2020 చాలా గుణపాఠాలు నేర్పింది: సుమన్‌ | Actor Suman Talk On Temples Protection In Tirumala | Sakshi
Sakshi News home page

2020 చాలా గుణపాఠాలు నేర్పింది: సుమన్‌

Published Sun, Jan 3 2021 5:09 PM | Last Updated on Sun, Jan 3 2021 5:35 PM

Actor Suman Talk On Temples Protection In Tirumala - Sakshi

సాక్షి, తిరుమల: 2020 ఏడాది చాలా గుణపాఠాలు నేర్పిందని సినీ నటుడు సుమన్‌ అన్నారు. కరోనా వైరస్‌ కాలంలో పోలీసులు, డాక్టర్ల సేవలకు అభినందనలు తెలిపారు.  మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కుమార్తె వివాహానికి హాజరైన సుమన్‌.. రామతీర్థం ఘటనపై మీడియాతో మాట్లాడారు. ఈ ఘటన చాలా దురదృష్టకరమన్న సుమన్‌.. ప్రతి ఆలయం వద్ద సీసీ కెమెరాలు, భద్రత ఏర్పాటు చేయాలన్నారు. దేవుడి విషయంలో తప్పు చేస్తే శిక్ష పడక తప్పదన్నారు. ఆలయాలపై దాడులు చేయటం చాలా బాధాకరమని, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి చెడ్డపేరు తెవడానికి ఆలయాలపై ఇలా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆలయాల వద్ద నిఘా పెంచాలని, ఆలయాలపై జరిగే దాడులు కంట్రోల్ చేయాలన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement