార్టీ మారడానికి పురందేశ్వరి కన్నా ఆమె భర్తే ఎక్కువ కారణమని బయట జరుగుతున్న ప్రచారమే నిజమైతే, వెంకటేశ్వరరావు తన తోడల్లుడు చంద్రబాబు చేతిలో మరోమారు భంగపడ్డట్టే లెక్క! ఎన్టీరామారావు తనయగా ఒక మంచి ‘రాజకీయ వనరు’ అవుతారని పార్టీలోకి ఆహ్వానించిన నుంచి దాదాపు పదేళ్లు వీసమెత్తు గౌరవం తగ్గకుండా చూసుకున్న కాంగ్రెస్‌ని కాదని బయటకొచ్చినందుకు ‘ఇదా ఫలం!’ అనిపించి, ఇప్పుడు దంపతులిద్దరికీ బాధ కలగవచ్చు! రాష్ర్ట విభజన కారణం చూపి కాంగ్రెస్ నుంచి బయట పడేందుకు దారి దొరికినప్పుడు, వెంకయ్యనాయుడు వంటి కులపెద్దల అండతో బీజేపీలో చోటు లభించినప్పుడు... ‘హమ్మయ్య!’అనుకుని ఉంటారు. అంతేగానీ, ఇంత తొందర్లోనే బీజేపీ-టీడీపీ మధ్య బంధం ఏర్పడి, వీడని పాత కుటుంబ వైరమేదో వెన్నాడి, తాడు కూడా పామై కాటేసినట్టు కాలం ఇలా వక్రిస్తుందని ఎలా ఊహించగలరు? తానాశించిన విశాఖపట్నంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు స్వయంగా బరిలోకి దిగుతానంటే, తన తండ్రి స్వస్థలమైన విజయవాడ కోరుకున్నా, పొత్తు భాగస్వామి టీడీపీ ససేమిరా అంటే... ఒక దశలో పురందేశ్వరికి నియోజకవర్గమే లేని స్థితి వచ్చింది. ఏమంటే, ముందు ఇవ్వజూపిన అరకు (ఎస్టీ), తర్వాత ఖరారు చేసిన తిరుపతి (ఎస్సీ)ల్లో ఆమె ఎలాగూ పోటీ చేయలేరు. నరసాపురంలో అప్పటికే, ‘సంఘ్’కు, ‘సరుకు’కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరి మధ్య నువ్వా నేనా అన్న హోరాహోరి పోరు సాగుతూనే ఉంది, ఇంక ఆమెకెక్కడ చోటు? అసలు పోటీకి సీ(చో) టే లేని ఈ విపత్కర పరిస్థితుల్లో రాజంపేటకు ఆమె రాజీపడితే కూడా, అదీ దక్కకుండా కుట్రలు జరిగినపుడు పాపం వారు ఇంకెంత బాధపడ్డారో! లోలోపల కుటుంబపరమైన వైరం కారణం కాకపోతే, అక్కడ ఆమె బలహీనమైన అభ్యర్థి అని చెప్పే చంద్రబాబు ఇంకో ‘బలమైన’ అభ్యర్థి ఎవరో ప్రతిపాదించలేని దుస్థితి. ఏదయితేనేం, చివరకు ఇతరేతర కారణాలు బలంగా పనిచేయడం వల్ల బాబు మాట ఈ ఒక్క విషయంలో చెల్లుబాటు కాక, ఆమె అక్కడి అభ్యర్థిగా మిగిలారు. శనివారం నామినేషన్ కూడా దాఖలు చేశారు. కానీ, చంద్రబాబు ఇంతటితో ఊరుకుంటారా? ఆయన మనస్పూర్తిగా పురందేశ్వరి విజయాన్ని కోరుకుంటారా? ఆ మేరకు కృషి చేస్తారా? తమ అధినేత మనసెరిగీ, తెలుగుదేశం శ్రేణులు బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం అహరహం కష్టపడతారా? ఇవన్నీ జనబాహుళ్యంలో జవాబు దొరకని సందేహాలే! డాక్టర్‌కు తొలిసారి కాదు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఇది తొలిసారి ఎదురైన పరాభవం కాదు. దాదాపు ఒకటిన్నర దశాబ్దాల కింద ఎదురైన దాదాపు ఇటువంటిదే ఓ చేదు అనుభవం ఇప్పుడు కూడా ఆయన మనసును తొలుస్తూ ఉండి ఉంటుంది. 1995లో మామ ఎన్టీరామారావును చంద్రబాబు కోరస్ అన్యాయంగా పదవీచ్యుతున్ని చేసినపుడు, ఆ కోరస్‌కు తెలిసో తెలియకో డాక్టర్ దగ్గుబాటి వంతపాడారు. తర్వాత తప్పు తెలుసుకొని, చెంపలేసుకొని బాబుకు దూరమయ్యారు. దూరదృష్టి గల చంద్రబాబు మాత్రం, అలా జరగడం తన మంచికే అనుకున్నారు. అటుపై రాజకీయ పరిణామాల్లో దగ్గుబాటి బీజేపీలో చేరారు. 1999 ఎన్నికల ముందు ఇటువంటి రాజకీయ పునరేకీకరణ జరిగి బీజేపీ-టీడీపీ పొత్తు పెట్టుకున్నాయి. అప్పటికి మాటామంతి లేకపోయినా, ఎవరూ నియోగించకపోయినా... బాబుతో మంతనాలు జరుపుతానని పిలవని పేరంటంగా వెళ్లి అవమానానికి గురయ్యారు. గది ముందు ఎంతసేపు నిరీక్షించినా, కలుస్తానని అడిగినా బాబు అనుమతించకపోవడంతో డాక్టర్ దగ్గుబాటి తోడల్లుడ్ని కలువకుండానే, ఒఠ్ఠి చేతులతో వెనుదిరగాల్సి వచ్చింది. దటీజ్ బాబు! హితులైనా, సన్నిహితులైనా కడకు బంధువులైనా... బాబు ఉపయోగించుకొని వదిలిచ్చుకునే రకమే! ఇది దగ్గుబాటి దంపతులకు మాత్రమే పరిమితమైంది కాదు. అది బాలకృష్ణ, హరికృష్ణ, తర్వాతి తరానికి చెందిన జూనియర్ ఎన్టీఆర్‌కైనా వర్తిస్తుంది. కాకపోతే, పురందేశ్వరిలాగా కాసింత దూరాన్ని, అభిమానాన్ని కనబర్చిన రోజు... వాళ్లదీ అదే పరిస్థితి! -
లగడపాటి దారి ఎడారేనా
= ఏకాకిగా మారుతున్న వైనం = విజయవాడలో పురందేశ్వరి చిచ్చు సాక్షి, విజయవాడ : విజయవాడ ఎంపీ రాజగోపాల్ ఏకాకిగా మారుతున్నారా? జరుగుతున్న పరిణామాలు చూస్తే అది నిజమనే అనిపిస్తోంది. సమైక్యవాదానికి నాయకుడిగా చెప్పుకునే రాజగోపాల్ నియోజకవర్గంలోకి వచ్చి కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి విభజన జరిగితే సీమాంధ్రకు ఏం సాధించుకోవాలనే అంశంపై నగరానికి చెందిన ప్రముఖులతో సమావేశం అయినా ఎవరూ స్పందించలేదు. పురందేశ్వరి తీరుపై సమైక్యవాదులు విరుచుకుపడ్డారు. జిల్లాలో ఒకటిరెండుచోట్ల పురందేశ్వరి దిష్టిబొమ్మలు దహనం చేశారు. తెలుగుదేశం నేతలుకూడా పురందేశ్వరి విభజన తర్వాత రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనే ప్రయత్నం చేస్తోందని విరుచుకుపడ్డారు. అయితే ఎంపీ వర్గం నుంచి ఒక్కరు కూడా స్పందించిన పాపాన పోలేదు. గురువారం నగరంలో చోటుచేసుకున్న పరిణామాలను ఎంపీకి వివరించేందుకు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అడపా నాగేంద్రం, ఎంపీ వర్గంలోని మరికొందరితో కలిసి ఢిల్లీకి వెళ్లారు. పురందేశ్వరి సమావేశం, రాజగోపాల్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు చేసిన ఆరోపణలపై స్పందించి సమావేశం పెట్టాలని ఎంపీ కార్యాలయం నుంచి స్థానిక ఎమ్మెల్యేలకు ఫోన్లు వెళ్లాయి. అయితే ఈ వివాదంలోకి తమను లాగవద్దంటూ వారు సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. సమైక్యంధ్ర కోసం 78 రోజులుగా ఉద్యమం జరుగుతుంటే తన ల్యాంకో సంస్థ నుంచి నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి చేయడం, విద్యుత్ సమ్మె రోజుల్లోనే ల్యాంకో ద్వారా వంద కోట్ల రూపాయల లాభాలు గడించినట్లు వస్తున్న వార్తలపై కాంగ్రెస్ వర్గాలు కూడా రాజగోపాల్‌పై గుర్రుగా ఉన్నాయి. 2009లో సమైక్యవాదిగా హడావిడి చేసినా 2013కి వచ్చే సరికి రాజీనామాని ఆమోదింపజేసుకోకుండా అడుతున్న డ్రామాలతో రాజగోపాల్ విజయవాడ పార్లమెంట్ పరిధిలోని ఓటర్ల దృష్టిలో కూడా పలుచనయ్యారు. ఈ నెల 21న విజయవాడలో కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి 24 కల్లా రాజీనామా ఆమోదింపజేసుకుని వచ్చి ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొంటానని ప్రగల్భాలు పలికిన రాజగోపాల్ నెల రోజులు దగ్గర పడుతున్నా అడ్రస్ లేరు. ఢిల్లీలో స్పీకర్ కార్యాలయం ముందు హడావిడి చేయడానికే పరిమితమయ్యారు. తన రాజీనామా ఆమోదించాలంటూ ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్ వెనక్కి తీసుకుంటున్నారని వస్తున్న వార్తల పట్ల కూడా సమైక్యవాదులు రాజగోపాల్‌పై మండిపడుతున్నారు. విభజనకు కారకులంటూ బొత్స సత్యనారాయణ, చిరంజీవిపై పరోక్షంగా రాజగోపాల్ ఆరోపణలు చేయడంతో కాంగ్రెస్‌లోని కాపు సామాజిక వర్గం కూడా రాజగోపాల్‌కు దూరం అయ్యింది.