ఒంగోలు: ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని మాజీమంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం తిరుమలలో శ్రీవారిని బాలినేని దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బాలినేని దంపతులు అందించిన పట్టువస్త్రాలను స్వామివారికి అర్చక పండితులు వేదోక్తంగా సమర్పించారు.
స్వామివారి ఆలయ ఆవరణంలో ఉన్న రంగనాయక మండపంలో బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన సతీమణి శచీదేవిలకు వేదపండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు.
అనంతరం ఆలయం వెలుపల బాలినేని మీడియాతో మాట్లాడుతూ స్వామివారి వస్త్ర సేవ దొరకడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామన్నారు. కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు అందరికీ ఎల్లవేళలా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. పేదలకు అండగా ఉంటూ సంక్షేమ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మరింత శక్తిని ఇవ్వాలని స్వామిని కోరుకున్నానన్నారు. సమృద్ధిగా వర్షాలు పడి రైతులకు సిరులు కురవాలని స్వామిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment