Dec 18th: AP పొలిటికల్‌ అప్‌డేట్స్‌ | AP Political Updates 18th December | Sakshi
Sakshi News home page

AP Political News Dec 18th: పొలిటికల్‌ అప్‌డేట్స్‌

Published Mon, Dec 18 2023 6:51 AM | Last Updated on Mon, Dec 18 2023 8:22 PM

AP Political Updates 18th December - Sakshi

AP Elections Political Latest Updates Telugu

8:18PM, Dec 18, 2023

మరోసారి సొంతపార్టీ నేతలను టార్గెట్‌ చేసిన టీడీపీ ఎంపీ కేశినేని నాని

  • బుద్ధా వెంకన్నను పరోక్షంగా టార్గెట్‌ చేస్తూ ఘాటైన విమర్శలు
  • విజయవాడ ఎంపీ టికెట్‌ బీసీలకు ఇవ్వాలని బీసీ సంఘాలు చేస్తున్న డిమాండ్‌ను ఆహ్వానిస్తున్నాం
  • నీతి, నిజాయితీ,మచ్చలేని వ్యక్తులే అసలైన బీసీలు

5:20PM, Dec18, 2023

పవన్‌ విధానాలు నచ్చక వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారు: మంత్రి జోగి రమేష్‌

  • జనసేనలో ఉంటే ఉండండి.. పోతేపొండి అనే మాట తర్వాత చంద్రబాబుతో ఉండేది పవన్‌ ఒక్కడే

జనసేనకు కష్టపడి పనిచేసే వారు అవసరం లేదు: రామ్‌ సుధీర్‌

  • చంద్రబాబు జైలుకు వెళ్లగానే పొత్తుపై ప్రకటన చేశారు
  • పార్టీ విధానాలను ప్రశ్నిస్తే కోవర్టు అనే ముద్ర వేస్తున్నారు
  • ప్రజలు సీఎం జగన్‌ కావాలని కోరుకుంటున్నారు
     

4:54PM, Dec18, 2023

ఏపీలో జనసేన పా​ర్టీకి మరో బిగ్‌ షాక్‌

  •  వైఎస్సార్‌సీపీలో చేరిన కృష్ణా జిల్లా పెడన జనసేన నేత యడ్లపల్లి రామ్‌ సుధీర్‌ 
  • రామ్‌ సుధీర్‌ పాటుగా జనసేన స్ధానిక నాయకులు యడ్లపల్లి లోకేష్, పొలగాని లక్ష్మీనారాయణ, మద్దాల పవన్, తోట జగదీష్, ప్రసాద్‌లు కూడా వైఎస్సార్‌సీపీలో చేరారు
  • ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిక

4:45PM, Dec18, 2023
చంద్రబాబు పరిస్థితి ఇంత ఘోరమా? : ఉదయభాను

  • చంద్రబాబు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది
  • జగన్ మోహన్ రెడ్డిపై పోటీచేసి దమ్ము, సత్తా చంద్రబాబుకు లేదు
  • రెండు చోట్ల పోటీచేసి ఓడిపోయిన వ్యక్తి పవన్ కళ్యాణ్
  • ఎనిమిది చోట్ల తెలంగాణలో పార్టీకి కనీసం డిపాజిట్లు తెచ్చుకోలేని వ్యక్తి పవన్ కళ్యాణ్
  • 40 ఏళ్ల ఇండస్ట్రీ,14 ఏళ్ల సీఎం అనిచెప్పుకునే చంద్రబాబు 5 శాతం ఓటులేని పవన్ ఇంటికెళ్లి బ్రతిమిలాడుతున్నాడు
  • ఎన్టీఆర్ ను నాదెండ్ల భాస్కరరావు, చంద్రబాబు వెన్నుపోటు పొడిచి అవమానపరిచారు
  • ఎన్టీఆర్ కు పట్టిన గతే పవన్ కళ్యాణ్ కు పడుతుంది
  • భవిష్యత్తులో చంద్రబాబు , పవన్ పరిస్థితి కుక్కల చింపిన విస్తరి అవుతుంది
  • జగన్ మోహన్ రెడ్డి పై అక్కసుతోనే పవన్, చంద్రబాబు ఒకరి కాళ్లు మరొకరు పట్టుకుంటున్నారు
  • చంద్రబాబు, పవన్ కలిసినా ... క్షేత్రస్థాయిలో క్యాడర్ కలిసే పరిస్థితి లేదు
  • కలిసినా ..ఎన్నికల సమయంలోనే కొట్టుకుంటారు
  • జనసేనకు టీడీపీ వాళ్లు ఓటేయరు.. టీడీపీకి జనసేన వాళ్లు ఓటేయరు
  • దమ్ముధైర్యం ఉంటే సింగిల్ గా పోటీచేయండి

4:25PM, Dec18, 2023
కోటలు దాటుతున్న యువగళం అంచనాలు

  • చివరి దశకు చేరుకున్న నారా లోకేష్ యువగళం పాదయాత్ర
  • నేటితో నారా లోకేష్ యువగళం పాదయాత్రకు మంగళం
  • ఎల్లుండి భోగాపురంలో యువగళం ముగింపు సభ
  • సభకు హాజరుకానున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌, నందమూరి బాలకృష్ణ
  • పోలిపల్లిలో 110 ఎకరాల స్థలంలో బహిరంగ సభకు విస్తృత ఏర్పాట్లు
  • సభావేదికపైనే 600 మంది కూర్చునేలా ఏర్పాటు
  • విశాఖ శివాజీనగర్ లో పాదయాత్ర ముగింపు, పైలాన్ ఆవిష్కరణ
  • కుప్పంలో ఈ ఏడాది జనవరి 27న ప్రారంభమైన లోకేష్ యువగళం
  • మొత్తం 97 నియోజకవర్గాల్లో 226 రోజులపాటు లోకేష్ పాదయాత్ర
  • ఆరంభం నుంచి అవాంతరాల మధ్య సాగిన పాదయాత్ర
  • చంద్రబాబు అరెస్ట్‌ కాగానే పాదయాత్రకు సుదీర్ఘ విరామం ఇచ్చిన లోకేష్‌
  • విమర్శలు రావడంతో చివరకు ఓ కంక్లూజన్‌ ఇచ్చే ప్రయత్నం

4:22PM, Dec18, 2023
హైకోర్టులో ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసు

  • IRR కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పై వాదనలు పూర్తి
  • చంద్రబాబు ముందస్తు బెయిల్ పై ఏపీ హైకోర్టులో విచారణ
  • ఇప్పటికే సీఐడీ తరపున ఆడ్వకేట్ జనరల్ వాదనలు పూర్తి
  • చంద్రబాబు తరపున రిప్లై వాదనలు వినిపించిన సిద్ధార్ధ లూధ్రా
  • శుక్రవారం నాటికి లిఖిత పూర్వక వాదనలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు
  • అనంతరం తీర్పును రిజర్వ్ చేయనున్న ఏపీ హైకోర్టు

4:20PM, Dec18, 2023
జగనన్నే కావాలి.. ఎందుకంటే.?

  • ఏలూరు జిల్లా : ఆంధ్రప్రదేశ్ కి జగనన్నే ఎందుకు కావాలంటే అనే కార్యక్రమం
  • వై యస్ ఆర్ సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఏలూరు లో భారీ ర్యాలీ
  • ఏలూరు జిల్లా పరిషత్ కార్యాలయం నుండి ఫైర్ స్టేషన్ మీదుగా ఏలూరు వెంకటేశ్వర స్వామి గుడి వరకు సాగిన ర్యాలీ  
  • కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కోటగిరి శ్రీధర్, మాజీ క్రికెటర్ అంబటి రాయుడు, జడ్పీ చైర్ పర్సన్ గంటా పద్మశ్రీ,వై యస్ ఆర్ సీపీ విద్యార్థి విభాగం నాయకులు
  • ఫైర్ స్టేషన్ సెంటర్ వద్ద దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన అంబటి రాంబాబు,ఎంపీ కోటగిరి శ్రీధర్

4:18PM, Dec18, 2023
విజయవాడ క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొననున్న సీఎం జగన్‌

  • తాడేపల్లి : ఎల్లుండి సీఎం వైఎస్‌ జగన్‌ విజయవాడ పర్యటన
  • ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వ సెమీ క్రిస్మస్‌ వేడుకలు
  • వేడుకలకు హాజరుకానున్న సీఎం వైఎస్ జగన్

3:45 PM, Dec18, 2023
చంద్రబాబు కేరాఫ్‌ కుప్పం

  • చిత్తూరు : కుప్పంలో 3 రోజుల పాటు చంద్రబాబు పర్యటన
  • ఈ నెల 28న కుప్పం వెళ్లనున్న చంద్రబాబు
  • 28,29,30 తేదీల్లో కుప్పంలో చంద్రబాబు పర్యటన
  • ఇటీవల కుప్పం గురించి ప్రకటన చేసిన చంద్రబాబు
  • ప్రజల అభిప్రాయం మేరకే అభ్యర్థిని ప్రకటిస్తానన్న చంద్రబాబు
  • కుప్పం నుంచే అభిప్రాయ సేకరణ ప్రారంభిస్తానన్న చంద్రబాబు
  • కుప్పంలో పార్టీ పరిస్థితిపై స్థానిక నేతలతో ఇప్పటికే సుదీర్ఘ చర్చలు
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో చిత్తుగా ఓడిపోయిన సైకిల్‌ పార్టీ

3:20PM, Dec18, 2023
పవన్ నూటికి నూరుపాళ్లు ప్యాకేజీ స్టారే: రవిచంద్రారెడ్డి, వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి

  • చంద్రబాబు, పవన్ ఒకరి ఇంటికి ఇంకొకరు వెళ్తే ఒక వార్త
  • ఇందులో రాష్ట్ర ప్రయోజనాలు ఏం ఉన్నాయి
  • వారి మధ్య ఒప్పందాలు, డీల్స్ కుదుర్చోవటమే పని
  • లోకేష్ సభకి పవన్ రాకపోతే బాగోదని చంద్రబాబు డీల్‌కి వెళ్లారు
  • లోకేష్, పవన్‌లకు పడటం లేదు
  • వారిమధ్య రాయబారం చేసి ఒడ్డున పడాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు
  • 600 కు పైగా హామీలు ఇచ్చి అమలు చేయలేని వ్యక్తి చంద్రబాబు
  • పవన్ 50 సీట్లు అడిగితే 25 సీట్లు కూడా  ఇవ్వనని చంద్రబాబు అన్నారు
  • అందుకే నిన్న ఇద్దరూ మీడియా తో కూడా మాట్లాడకుండా వెళ్లిపోయారు
  • లోకేష్ది పాదయాత్ర కాదు, ఒళ్లు తగ్గటానికి చేసిన యాత్ర
  • జనం నిద్ర పోగానే నియోజకవర్గాలే దాటిపోయినట్టు చూపించారు
  • జనం కష్టాలు తీర్చటానికి చేసే యాత్రలను పాదయాత్ర అంటారు
  • లోకేష్ చేసేలాంటి యాత్రలు ఎవరూ చేయరు 
  • కార్యకర్తలను ఎక్కువ కేసులు పెట్టించుకోమని చెప్పి తనదాకా వచ్చేసరికి పారిపోయాడు
  • మీ కుటుంబానికి కష్టం వస్తే మీడియా ముందు ఏడుస్తారు 
  • మరి కార్యకర్తలనేమో కేసులు పెట్టించుకోమని చెప్పడం ఏంటి?
  • అమరావతిలో కృతిమ ఉద్యమాన్ని నాలుగేళ్లుగా నడిపాలని చూశారు 
  • అది నిజమైన ఉద్యమం ఐతే ఆధార్ కార్డులు చూపమంటే ఎందుకు పారిపోయారు? 
  • విశాఖ, రాయలసీమలో ఓట్లు అడిగే హక్కు ఉందా? 
  • ప్రజలు కూడా మీ చొక్కా పట్టుకుని నిలదీసే రోజు వస్తుంది
  • రాష్ట్రమంతా జనం టాక్సులు కడితే 29 గ్రామాల అమరావతిని అభివృద్ధి చేస్తారా?
  • ఆరోగ్యశ్రీని రూ.5 లక్షల నుండి రూ..25 లక్షలకు పెంచిన ఘనత సీఎం జగన్‌ది
  • ప్రజలంతా దీన్ని హర్షిస్తున్నారు

2:45PM, Dec18, 2023

చంద్రబాబు చేసిన మోసాన్ని కాపులు మర్చిపోలేదు: మంత్రి అమర్నాథ్‌

  • పవన్‌ను ఒక కాంట్రాక్టర్ గా ఉపయోగించుకొని కాపులు ఓట్లు పొందాలని చంద్రబాబు చూస్తున్నారు
  • రంగాను హత్య, ముద్రగడ కుటుంభాన్ని వేధించిన విషయన్ని కాపులు మర్చిపోలేదు
  • కాపు ఉద్యమ సమయంలో  తప్పుడు కేసులు బనాయించారు
  • పవన్ -చంద్రబాబు ఎన్నిసార్లు కలిసిన కాపులు నమ్మే పరిస్థితి లేదు
  • ప్యాకేజీ ఎక్కువ అందింది కాబట్టి యువ గళం సభకు పవన్ వస్తున్నారు
  • యువ గళం పాదయాత్ర గురించి టిడిపిలోనే చర్చ లేదు
  • యువ గళం పాదయాత్ర గురించి మాట్లాడటం అనవసరం..
     

02:44PM, Dec18, 2023

రూ. 5 లక్షల నుంచి రూ. 25 లక్షలకు వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ పరిధిని పెంచారు: మంత్రి ఆర్‌కే రోజా

  • తండ్రిని మించిన తనయుడిగా ఈరోజు పేదలకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు సీఎం జగన్‌
  • 3257 రోగాలకు ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకు వచ్చారు సీఎం జగన్ మోహన్ రెడ్డి
  • రూ. 25 లక్షలు ఆరోగ్యశ్రీ పరిధి పెంచడం ద్వారా మేలు చేశారు
  • ఆరోగ్య ఆంధ్ర ప్రదేశ్‌గా ఏపీని మార్చారు
  • ఆరోగ్య శ్రీ యాప్ డౌన్ లోడ్ చేసుకుని , దగ్గరలో ఉన్న నెట్ వర్క్ ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేసుకోవచ్చు
  • ఆరోగ్య సురక్ష ద్వారా టెస్ట్ లు చేయించుకుని , సంపూర్ణ  ఆరోగ్య వంతులు అయ్యే వరకు చికిత్స అందిస్తున్నారు
  • కళ్లు ఉండి చూడలేని కబోధిలా ప్రతిపక్షాలు తయారు అయ్యాయి
  • రాష్ట్రంలో 32,279 కోట్లు వైద్య రంగానికి ఖర్చు చేశారు
  • ఉద్ధనం లో కిడ్నీ సమస్య పరిష్కారం చూపారు
  • విద్యా , వైద్యం రంగంలో సమూల మార్పులు తీసుకు వచ్చారు 
  • 53 వేల మంది వైద్య సిబ్బంది నియామకం చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి 
  • గతంలో 748 హాస్పిటల్స్ ఆరోగ్య శ్రీ వైద్యం అందిస్తే ప్రస్తుతం 2,309  హాస్పిటల్ లో రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ  వైద్యం  అందిస్తున్నారు
  • ఇతర రాష్ట్రాల్లో 204 హాస్పిటల్స్ లో చికిత్స  పొందే అవకాశం కల్పించారు
  • ప్రజలు మన్నలు పొందితే సీట్లు అవే వస్తాయి, మా సీట్లు గురించి ఎల్లో మీడియా అత్యుత్సహం చూపిస్తోంది
  • స్థానికంగా మీరు ఇబ్బందులు పడుతున్నారు
  • సీట్లు మార్పులు చేర్పులు విషయంలో ఒకటికి రెండు సార్లు మాట్లాడిన తర్వాతనే సీఎం సర్దు బాటు చేస్తున్నారు
  • ఎల్లో మీడియా లో కడుపు మంట తో విషపు స్టోరీలు చేస్తున్నారు
  • సాక్షి పేపర్‌లో వచ్చినవి మాత్రమే నమ్మండి, ఎల్లో మీడియా లో వచ్చినవి నమ్మకండి
  • జనసేన - టీడీపీ మ్యానిఫెస్టో లేదు, సీట్లు సర్దుబాటు లేదు , వీళ్ళు మా గురించి మాట్లాడుతున్నారు

01:14 PM, Dec 18, 2023
బాబు, పవన్‌ కలిసి కాపులకు వెన్నుపోటు పొడిచేందుకు ప్రయత్నిస్తున్నారు : మంత్రి కొట్టు
మంత్రి కొట్టు సత్యనారాయణ ఫైర్

  • జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న మంచిని చూసి ప్రతిపక్షాలు తట్టుకోలేకపోతున్నాయి
  • నీతి నియమాలు లేని ప్రతిపక్షాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి
  • మన కర్మకొద్దీ ఇలాంటి పార్టీలు దొరికాయి
  • అధికార పక్షం చేస్తున్న సంక్షేమ పాలన ప్రతిపక్షాలకు నచ్చకపోవడం దురదృష్టకరం
  • ఓట్లు దండుకోవాలనే దుర్భుద్ధితో చంద్రబాబు,పవన్ ఉన్నారు
  • పవన్ కళ్యాణ్ కాపుల పరువు తీసేస్తున్నాడు
  • కాపులను అడ్డం పెట్టుకుని పార్టీ పెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్
  • దొంగతనం చేసి కోట్లు కొల్లగొట్టి చంద్రబాబు జైలుకెళ్లాడు
  • జైలుకి వెళ్లిన సమయంలో రకరకాల జబ్బులున్నాయని చెప్పాడు
  • కోర్టు కండిషనల్ బెయిల్ ఇస్తే అదేదో వీరవిజయంలా హడావిడి చేశారు
  • జైల్లో చంద్రబాబుకు పవన్‌ సాష్టాంగ ప్రమాణం చేశాడు
  • పవన్ సాష్టాంగ ప్రమాణం చేసిన నాడే కాపుజాతి తలదించుకుంది
  • టీడీపీని తిట్టినా.. అగౌరవ పరిచినా.. ఊరుకోనని ప్రకటించిన పవన్ వ్యక్తిత్వాన్ని కాపులంతా తెలుసుకోవాలి
  • పవన్ కు మనుషులతో పనిలేదు ...డబ్బులిచ్చే చంద్రబాబే ముఖ్యం
  • ఈ రాష్ట్రానికి జగన్ మోహన్ రెడ్డే కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారు

అవనిగడ్డ ఎమ్మెల్యే ,సింహాద్రి రమేష్ బాబు

  • పవన్ కు రెండు సీట్లు ఇచ్చినా చంద్రబాబునే కౌగలించుకుంటాడు
  • నిన్నటి భేటీలో సంతృప్తిపడింది నాదెండ్ల మనోహర్ మాత్రమే
  • నాదెండ్ల మనోహర్‌ ను జనసైనికులు ఏమైనా అంటే కోవర్టులే అంటున్నాడు
  • ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన నాదెండ్ల భాస్కరరావు కొడుకే ఈ మనోహర్
  • తండ్రి నుంచి కుట్రలు కుతంత్రాలు మనోహర్ కు వారసత్వంగా వచ్చాయి
  • పవన్ కు కూడా ఎన్టీఆర్ కు పట్టిన గతే పడుతుంది
  • ఎన్టీఆర్ ను, సీపీఎం, సీపీఐ, బీజేపీ చంద్రబాబు నాశనం చేశాడు
  • అవసరం తీరాక పవన్ ను , ఆయన పార్టీని చంద్రబాబు కచ్చితంగా బయటికి గెంటేస్తాడు
  • పవనే వెంట ఉండేందుకు కాపులు ఇష్టపడటం లేదు
  • చంద్రబాబు కాళ్ల దగ్గర మనమెందుకు కూర్చోవాలని కాపులు అనుకుంటున్నారు
  • టీడీపీ నేతలు చెల్లని నాణేలతో సమానం
  • మళ్లీ ఏపీలో గెలిచేది వైసీపీనే... వచ్చేది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వమే

12:44 PM, Dec 18, 2023
తప్పుడు ప్రచారాలకు అడ్డుకట్ట వేయాలంటే ఒక్కసారి రికార్డులు చూడాల్సిందే
►పవన్‌ కళ్యాణ్‌, లోకేష్‌ ఏం ప్రచారం చేస్తున్నారంటే..
► 2019లో తెలుగుదేశం, జనసేన విడివిడిగా పోటీ చేశాయి
► ఆ పరిస్థితి YSRCPకి ప్రయోజనం చేకూర్చింది
► మేంగానీ.. కలిసి పోటీ చేసి ఉంటే.. ఫలితం మరోలా ఉండేది

కొన్ని పరిశీలనలు (కింద ఇచ్చిన ఎన్నికల సంఘం రికార్డుల ఆధారంగా).. మీరే వాస్తవాలు తెలుసుకోండి

► YSRCPకి సొంతంగా వచ్చిన ఓట్లు  1,56,88,569 అంటే 49.95%
► ఒక వేళ TDP, జనసేన కలిసి పోటీ చేసినా వారికి వచ్చే ఓట్ల శాతం 44.7% మాత్రమే, అంటే 1,40,41,479 ఓట్లు మాత్రమే
► సీట్ల పరంగా చూస్తే YSRCPకి వచ్చింది 151 అయితే TDPకి వచ్చింది 23, జనసేనకు వచ్చింది 1
► ఇంతటి ముందు చూపు ఉంది కాబట్టే 2014లో అసలు పవన్‌ కళ్యాణ్‌ పోటీకే దిగలేదు. నేను గాని బరిలో దిగి ఉంటే.. అని చెప్పుకోడానికి.!

ఒకసారి ఎన్నికల కమిషన్‌ వెబ్‌ సైట్‌ చూసి పార్టీలు, ఓట్లు, ఓట్ల శాతం చూడండయ్యా బాబు

సమన్వయం కుదుర్చుకున్నది ఇంత గొప్ప నాయకులా?
► తెలుగుదేశం, జనసేన మధ్య సమన్వయం నడిపిన లోకేష్‌, పవన్‌ కళ్యాణ్‌
ఇద్దరి పొలిటికల్‌ కెరియర్‌లో ఎమ్మెల్యేగా కూడా నెగ్గలేకపోయిన లోకేష్‌, పవన్‌

మంగళగిరిలో మంత్రిగా ఉంటూ బరిలో దిగిన నారా లోకేష్‌కు షాక్‌ ఇచ్చిన ఓటర్లు, 5270 ఓట్ల తేడాతో ఓటమి

గాజువాకలో పవన్‌ కళ్యాణ్‌ను పట్టించుకోని ప్రజలు, 16486 ఓట్ల తేడాతో ఓటమి

భీమవరంలో పవన్‌ కళ్యాణ్‌కు తప్పని పరాజయం, 7792 ఓట్ల తేడాతో ఓటమి

12.10pm, సోమవారం, 18th Dec 2023
దత్తపుత్రుడివన్ని ప్యాకేజీ వేషాలే : YSRCP

  • ప్యాకేజీ ఇస్తే దేనికైనా రెడీ
  • లోకేష్‌ సభకు అసలెందుకు రానన్నాడు?
  • ఇప్పుడెందుకు ఒప్పుకున్నాడు?
  • వారాహి యాత్ర ఎందుకు ఆపేశాడు?
  • లోకేష్‌ యాత్ర పూర్తయ్యేవరకు యాత్ర ఆపమన్నదెవరు?
  • ఏ సభలో ఎవరు పాల్గొనాలో.. ఆదేశాలెక్కడి నుంచి వస్తున్నాయి?

12.05pm, సోమవారం, 18th Dec 2023
మాదాపూర్‌లో ఏం జరిగింది?

  • చంద్రబాబు అసలు వైఖరిని బయటపెట్టిన హైదరాబాద్‌ మాదాపూర్‌ భేటీ
  • పవన్‌ కళ్యాణ్‌ ఇంట్లో జరిగిన సమావేశం
  • లోకేష్‌ సభ కోసం పవన్‌ను ఒప్పించేందుకు నానా పాట్లు పడ్డ చంద్రబాబు

ఎవరి డిమాండ్‌ ఏంటీ? శనివారం వరకు ఏం జరిగింది?

  • పవన్‌ కళ్యాణ్‌ : 50 ఎమ్మెల్యే సీట్లు కావాలి, 5 ఎంపీ సీట్లు కావాలి
  • చంద్రబాబు : 25 ఎమ్మెల్యే సీట్లు ఇస్తాం, 2 ఎంపీ సీట్లు ఇస్తాం

శనివారం పవన్‌ కళ్యాణ్‌ చేసిన పనేంటీ?

  • సీట్ల సర్దుబాటుపై లెక్కలు కుదరలేవు కాబట్టి.. సమన్వయానికి దూరంగా ఉండాలన్న యోచన
  • లోకేష్‌ పాదయాత్ర ముగింపు సభకు రాను.. అని తేల్చి చెప్పిన పవన్‌ కళ్యాణ్‌
  • అదే విషయాన్ని అధికారికంగా ప్రకటించిన తెలుగుదేశం, జనసేన

ఆదివారం ఏం జరిగింది? 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ మాదాపూర్‌ మెట్లెలా ఎక్కింది?

  • అసలుకే మోసం వస్తుందని గ్రహించిన చంద్రబాబు
  • సాయంత్రానికి మారిన సీను, మాదాపూర్‌ మెట్లెక్కిన 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ
  • లోకేష్‌ సభకు రాకపోతే కథ మొత్తం అడ్డం తిరుగుతుందని వివరించిన చంద్రబాబు
  • ఇప్పటివరకు పొత్తు అన్నాం, ఇప్పుడు జనం ఏమనుకుంటారని అడిగిన బాబు
  • సోషల్‌ మీడియాలో భారీగా ప్రచారం చేశాం, జనం ప్రశ్నిస్తారు
  • పొత్తుపై ప్రభావం చూపిస్తుంది. తప్పుడు సంకేతాలు వెళ్తాయి
  • కచ్చితంగా లోకేష్‌ పాదయాత్ర ముగింపు సభకు రావాల్సిందే

పవన్‌ కళ్యాణ్‌ ప్రశ్నలేంటీ? చంద్రబాబును ఏమని అడిగాడు?

  • సీఎం పదవి మీకే వదిలేస్తాం
  • మాకు అడిగినన్ని సీట్లు ఇవ్వాల్సిందే
  • ప్రచారంలో మమ్మల్ని సమానంగా చూడాలి
  • మేమడిగిన నియోజకవర్గాలు కేటాయించాలి
  • మా పార్టీలోకి మీ పార్టీనుంచి అభ్యర్థులను చొప్పించొద్దు
  • సీట్ల లెక్క తేలేవరకు సభలకు రాను
  • నేను లోకేష్‌ సభకు రాను, నెల్లూరులో సోమిరెడ్డి దీక్షకు నాగబాబు హాజరు కాడు

చంద్రబాబును ఇచ్చిన ఆఫర్లేంటీ? మండలి సీట్లు ఆశ చూపిస్తున్నారా?

  • సీట్ల కోసం పట్టుబట్టొద్దు
  • జనసేనకు ఇప్పటికీ అభ్యర్థులు లేరు
  • మీరడిగిన చోట కాకుండా.. కాపులు బలంగా ఉన్న చోట 25 స్థానాలిస్తాం
  • మీరు ఇప్పుడు త్యాగం చేసే మిగతా సీట్లకు సమానంగా ఎమ్మెల్సీలు కేటాయిస్తాం
  • జనసేన అభ్యర్థుల సమస్తం ఖర్చు మేమే భరిస్తాం
  • పవన్‌ కళ్యాణ్‌ వారాహి యాత్ర ప్యాకేజీ ఖర్చును మేమే భరిస్తాం
  • డబ్బులు ఎన్ని కావాలన్నా ఇస్తాం, టికెట్లు మాత్రం పాతిక దాటొద్దు
  • ఇప్పుడు సభకు రాకపోతే.. అన్ని రకాలుగా మీరే నష్టపోతారు
  • మేము కూడా వద్దనుకుంటే.. మీ పార్టీకి మరోసారి 2019 రిపీట్‌ అవుతుంది
  • మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో జనసేనకు డిపాజిట్లు కూడా రాలేదు
  • మళ్లీ ఏపీలో అదే దుస్థితి కొనితెచ్చుకోవద్దు
  • డబ్బులు తీసుకోండి, సీట్లు త్యాగం చేయండి, ఎమ్మెల్సీలు ఇస్తాం
  • ఇప్పుడయితే అర్జంటుగా లోకేష్‌ సభకు రావాలి

ముందు ససేమిరా అన్న పవన్‌.. మీటింగ్‌ తర్వాత కూడా విలేకరులతో మాట్లాడలేదు. ఆ తర్వాత సుదీర్ఘంగా పార్టీ నేతలతో మాట్లాడినట్టు తెలిసింది.

ఈ సమావేశం తర్వాత అర్థరాత్రి వేళ లోకేష్‌ సభ కోసం పవన్‌ కళ్యాణ్‌ వస్తాడని జనసేన కార్యవర్గానికి ఓ మెసెజ్‌ అందింది.

12.00pm, సోమవారం, 18th Dec 2023
ఆరోగ్యశ్రీతో ప్రజలందరికీ పూర్తి భరోసా : సీఎం జగన్

  • కొత్త కార్డుల పంపిణీ ప్రారంభించిన సీఎం
  • ప్రజలందరికీ ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం
  • దేశ చరిత్రలోనే ఇది చారిత్రాత్మక ఘటనగా నిలిచిపోతుంది
  • పేదవాడికి వైద్యం మరింత చేరువ చేయడమే లక్ష్యం
  • వైద్యం కోసం పేదవాడు అప్పుల పాలు కాకూడదు
  • ఆరోగ్యశ్రీ పరిధిని ప్రతి ఒక్కరికి విస్తరించాలనేదే లక్ష్యం
  • ప్రతి ఇంటికి వెళ్లి ఆరోగ్యశ్రీ కార్డులు అందిస్తూ అవగాహన కల్పించాలి
  • ఉచితంగా వైద్యం ఎలా పొందచ్చనేది వివరించాలి
  • ఆరోగ్యశ్రీ పథకంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం
  • వైద్యం ఖర్చు ₹1000 దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చాం
  • 1059 ప్రొసీజర్ల నుంచి 3257 ప్రొసీజర్ల ను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చాం
  • కోటి 48 లక్షల కుటుంబాలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చాము
  • వైద్యాన్నిపేదవాడికి అందుబాటులోకి తెచ్చాము
  • పేదవాడికి మెరుగైన వైద్యం అందాలి
  • హైదరాబాద్, బెంగళూరు, చెన్నై హాస్పిటల్స్ లో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సేవలు
  • బయట రాష్ట్రాల్లో కూడా వైయస్సార్ ఆరోగ్యశ్రీ సేవలందిస్తున్నాం
  • రెండు వేలకు పైగా బయటి హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ సేవలు విస్తరించాం
  • పేద ప్రజలకు ఆరోగ్యశ్రీ ఓ వరం
  • 4 కోట్ల 25 లక్షల మంది ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తారు
  • గత ప్రభుత్వం ఏటా రూ.1034 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు
  • ఇవాళ ఆరోగ్యశ్రీ కింద ఏడాదికి రూ.4100 కోట్లు ఖర్చు చేస్తున్నాం
  • రోగి పూర్తిగా కోరుకునే వరకు జీవనోపాధి కింద ఆరోగ్య ఆసరా ఇస్తున్నాం
  • ఆరోగ్య ఆసరా ద్వారా నెలకు రూ.5000 అందిస్తున్నాం
  • ఇప్పటివరకు 25,27,870 మందికి ఆరోగ్య ఆసరా ద్వారా లబ్ధి చేకూరింది
  • క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులకు కూడా ఆరోగ్యశ్రీని వర్తింపజేస్తున్నాం
  • ఎలాంటి పరిమితులు లేకుండా ఆరోగ్యశ్రీ సేవలు అందించాం
  • వైద్య రంగంలో సంస్కరణలకు 55 నెలల కాలంలో 32,279 కోట్లు ఖర్చు చేసాం
  • క్యాన్సర్ వ్యాధి నయమయ్యే వరకు ఆరోగ్యశ్రీ వర్తింపజేశాం
  • గత ప్రభుత్వ హయాంలో 104, 108 వాహనాలు కూడా వచ్చేవి కావు
  • గతంలో మండలానికి ఒక 104, 108 వాహనం కూడా లేని పరిస్థితి
  • ఇవాళ ఏకంగా 104, 108 కింద 2200 వాహనాలు తిరుగుతున్నాయి
  • గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు కూడా లేని పరిస్థితి
  • ఇవాళ అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్ల కొరత లేకుండా చర్యలు తీసుకున్నాం
  • అత్యుత్తమ ప్రమాణాలతో వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చాం
  • జాతీయస్థాయిలో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత 61% ఉంటే రాష్ట్రంలో 3.3% మాత్రమే స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత ఉంది
  • ఏ పేదవాడు కూడా వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రావద్దు
  • ప్రతి మండలానికి రెండు పీహెచ్ లు
  • కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు అందుబాటులోకి తెచ్చాం
  • చికిత్స నుంచి మందుల వరకు అత్యుత్తమ ప్రమాణాలతో అందిస్తున్నాం
  • ప్రభుత్వాసుపత్రుల్లో కొత్త సిబ్బందిని  నియమించాం
  • ఆరోగ్యశ్రీ సేవలు ఉచితంగా ఎలా పొందవచ్చు అవగాహన కల్పించాలి
  • ఆరోగ్యశ్రీ సేవల గురించి ప్రతి ఇంట్లో కూడా వివరంగా చెప్పాలి
  • ప్రతి ఇంటికి వెళ్లి కొత్త ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చి సేవల గురించి చెప్పాలి
  • ప్రతి ఫోన్లో ఆరోగ్యశ్రీ యాప్  డౌన్లోడ్ చేయించాలి
  • ప్రతి ఇంట్లో దిశ, ఆరోగ్యశ్రీ యాప్ లు ఉండాలి
  • అక్క చెల్లెమ్మల ఫోన్లలో ఈ రెండు యాప్ లు ఉండేలా చూడాలి
  • ఆరోగ్యశ్రీ కొత్త కార్డులో పేషెంట్ కు సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయి
  • క్యూ ఆర్ కోడ్ ద్వారా పేషంట్ వివరాలు అన్నీ డాక్టర్ కు తెలుస్తాయి
  • ఆరోగ్యశ్రీ గురించి తెలియని వారు ఎవరు ఉండకూడదు
  • ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందిన వారికి మందులు ఉచితంగా డోర్ డెలివరీ చేస్తాం
  • ఇప్పటికే డోర్ డెలివరీ కి సంబంధించి ట్రయల్ రన్ స్టార్ట్ చేశాం
  • విలేజ్ క్లినిక్ సిబ్బంది సంబంధిత పేషెంట్ కు మందులు అందిస్తారు
  • డాక్టర్ ను మళ్లీ ఎప్పుడు కలవాలన్న వివరాలు కూడా అందిస్తాం
  • పేషెంట్ కు అయ్యే ప్రయాణ ఖర్చు కూడా అందిస్తాం
  • జనవరి 1 నుంచి ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 ప్రారంభం అవుతుంది
  • వారానికి రెండుసార్లు హెల్త్ క్యాంపులు జరుగుతాయి
  • ఇదొక నిరంతర ప్రక్రియగా జరుగుతుంది
  • బిపి, డయాబెటిస్, హిమోగ్లోబిన్ వంటి టెస్టులు చేశాం
  • పేదవాడికి ఆరోగ్యశ్రీ చేరువ చేయడమే లక్ష్యం
  • ప్రతి మండలంలో వారానికి ఒకసారి హెల్త్ క్యాంప్ ఏర్పాటు
  • పట్టణంలో ప్రతి బుధవారం హెల్త్ క్యాంప్ ఏర్పాటు
  • వాలంటీర్ల ద్వారా ఆరోగ్యశ్రీ పై అవగాహన కల్పిస్తున్నాం
  • ఇది ఒక నిరంతర ప్రక్రియగా జరుగుతుంది
  • ఇప్పటివరకు 6 కోట్ల 45 లక్షల 6వేల 18 (6,45,06,018) పరీక్షలు చేశాం
  • ఈ టెస్టుల ద్వారా 60 లక్షల మందికి లబ్ధి చేకూరింది : సీఎం వై.ఎస్.జగన్

11.30am, సోమవారం, 18th Dec 2023
అడ్డదారిలో ఓట్ల కేటుగాళ్లు

  • తెలంగాణలో నివాసం, అక్కడే ఓటు..
  • మళ్లీ ఏపీలోనూ ఓటర్లుగా నమోదు
  • తెలంగాణ పోలింగ్‌ ముగిసిన మర్నాడే ..
  • హైదరాబాద్‌లో టీడీపీ అనుకూలవర్గం ఓటర్ల మేళా
  • సానుభూతిపరులతో శిబిరాలు..
  • ఆన్‌లైన్‌లో భారీగా ఫామ్‌ 6 దరఖాస్తులు
  • ఏపీలోనూ ఓటర్లుగా నమోదుకు 4. 30 లక్షల  అప్లికేషన్లు
  • ప్రజాప్రాతినిధ్య చట్టం 1950 సెక్షన్‌ 17, 18 ప్రకారం దేశంలో ఒక నియోజకవర్గంలో ఒక వ్యక్తికి ఒక ఓటు మాత్రమే ఉండాలి.
  • వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు నియోజకవర్గాల్లో ఓటు నమోదు చేయించుకోవడం చట్ట ప్రకారం నేరం.
  • బోగస్ ఓట్ల బాబు చూపిన బాటలోనే.. జనసేన
  • పవన్‌ సోదరుడు నాగేంద్రరావు (నాగబాబు), కుటుంబీకులకు హైదరాబాద్‌లో ఓట్లు..
  • ఏపీలోని వడ్డేశ్వరంలో ఉంటున్నామంటూ మళ్లీ ఓట్లకు దరఖాస్తు

చంద్రబాబు పవన్ కల్యాణ్‌లదీ ఫెయిల్యూర్ పొత్తు: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

  • రెండు పార్టీల పత్రికలకు మైండ్ బ్లాక్ అయింది
  • చంద్రబాబు.. పవన్ కల్యాణ్ వద్దకెళ్లి ప్రాధేయపడుతున్నాడు
  • చంద్రబాబు,పవన్ కల్యాణ్ మధ్య పొత్తు కుదరలేదు
  • లోకేష్ బహిరంగ సభకు పవన్ కల్యాణ్ రాలేనని చెప్పటంతో వీరి మధ్య పొత్తు ఫెయిల్యూర్
  • రెండు పార్టీల మధ్య భిన్న అభిప్రాయాలతో దూరమవుతున్నారు
  • సీఎం జగన్‌ను తట్టుకునే పరిస్థితి లేక చంద్రబాబు తిప్పలు పడుతున్నాడు
  • ఇప్పటివరకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ అభ్యర్థులని ప్రకటించలేకపోయారు
  • చంద్రబాబు పవన్ కల్యాణతో భేటీని వైఎస్సార్‌సీపీ పట్టించుకోవడం లేదు
  • టీడీపీ 2014లో అధికారంలో ఉండి ఏం చేసింది. 

11.30 AM, Dec 18th, 2023
చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాటలు వారి కేడర్ వినే పరిస్థితి లేదు: దేవినేని అవినాష్

  • జగన్ ప్రభుత్వ పథకాలపై సిగ్గులేని టీడీపీ నేతలు తోక పత్రికల ద్వారా విష ప్రచారం
  • పత్రికలు కూడా వాస్తవాలు గ్రహించి నిజాలు ప్రచురించాలి
  • పిల్లల చదువుకునే ట్యాబ్‌లు, భోజనాలపై కూడా విష ప్రచారం చేస్తున్న టీడీపీ
  • కొండ ప్రాంత వాసులకు ఇళ్ల పట్టాలివ్వకుండా మోసం చేసింది
  • రానున్న ఎన్నికల్లో ఎన్ని పార్టీలు ఎదురొచ్చినా జగన్ ఒక్కరే వారికి సమాధానం
  • జగన్ ప్రభుత్వం విజయంపై ప్రజలు ఇప్పటికే ఫిక్స్ ఆయ్యారు

10.00 AM, Dec 18th, 2023
మా ఓటు జగనన్నకే..

  • సీఎం వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలు అందుతున్నాయి.
  • నాకు ఉద్యోగం వచ్చింది

10.00 AM, Dec 18th, 2023
పరిటాల కుటుంబానికి చంద్రబాబు షాక్‌?

  • గత ఎ‍న్నికల్లో రాప్తాడులో ఓటమితో రాజకీయంగా ఎదురుదెబ్బ
  • ధర్మవరం టీడీపీ ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు.. అక్కడ సొంత సామాజికవర్గం నుంచే పోట్లు
  • ధర్మవరంలో ఉండలేక.. రాప్తాడుకు రాలేక.. పరిటాల రవీంద్ర, సునీతను గెలిపించిన పెనుకొండ నుంచి పోటీకి సన్నాహాలు
  • బీసీ ఓటర్లు ఎక్కువగా ఉండే ఆ నియోజకవర్గంలో పరిటాల కుటుంబానికి టికెట్‌ ఇస్తారా? లేదా? 

09.50AM, Dec 18th, 2023
చల్లబడ్డ దత్తపుత్తుడు..

  • ఈనెల 20వ తేదీన జరిగే యువ గళం బహిరంగ సభకు హాజరుకానున్న పవన్ కల్యాణ్‌
  • ఆదివారం పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి సభకు రావాలని ఆహ్వానించిన చంద్రబాబు

08.20AM, Dec 18th, 2023
మళ్లీ కాపుల ఓట్ల కోసమేనా పవన్ ఇంటికి చంద్రబాబు

  • 2014 ఎన్నికల సమయంలో పవన్ ఇంటికి చంద్రబాబు
  • మళ్లీ అదే తరహాలో ఆదివారం పవన్ చంద్రబాబు భేటీ
  • కాపులను మోసం చేయడానికి చంద్రబాబు పవన్ మళ్లీ కలుస్తున్నారని కాపుల ఆగ్రహం.
  • అవసరం తీరిన తర్వాత చంద్రబాబు కాపులను చిత్రహింసలు పెట్టారని ఆగ్రహం.
  • కాపులను కేసులతో చంద్రబాబు వేధించిన సంగతిని మర్చిపో లేదంటున్న కాపులు
  • ముద్రగడ కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టిన సంగతి తమ కళ్ల ముందు మెదులాడుతుందంటున్న కాపులు
  • ముద్రగడ కుటుంబ సభ్యులపై పోలీసులతో దాడి, కాపు ఉద్యమ సమయంలో యువతపై తప్పుడు కేసులు ఇంకా తమకు గుర్తు ఉన్నాయని అంటున్న కాపులు.
  • తుని రైల్వే దహనంలో కాపులపై పనికట్టుకుని వేధింపులు మర్చిపోలేదు అంటున్న కాపులు
  • మళ్లీ అధికారం కోసం, కాపులు ఓట్ల కోసం పవన్ చంద్రబాబు భేటీ అంటూ కాపులు అసహనం.
  • మళ్లీ కాపులను మోసం చేయడానికి చంద్రబాబు పవన్ భేటీ అని ఆగ్రహం 
  • ఇంకా తమ కళ్ల ముందు  చంద్రబాబు ఆకృత్యాలు కనిపిస్తున్నాయి
  • ఎన్నాళ్లు అధికారం కోసం చంద్రబాబు పవన్ కాపులను కలిసి మోసం చేస్తారంటూ అసంతృప్తి. 
  • ఎన్నికల సమయంలోనే కాపులు గుర్తొస్తారా అంటూ మండిపాటు.
  • కాపులపై దాడులు జరుగుతుంటే పవన్ ఎందుకు నోరు మెదపలేదంటూ ప్రశ్నిస్తున్న కాపులు.
  • అధికారంలో ఉన్న రోజులు చంద్రబాబు కాపు ప్రజాప్రతినిధులను తన గుమ్మం ఎక్కనివ్వ లేదంటున్న కాపులు.
  • కాపు ప్రజా ప్రతినిధులను కలవడానికి కనీసం లోకేష్ అపాయింట్మెంట్ కూడా ఇచ్చేవారు కాదంటున్నారు.

08.15AM, Dec 18th, 2023
మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు..

  • ‘‘నాదేండ్ల సంతృప్తి చెందేలా’’ చర్చలు జరిగాయి, అర్థమయ్యిందా!
  • ‘‘నాదేండ్ల విముక్త జనసేన’’ కోసం  పోరాడేవాడే అసలైన సైనికుడు!

08.06AM, Dec 18th, 2023
పోలిపల్లిలో కబ్జా గళం
టీడీపీ నాయకులు భూములు కొట్టేసిన గ్రామంలో లోకేశ్‌ యువగళం ముగింపు సభ
విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో నకిలీ పత్రాలతో ఖరీదైన భూములకు ఎసరు
ఫోర్జరీ పాసు పుస్తకాలతో స్వాహా చేసి విక్రయాలు
ఆర్డీవో నాడు చర్యలకు ఆదేశించినా అడ్డుపడ్డ ఎల్లో గ్యాంగ్‌
అక్రమాలకు నాటి ఓ జిల్లా పోలీసు అధికారి అండదండలు!
 

చదవండి: నకిలీ పత్రాలతో విక్రయించి.. పరిహారం కాజేసి

07.24AM, Dec 18th, 2023
సొంత పార్టీ నేతల నుంచి నిరసన సెగ.

  • అరకులో మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబుకు చేదు అనుభవం.
  • అరకు పర్యటనకు వచ్చిన మాజీ మంత్రి సమావేశాన్ని అడ్డుకున్న టీడీపీ నేతలు
  • టీడీపీ నేత అబ్రహాంకు  అన్యాయం చేశారంటూ నినాదాలు.
  • మావోయిస్టుల చేతిలో మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే సోము తనయుడు అబ్రహాం.
  • అబ్రహాంకు ఆఖరి వరకు టికెట్ ఇస్తామని చెప్పి చంద్రబాబు మోసం
  • మోసం చేసిన చంద్రబాబును చెప్పుతో కొడతామని కార్యకర్తల ఆగ్రహం.
     

07.18AM, Dec 18th, 2023
ఈనాడు రామోజీరావు పిచ్చి రాతలు

  • కరువు రావడం,తుపాన్‌ వల్ల భారీ వర్షాలు కురవడం కూడా ప్రభుత్వ వైఫల్యమేనా? 
  • ఆదుకోలేదనడానికి మనసెలా వచ్చింది? 
  • సాయం చేస్తున్నా గిట్టదా?
  • కళ్లెదుట కనిపించడం లేదా వాస్తవాలు? 
  • సీజన్‌ ముగియకుండానే కరువు మండలాల ప్రకటన 
  • తుపాన్‌ పంట నష్టం అంచనాల్లో యంత్రాంగం నిమగ్నం 
  • సంక్రాంతిలోగా ఇన్‌పుట్‌ సబ్సిడీ అందించేందుకు సన్నాహాలు  

07.05AM, Dec 18th, 2023
బాబ్బాబూ.. మావోడి సభకు రావయ్యా

  • టీడీపీ-జనసేన పొత్తులో లుకలుకలు
  • పవన్‌కే చంద్రబాబు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంపై అలకబూనిన చినబాబు
  • అందుకే యువగళం ముగింపు సభకు రాలేనన్న పవన్‌
  • ఇంటికి వెళ్లి బతిమాలిన చంద్రబాబు
  • పైకి మాత్రం సీట్ల సర్దుబాటు చర్చలంటూ కవరింగ్‌

07.03AM, Dec 18th, 2023
సామాజిక న్యాయానికి చాంపియన్‌..సీఎం జగన్‌

  • స్కూళ్లలో డ్రాప్ అవుట్స్ ఉండకూడదని అమ్మ ఒడి పథకాన్ని తీసుకొచ్చిన సీఎం జగన్‌ 
  • గతంలో మన పిల్లల కోసం ఆలోచించిన సీఎంను చూశారా? 
  • సీఎం జగన్‌మోహన్ రెడ్డి మన బిడ్డల చదువులు, ఆరోగ్యం కోసం కృషి 
  • మహిళా సాధికారత కోసం చేయూత, కాపు నేస్తం
  • అగ్ర వర్ణాల్లో ఉన్న పేదలను గుర్తించి సీఎం జగనన్న 32లక్షల ఇళ్ళ స్థలాలు ఉచితం 
  • మహిళకు పుట్టింటి కానుకగా ఇంటి స్థలం
     

07.00AM, Dec 18th, 2023
పవన్‌ ఇంటికి చంద్రబాబు
• లోక్‌సభ ఎన్నికల్లో జనసేనతో పొత్తు ఉండదన్న బీజేపీ నేత కిషన్‌రెడ్డి
• టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఉంటుందని పలుమార్లు చెప్పిన పవన్‌
• కిషన్‌రెడ్డి ప్రకటనతో గందరగోళంలో ఇరు పార్టీలు..  దీంతో పవన్‌ వద్దకు వెళ్లి చర్చలు జరిపిన చంద్రబాబు
• లోకేశ్‌ పాదయాత్ర ముగింపు సభకు పవన్‌ను ఆహ్వానించేందుకే బాబు వెళ్లారంటున్న జనసేన
• సీట్ల సర్దుబాటు, బాబు పవన్‌ ఉమ్మడి సభలపై చర్చ కోసమంటున్న టీడీపీ

06.50AM, Dec 18th, 2023
ఓట్ల..కేటుగాళ్లు
• 
ఉనికి కోసం టీడీపీ సానుభూతిపరులతో బాబు బోగస్‌ వేషాలు
• తెలంగాణలో నివాసం, ఓటు.. ఏపీలోనూ ఓటర్లుగా నమోదు
• పోలింగ్‌ ముగిసిన మర్నాడే హైదరాబాద్‌లో టీడీపీ నేతల మేళా
• సానుభూతిపరులతో శిబిరాలు.. ఆన్‌లైన్‌లో భారీగా ఫామ్‌ 6 దరఖాస్తులు
• ఏపీలోనూ ఓటర్లుగా నమోదుకు  లక్షల సంఖ్యలో అప్లికేషన్లు
• ప్రజాప్రాతినిధ్య చట్టం 1950 సెక్షన్‌ 17 ప్రకారం ఒక వ్యక్తికి ఒక ఓటే ఉండాలి
• ఒకే వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ ఓట్లు కలిగి ఉండటం చట్ట ప్రకారం నేరం
• ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి.. అక్రమాలకు పాల్పడుతున్న టీడీపీ
• బాబు చూపిన బాటలోనే.. జనసేన 
• పవన్‌ సోదరుడు నాగేంద్రరావు (నాగబాబు), కుటుంబీకులకు హైదరాబాద్‌లో ఓట్లు.. వడ్డేశ్వరంలో ఉంటున్నామంటూ మళ్లీ ఓట్లకు దరఖాస్తు
• హైదరాబాద్‌లో ఓట్లున్న 4.30 లక్షల మందికి ఏపీలోనూ ఓట్లు.. వాటిని తొలగించాలని ప్రజాసంఘాల డిమాండ్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement