బేస్ క్యాంప్ ఏర్పాటు చేసిన అధికారులు.. భయాందోళనలో రైతులు
పెద్దదోర్నాల: ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం పెద్దబొమ్మలాపురం గండిచెరువు ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నదనే సమాచారం ఆ ప్రాంతవాసులను ఆందోళనకు గురి చేస్తోంది. రైతులు పంట పొలాలకు వెళ్లాలంటేనే హడలిపోతున్నారు. గ్రామానికి చెందిన రైతులు శుక్రవారం వ్యవసాయ పనుల నిమిత్తం సమీపంలోని పంట పొలాలకు వెళ్లారు.
వారికి అదే ప్రాంతంలో సంచరిస్తున్న పెద్దపులి కంటబడింది. దీంతో హడలిపోయిన రైతులు అటవీశాఖాధికారులకు సమాచారం అందించారు. దీంతో స్పందించిన అధికారులు పెద్దపులి సంచరించిన ప్రాంతాల్లో పులి పాదముద్రలు సేకరించడంతో పాటు, అది సంచరించిన ప్రాంతాలను గుర్తించే పనిలో పడ్డారు.
ఇదిలా ఉండగా కొద్ది రోజుల కిందట అదే ప్రాంతంలో ఓ రైతుకు సంబంధించిన ఎద్దుపై పులి దాడి చేసిందన్న వార్త కూడా రైతుల్లో భయాందోళనలు కలగజేస్తోంది. ఈ ప్రాంతంలో చాలా కాలం నుంచి పెద్దపులి సంచారం ఉందని, దేవలూరు వద్ద బేస్ క్యాంప్‌ను ఏర్పాటు చేశామని అధికారులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment