సాక్షి, విజయవాడ: విద్యుత్ సంస్థలను లాభాల బాట పట్టించామని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రూ. 70వేల కోట్ల అప్పుల్లో ఉన్న విద్యుత్ సంస్థలను ఆదుకున్నామని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో విద్యుత్ సంస్థలను ముంచేశారని మండిపడ్డారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన విద్యుత్ సంస్థలను ఆదుకోవడానికి గడచిన ఏడాది కాలంలో 30 వేల కోట్ల రూపాయలపైగా ఇచ్చామని చెప్పారు. (చదవండి: అత్యవసర సేవల వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్)
వ్యవసాయానికి పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు. ఈ ఖరీఫ్ నాటికి నూరుశాతం లక్ష్యాన్ని చేరుకుంటామని పేర్కొన్నారు. 7 వేలకుపైగా జూనియర్ లైన్‌మెన్ పోస్టులు భర్తీ చేశామని, నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసమే మీటర్లు బిగిస్తున్నామని ఆయన వివరించారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. టీడీపీ హయాంలో విద్యుత్ ఒప్పందాలు, కొనుగోళ్లు అంతా అవినీతిమయమేని మంత్రి బాలినేని దుయ్యబట్టారు.(చదవండి: ‘ఒకేసారి 16 వేల ఇళ్ల పట్టాలు పంపిణీ’)
Comments
Please login to add a commentAdd a comment