సాక్షి, అమరావతి : కుడిగి ఎన్టీపీసీ కరెంట్‌కు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అవినీతి షాక్ తగిలిందని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. చంద్రబాబు కమీషన్ల కారణంగా వందల కోట్ల రూపాయల ప్రజా ధనానికి నష్టం వాటిల్లిందని మండిపడ్డారు. ప్రైవేటు సంస్థలకు అధిక ధరలు చెల్లించి విద్యుత్ కొనుగోలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. చంద్రబాబు సొంత మనుషులు నెలకొల్పిన కొన్ని సోలార్, విండ్ పవర్ ప్లాంట్లకు లబ్ధి చేకూర్చేందుకు.. కేంద్ర ప్రభుత్వ సంస్థ కుడిగి ఎన్టీపీసీ నుంచి తక్కువ ధరకు కరెంట్ వస్తున్న ఉద్దేశపూర్వకంగా కొనుగోళ్లు తగ్గించేశారని వెల్లడించారు. కానీ ఆ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం కారణంగా వందల కోట్ల రూపాయల ఫిక్స్ చార్జీలు చెల్లించాల్సి వచ్చిందని చెప్పారు.
చంద్రబాబు దుర్మార్గపు చర్యలు వల్ల కడిగి నుంచి రూ. 4.80కే కరెంట్ లభిస్తున్నా.. రూ.11.84 కొనుగోలుకు అప్పటి ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించిన పూర్తి వివరాలను గణంకాలతో ఆయన సహా ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment