
పోలాకి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర చరిత్ర సృష్టించిందని సినీనటుడు భానుచందర్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలోని డమర – రాంపురం మధ్య పాదయాత్ర సాగిస్తున్న వైఎస్ జగన్‌ను ఆదివారం ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు. జగన్‌తో కలిసి చాలా సేపు పాదయాత్రలో నడిచారు. పాదయాత్రలో విశేష ప్రజాదరణను చూసిన భానుచందర్.. జగన్ మోహన్‌రెడ్డిని అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏడాదికి పైగా ప్రజల్లో ఉండి సమస్యలను తెలుసుకుంటూ, ప్రజల్ని చైతన్యపరుస్తూ పాదయాత్ర చేయటం గొప్ప విషయమన్నారు. ఈ పాదయాత్ర రాజకీయాల్లో ఒక కొత్త చరిత్రగా నిలుస్తోందని కితాబిచ్చారు. రాజకీయాల్లో జగన్ అత్యంత ప్రభావ వంతమైన నాయకుడిగా ఎదిగారని, ఆయన్ను చూస్తే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గుర్తుకు వచ్చారని చెప్పారు. పాదయాత్ర విజయవంతమై.. జగన్ అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment