చెల్లెలి కాపురం చూసి ఓర్వలేకపోతున్న పురందేశ్వరి | MLC Buddha Venkanna fires on purandeswari | Sakshi
Sakshi News home page

చెల్లెలి కాపురం చూసి ఓర్వలేకపోతున్న పురందేశ్వరి

Published Thu, Nov 5 2015 8:23 AM | Last Updated on Tue, Aug 14 2018 11:24 AM

చెల్లెలి కాపురం చూసి ఓర్వలేకపోతున్న పురందేశ్వరి - Sakshi

చెల్లెలి కాపురం చూసి ఓర్వలేకపోతున్న పురందేశ్వరి

♦ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మండిపాటు
♦ పురందేశ్వరి, కావూరి, కన్నా.. సోనియాకు ఏజెంట్లని విమర్శ

 విజయవాడ: సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కాపురాన్ని చూసి కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి ఓర్వలేకపోతున్నారని ఎమ్మెల్పీ బుద్దా వెంకన్న విమర్శించారు. విజయవాడలో బుధవారం  ఆయన విలేకరులతో మాట్లాడుతూ చేగొండి హరిరామజోగయ్య రచించిన పుస్తకావిష్కరణకు పురందేశ్వరి హాజరుకావటం వెనుక కుట్ర జరిగిందన్నారు. అమరావతి  రూపకల్పనలో చంద్రబాబుకు వచ్చిన పేరుప్రఖ్యాతులు చూసి ఓర్వలేకనే ఆమె ఈ పుస్తకావిష్కరణకు హాజరయ్యారని విమర్శించారు. ఎన్టీఆర్ కుటుంబంలో పుట్టిన ఆమె టీడీపీకి అపఖ్యాతి కలిగించేలా వ్యవహరించటం శోచనీయమన్నారు.

వంగవీటి మోహనరంగా హత్య జరిగి 26 ఏళ్లు పైబడుతుండగా జోగయ్య ఇప్పుడు పుస్తకం విడుదల చేసి అందులో చంద్రబాబుకు  గూర్చి రాయటాన్ని ఖండించారు. రంగా హత్య వెనుక చంద్రబాబు ఉన్నట్లు  చెప్పటం హాస్యాస్పదమన్నారు. రంగా కుటుంబసభ్యులు గతంలో  టీడీపీలో చేరి పనిచేశారని గుర్తుచేశారు. బీజేపీలో ఉన్న పురందేశ్వరి, కావూరి సాంబశివరావు, కన్నా లక్ష్మీనారాయణలు సోనియాగాంధీ నియమించిన రహస్య ఏజెంట్లని ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement