వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది.
వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా భాన్సువాడలో ఆదివారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న హేమలత(23) గత కొన్ని రోజులుగా కుటుంబ కలహాలతో సతమతమవుతోంది. ఈ క్రమంలో ఈ రోజు ఇంట్లో ఎవరు లేని సమయంలో విగత జీవిగా వేలాడుతూ కనిపించింది.
ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి విచారణ చేపడుతున్నారు. కాగా.. భర్తే అదనపు కట్నం కోసం హత్య చేసి ఆత్మహత్యలా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.